జాతీయ వార్తలు

విభజన సమస్యల పరిష్కారానికి కమిటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చైర్మన్‌గా హోంశాఖ సహాయ కార్యదర్శి

న్యూఢిల్లీ, నవంబర్ 23: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన సమస్యల పరిష్కారంలో అనుసరించాల్సిన విధివిధానాలు సూచించేందుకు కేంద్రం ఒక కమిటీని నియమించింది. కేంద్ర హోంశాఖ సహాయ కార్యదర్శి అశోక్ కుమార్ అధ్యక్షతన ఏర్పడిన కమిటీ ఇంతకుముందే ఈ సమస్యల పరిష్కారానికి ఏర్పడిన ప్రధాన కమిటీకి అనుబంధంగా పనిచేస్తుంది. ఢిల్లీలోని ఆంధ్రప్రదేశ్ భవన్ రెసిడెంట్ కమిషనర్ అశోక్ సింఘాల్, తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్ శశాంక్ గోయల్ కమిటీలో సభ్యులుగా ఉంటారు. వీరితోపాటు రెండు రాష్ట్రాలకు చెందిన పునర్విభజన కమిటీ కార్యదర్శులు, రెండు రాష్ట్రాలకు సంబంధించిన ఆయా శాఖల కార్యదర్శులతోపాటు, అవసరమని భావించిన పక్షంలో కేంద్ర ప్రభుత్వ అధికారి ఒకరు సభ్యులుగా ఉంటారు. రెండు నెలల్లో కమిటీ తన నివేదికను ప్రభుత్వానికి అందిస్తుంది. కమిటీ మొదటి భేటీ ఈనెల 26న జరుగనుంది. పునర్విభజన చట్టంలో చేసిన హామీల్లో ఇంతవరకూ అమలుకాని హామీలపై చర్చించి పరిష్కార మార్గాలను సూచిస్తూ నివేదికను ఇవ్వాల్సి ఉంటుంది. విభజన జరిగిన ఏడాదిలోపు పునర్విభజన చట్టంలో పొందుపర్చిన సమస్యలు పరిష్కారం కానిపక్షంలో కేంద్రం జోక్యం చేసుకుని సమస్యలను పరిష్కరించాలి. అయితే ఇంతవరకూ రెండు రాష్ట్రాల మధ్య అనేక అంశాలపై రాజీ కుదరలేదు. తొమ్మిది, పదవ షెడ్యూల్‌లోవున్న ఉమ్మడి యాజమాన్య సంస్థల విభజనపై అంగీకారం కుదరలేదు. ఉద్యోగుల విభజన కొలిక్కిరాలేదు. సెక్షన్ ఎనిమిది అమలుపై రెండు రాష్ట్రాల మధ్య తీవ్ర వివాదం నడుస్తోంది. ఆస్తులు, అప్పుల పంపిణీపైనా ఒక అంగీకారం కుదరాల్సి ఉంది. పరిష్కారంకాకుండా పడివున్న సమస్యలను క్రోడీకరించి పరిష్కార మార్గాలను సూచిస్తామని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.