కృష్ణ

కోరలు చాచిన కల్తీ మహమ్మారి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* అడుగడుగున అన్నీ ఉల్లంఘనలే..!
* లిక్కర్ మరణాలపై పలు అనుమానాలు
* కృష్ణలంక.. ఆస్ప్రతుల వద్ద హాహాకారాలు
విజయవాడ , డిసెంబర్ 7: రోజు కూలీ చేసుకుంటూ బతుకీడ్చే బడుగులను కల్తీ మద్యం కాటేసింది. మృతుల కుటుంబాలు తమ పెద్ద దిక్కును కోల్పోయి దిక్కు తోచక పలు దిక్కులు చూస్తుంటే.. అస్వస్థతకు గురైన బాధిత కుటుంబాలు అల్లాడుతున్నాయి. ఈ తరహా ఘటనలకు జిల్లాకు కొత్తేమీ కాదు.. అప్పుడప్పుడు మరణ మృందంగం మోగించే చీఫ్ లిక్కర్ రక్కసి విశ్వరూపం మరోసారి చాటుకుంది. గతంలో మైలవరం మండలంలో కల్తీ సారా, నాసిరకం మద్యం సేవించి పదుల సంఖ్యలో మృత్యువాత పడిన ఘటనలను జిల్లా వాసులు మరలా ఇప్పుడు గుర్తు చేసుకుంటున్నారు. అయితే తాజా ఉదంతంతో ఉలిక్కిపడిన నగర వాసులకు ఘటన వెనుక చాలా అనుమానాలే ఉన్నాయి. కల్తీ లిక్కర్‌లోనా.. లేక నీటిలోనా అనేది ప్రస్తుతానికి ప్రశ్నార్థకంగానే ఉంది. మృతుల పోస్టుమార్టం నివేదిక.. మద్యం, నీరు శాంపిల్స్ రిపోర్టులు వచ్చిన తర్వాతే మద్యం మరణాలకు కారణం తెలుస్తుంది. ఏది ఏమైనా మద్యం మరణాలకు సదరు ‘ఎం హోటల్ ముసుగులో నడుస్తున్న స్వర్ణ బార్ అండ్ రెస్టారెంట్ యాజమాన్యమే బాధ్యత వహించక తప్పదు. కూలి.. నాలి చేసుకుంటూ రెక్కాడితేగాని డొక్కాడని బడుగు జీవులు ఎంతో మంది మద్యానికి అలవాటు పడటం సహజమే. తెల్లారిన ప్రతిరోజూ రోజువారి కూలికి వెళ్లే ముందు గుక్కెడు తీసుకునే అలవాటు ఉన్న వీరి జీవితాలు అదే మత్తులో తెల్లారిపోతాయని ఊహించనేలేదు. పనికి వెళ్లి తమవారు కొద్ది సేపటికే మృత్యువాత పడ్డారన్న వార్త వారి కుటుంబ సభ్యులు జీర్ణించుకోలేక పోతున్నారు. కృష్ణలంక నెహ్రూ నగర్ మెయిన్‌రోడ్డులో ఉన్న ఎం హోటల్ అండ్ లాడ్జి సెల్లర్‌లో మద్యం విక్రయాలు జరుగుతున్నాయి. పేరుకి స్వర్ణ బార్ అండ్ రెస్టారెంట్ అని చెబుతున్నా.. ఆ పేరుతో ఇక్కడ కనీసం బోర్డు కూడా లేకపోవడం గమనార్హం. ఎప్పటిలాగే సోమవారం ఉదయం 6 గంటలకే బార్ తెరుచుకుంది. మామూలుగానే కూలి నాలి పనులకు వెళ్లే బడుగులు చాలామంది మద్యం సేవించేందుకు వచ్చారు. కొన్ని గంటల తర్వాత ఇక్కడ మద్యం సేవించి తిరిగి వెళ్లినవారిలో కొందరు బార్ సమీపంలో, పరిసర రోడ్లపై అకస్మాత్తుగా పడిపోయారు. ఏం జరుగుతుందో తెలుసుకునే లోగా ఇక్కడ మద్యం తాగిన వారిలో సుమారు 36మంది వరకు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఇక రోడ్లపై పడిపోయిన వారిని వెంటనే ఆస్పత్రికి తరలించేసరికి వీరిలో కృష్ణలంకకు చెందిన లారీడ్రైవర్ నర్శిగోపి, వంటపనులు చేసుకునే మునగాల శంకరరావు, దొండపాటి నాంచారయ్య, మీసాల మహేష్, ఆకుల విజయ్‌కుమార్‌లు ప్రాణాలు వదిలేశారు. స్పందించిన అధికార యంత్రాంగం అస్వస్థతకు గురైన వారిని వెంటనే ప్రభుత్వాస్పత్రి నుంచి నగరంలోని వివిధ కార్పొరేట్ ఆస్పత్రులకు తరలించింది. వీరిలో పలువురికి కిడ్నీలు ఫెయిల్ కావడంతో పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. కాగా ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కలందర్ అలియాస్ భాషా మృత్యువాత పడినట్లు చెబుతున్నారు. ఈఘటనలో అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నవారిలో సురభి నాగబాబు, మిద్దెల సన్యాసిరావు, షేక్ సైదా, ఎం అక్కునాయుడు, నాసా వెంకట గోపికృష్ణ, షేక్ బయ్యా, గంగు శ్రీను, విజి వెంకట్రావ్, మీసాల సాహెబ్, నక్కా భుసిరెడ్డి, నక్కల సత్యం, దువ్వా గురుస్వామి, యాకూబ్ మరి కొంతమందితో కలిపి మొత్తం 36మంది బాధితుల సంఖ్యగా అధికారులు తెల్చారు. అస్వస్థతకు గురైన వారిలో 16మంది ఆంధ్రా ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా, రమేష్ ఆస్పత్రిలో ముగ్గురు, సెంటినీలో నలుగురు, ప్రభుత్వాస్పత్రిలో ఆరుగురు, పిన్నమనేనిలో ఒకరు చికిత్స పొందుతున్నారు. ప్రాణాలు కోల్పోయిన వారి మృతదేహాలను మార్చురీలో భద్రపరిచారు. మంగళవారం పంచనామా, పోస్టుమార్టం నిర్వహించనున్నారు. ఇటు ప్రభుత్వాస్పత్రి, కృష్ణలంక ప్రాంతంలోనూ మృతులు, బాధిత కుటుంబాల హాహాకారాలతో గంభీర వాతావరణం నెలకొంది. భార్య, బిడ్డల వేదన రోదనలతో దద్దలిల్లింది.
* ఉల్లంఘనలు ఇలా..
ఘటన జరిగిన ఎం హోటల్ లాడ్జిలో మద్య విక్రయాల్లో అనేక ఉల్లంఘనలు చోటు చేసుకున్నాయి. మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు బంధువులైన భగవత్ శరత్ చంద్ర, కావూరి పూర్ణ చంద్రశర్మ, కావూరి లక్ష్మీ సరస్వతి, మల్లాది బాలా త్రిపుర సుందరమ్మ ఈ నలుగురు పేర్లతో బార్ అండ్ రెస్టారెంట్ లైసెన్స్ ఉంది. అయితే కార్పొరేషన్ నుంచి మాత్రం ఎలాంటి అనుమతి పొందలేదు. మద్య విక్రయాలు సెల్లార్ నిర్వహించడం, పారిశుద్ధ్యం పూర్తిగా పాటించకపోవడం, అదేవిధంగా నీటిని సరఫరా చేసే ట్యాంకు, కూలర్‌లు శుభ్రపర్చకపోవడం, దీనికి తోడు చీఫ్ లిక్కర్ పలు రకాలు కలిపేసి అతి తక్కువ ధరకు విక్రయాలు జరపడం ఇవన్నీ ఐదుగురు ప్రాణాలు కోల్పోవడం, ఇంతమంది అస్వస్థతకు గురి కావడానికి దోహదపడ్డాయి. పైగా స్వర్ణ బార్ అండ్ రెస్టారెంట్ అని చెబుతున్నట్లు ఎలాంటి బోర్డు లేకపోవడం, అన్నింటికి మించి ఉదయం 6 గంటల నుంచే మద్యం విక్రయాలు జరపడం తీవ్ర ఉల్లంఘనగా గోచరిస్తోంది. ఘటన జరగగానే బార్ ప్రాంతాన్ని మంత్రి కొల్లు రవీంద్ర, స్థానిక ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, పోలీసు కమిషనర్ గౌతం సవాంగ్, డిసిపి కాళిదాసు రంగారావు, ఏసిపి ప్రభాకర్‌బాబు, నగర పాలక సంస్థ చీఫ్ మెడికల్ ఆఫీసర్ గోపి నాయక్, ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ చంద్రశేఖర నాయుడు, సూపరింటెండెంట్ ఎన్‌వి రమణ తదితరులు పరిశీలించి వెళ్లారు.
* శాంపిల్స్ సేకరణ
ఎం హోటల్ సెల్లార్‌లోని మద్యం విక్రయాల బార్‌లో మందు తాగి మృత్యువాత పడిన సమాచారం అందగానే ఘటనాస్థలికి చేరుకున్న ఎక్సైజ్ అధికారులు, పోలీసులు బార్‌ను సీజ్ చేశారు. అప్పటి వరకు అమ్మకాలు జరిపిన మద్యంతోపాటు, బార్‌లో ఉన్న అన్ని రకాల లిక్కర్‌ను శాంపిల్స్ సేకరించారు. వీటితోపాటు నీటి శాంపిల్స్‌ను కూడా నగర పాలక సంస్థ అధికారులు పరీక్షించి నివేదికకు పంపారు.