కృష్ణ

పక్కాగృహాల కేటాయింపులో భారీ కుంభకోణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* యుసిడి, హౌసింగ్ సిబ్బంది చేతివాటం
* సిబ్బంది అవినీతి చేష్టలపై నోరు మెదపని విఎంసి అధికారులు
విజయవాడ , నవంబర్ 23: నగరంలో నిర్మిస్తున్న ఎఎన్‌ఎన్‌యుఆర్‌ఎం పక్కాగృహాల కేటాయింపు పేరిట మరో అవినీతి కుంభకోణం వెలుగులోకి వచ్చింది. ఈ ఉదంతంలో విఎంసి యుసిడికి చెందిన యుసిడి సిడివో, సివో సోషల్ వర్కర్ల చేతివాటం చూపిన వైనం వెలుగులోకి వచ్చింది. సొంత ఇంటి కోసం తహతహలాడే పేద, మధ్య తరగతి వర్గాలనే టార్గెట్ చేసుకొని మాయ మాటలతో వారిని నమ్మించి కోట్లాది రూపాయలను వసూలు చేసిన అవినీతి తిమింగలాలపై విఎంసి కార్యాలయంలో పుకార్లు షికార్లు చేస్తున్నా విఎంసి ఉన్నతాధికారుల్లో కనీస చలనం లేకపోవడం గమనార్హం. వాస్తవానికి గృహ కేటాయింపులో ఉన్నా నిబంధనలను తుంగలోకి తొక్కి అంతా తామే చూసుకొంటామంటూ సిబ్బందే బ్రోకర్ల అవతారం ఎత్తారు. గతంలో కొంత మంది ప్రైవేటు వ్యక్తులు ఇటువంటి చర్యలకు పాల్పడ్డ నేపథ్యంలో వారిపై క్రిమినల్ కేసులను నమోదు చేయించిన హౌసింగ్ అధికారులు ఇప్పుడు స్వయంగా విఎంసి యుసిడి, హౌసింగ్ అధికార, సిబ్బందే ప్రస్తుత ఎడిసోడ్‌లో ప్రధాన పాత్రదారులవ్వడంతో ఎవరూ నోరు మెదపడం లేదు. ప్రస్తుత ఈ ఎపిసోడ్‌లో వన్‌టౌన్‌లోని వస్తల్రత దుకాణాల్లో పనిచేసే కార్మికులు టార్గెట్ అయ్యారు. సుమారు 122 మంది వద్ద ఒకొక్కరి వద్ద లక్షా యాభైవేలను వసూలు చేసినట్టు సమాచారం, కాగా వసూలు చేసి నెలలు కాదు గదా ఏళ్లు దాటుతున్నా గృహాల కేటాయింపు జరగకపోవడతో అందరూ కలిసి స్థానిక ఎమ్మెల్సీ వద్దకు వెళ్లి తమ గోడును వెళ్లగక్కుకోగా అందుకు స్పందించిన ఆయన వసూలుకు సారధ్యం వహించిన అప్పలరాజు అనే యుసిడి ఉద్యోగిని పిలిచి తీసుకొన్న డబ్బును తిరిగి ఇచ్చేయాలని ఆదేశించడమే కాకుండా అందుకు హామీగా అప్పలరాజు బ్యాంకు చెక్కులు, ఇతర పత్రాలను స్వాధీనం చేసుకొన్నట్టు సమాచారం. ఇంతటితో కథ సుఖాంతమైందంటూ అందరూ ఊపిరి పీల్చుకొన్నారు. తమకు జరిగిన అన్యాయం గురించి బాధితులు అనుకోని విధంగా బహిర్గతం చేయడంతో కథ మళ్లీ మొదటికి వచ్చింది. ప్రస్తుతం జరిగిన అవినీతి ఉధంతంలో విఎంసి సిడివో తోపాటు కమ్యూనిటీ ఆర్గనైజర్, సోషల్ వర్కర్ల పేర్లు కూడా బహిరంగంగా వినిపిస్తున్నాయి. హౌసింగ్ అధికారుల అండతోనే ఈ ప్రక్రియకు ప్రాణం పోసుకొందంటున్న యుసిడి సిబ్బంది వాదన వెనుక నూటికి నూరుపాళ్ల నిజం లేకపోలేదు. మొత్తం 122 మంది వద్ద నుంచి కోటి 90 లక్షల రూపాయలు వసూలు చేశారంటే గృహాల కేటాయింపులో అధికారులు అవలంభిస్తున్న తీరును అంచనావేయవచ్చు. అయితే వసూలైన కోటి 90 లక్షలు వాటాదారులందరూ సమానంగా పంచుకోగా ఒక్కరి పేరే బహిర్గతం కావడంతో ఎవరికి వారు చెప్పు కింద తేలులాగా కిమ్మనకుండా ఉన్నారు. ఈవిషయంలో విఎంసి అధికారులు విచారణ చేపట్టితే మరికొన్ని అవినీతి చర్యలు వెలుగులోకి రాగలవన్నది జగమెరిగిన సత్యం.

