'క్లాప్' కొట్టు గురూ!

హాట్ బ్యూటీ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘హెబ్బా..హెబ్బా..’’ అంటున్నారు తాజాగా టాలీవుడ్ జనాలు. ‘అలా ఎలా’ ఈ అమ్మడు నటించిన తొలి చిత్రం. ఈ సినిమాలో నటించినందుకు ఎలాంటి రెమ్యూనరేషన్ తీసుకోలేదట. తాజాగా ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ చిత్రానికి గాను పాతిక లక్షలకు పైనే పారితోషికం అందుకుందట. చేసిన చిత్రాలు వేళ్ల మీదనే వున్నా, క్రేజ్‌ని మాత్రం బాగానే సంపాదించుకుంది. ఇదే ఊపులో తాజాగా నాలుగైదు చిత్రాల్లో నటిస్తోంది. ఇలా చూస్తుండగానే బిజీగా మారిపోవడంతో రెమ్యూనరేషన్ కూడా పెంచేసిందట. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనే సామెతను మన స్టార్స్ బాగానే ఫాలో అవుతుంటారు. తాజాగా ఈ బ్యూటీ కూడా అదే ఫార్ములాను ఫాలో అవుతుందని జోరుగా ప్రచారం జరుగుతోంది. యూత్‌లో మంచి ఫాలోయింగ్‌ని సాంపాదించుకున్న ఈ సుందరాంగి అదే రీతిలో తన పారితోషికాన్ని కూడా అమాంతం పెంచేసిందని అంటున్నారు. సెకండ్ హీరోయిన్‌గా చేసేందుకు కూడా ఏ మాత్రం వెనుకాడటం లేదు. దాంతో నిర్మాతలు హెబ్బా అడిగినంత ఇవ్వడానికి ముందుకొస్తున్నారట. ఈ భామ తాజా చిత్రాలు ‘ఏంజెల్’, ‘అందగాడు’, ‘మిస్టర్’ సినిమాల్లో ఏ ఒక్కటీ హిట్టయినా పారితోషికాన్ని మరింతగా పెంచడం ఖాయం అంటున్నారు సినీ ప్రముఖులు. మొత్తానికి ‘కుమారి’గా తెలుగు ప్రేక్షకులను తన అందంతో బాగా ఆకట్టుకున్న హెబ్బా..పారితోషికానికే ప్రాధాన్యత ఇస్తుందన్నది నిజమే మరి!!

-సమీర్