కమ్యూనిస్ట్, తెలుగుదేశం పార్టీల కృషితో.. చైనా-భరత్ ప్రజల మధ్య సత్సంబంధాలు
* ఉభయుల భేటీలో చంద్రబాబు, ఛెన్ పెంగ్జియాంగ్ వెల్లడి
విజయవాడ, నవంబర్ 23: ‘గతంలో జరిగిందేదో జరిగింది. భవిష్యత్ మనది కావాలి. చైనా కమ్యూనిస్టు పార్టీ, తెలుగుదేశం పార్టీల కృషితో చైనా-భరత దేశాల ప్రజల మధ్య సత్సంబంధాలు నెలకొనేందుకు నేటి ఉభయుల కలయిక నాంది కావా’లంటూ.. చైనా దేశ ఉప మంత్రి ఛెన్ పెంగ్జియాంగ్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆశాభావం వ్యక్తం చేశారు. రెండురోజుల పర్యటనకు నగరానికి చేరుకున్న ఛెన్ పెంగ్జియాంగ్ తన బృందంతో కలిసి చంద్రబాబుతో ప్రత్యేకంగా, తరువాత తెలుగుదేశం పార్టీతో కలిసి సంయుక్తంగానూ రాజకీయ అంశాలపై కూలంకషంగా చర్చించారు. ఉభయుల సంబంధాలు మరింత బలపడటానికి తెలుగుదేశం పార్టీ ప్రతినిధులు చైనా పర్యటించాల్సిందిగా ఆయన ఆహ్వానించారు. చైనా కమ్యూనిస్టు పార్టీ తెలుగుదేశంతో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా వుందన్నారు. రెండు దేశాల ప్రజలతో పాటు మన రెండు పార్టీల మధ్య సత్సంబంధాలు నెలకొనేలా చూడాలని ఆయన కోరారు. చంద్రబాబు స్పందిస్తూ ఇందుకు తాము సిద్ధంగానే వున్నామని వెల్లడించారు. ఉభయుల భేటీ అనంతరం ఛెన్ పెంగ్జియాంగ్ మాట్లాడుతూ చంద్రబాబు దార్శనికతకు తానెంతో ముగ్దుడనయ్యానని చెప్పారు. రాష్ట్ర విభజన అనంతరం తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నప్పటికీ ప్రపంచంలోనే అద్భుతమైన రాజధాని నిర్మాణం కోసం, రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోసం బాబు ఎంతగానో కష్టపడుతున్నారంటూ ప్రశంసల వర్షం కురిపించారు. అమరావతి నిర్మాణం కోసం ఆయన తన గ్రాండ్ విజన్‌ను చూపించారంటూ ఎంతో ధైర్యంగా సవాళ్లను ఎదుర్కొంటూ సమస్యలను పరిష్కరిస్తున్నారని కొనియాడారు. రాజధాని స్వప్నాన్ని తెల్లకాగితంపై అద్భుతంగా చిత్రీకరించారని, ప్రజలంతా ఆయన నాయకత్వంలో తమ కలను సాకారం చేసుకోటానికి పనిచేస్తున్నారని అన్నారు. అందమైన చిత్రాన్ని గీయవచ్చు.. కానీ స్వప్నం నిజం కావటానికి దార్శనికత అవసరమన్నారు. పైగా మంచి ఆలోచన కూడా వుండాలని, ఇవన్నీ చంద్రబాబులో వున్నాయన్నారు. గత ఏప్రిల్‌లో బాబు చైనాలో పర్యటించారని, ఇక అప్పటి నుంచి తమ సంబంధాలు బలపడ్డాయంటూ అమరావతి నిర్మాణంలో చైనా కంపెనీలకు అనేక అవకాశాలు వస్తాయని తాము విశ్వసిస్తున్నట్టు చెప్పారు. గ్రీన్ అండ్ బ్లూ కానె్సప్ట్‌తో రాజధాని నిర్మాణం చేపడతారని తెలిసి తామెంతో సంతోషిస్తున్నామని, ఆ భావన తనకెంతో నచ్చిందని చెప్పారు. నిర్మాణం పూర్తయ్యేనాటికి అమరావతి నగరంలో పక్షుల గానం వినపడుతుందన్నారు. ప్రపంచంలో ఐదు ఉత్తమ నగరాల్లో అమరావతి ఒకటిగా నిలవాలన్న బాబు ఆకాంక్ష నెరవేరుతుందని వ్యాఖ్యానించారు. నూతనంగా ఆలోచన చేయటమేగాక నవ్యతతో ముందుకు సాగటం వల్ల ఇది సాధ్యమవుతుందన్నారు. అమరావతి నిర్మాణంలో ప్రపంచంలో వున్న ప్రతిభను, నైపుణ్య పద్ధతులను ఉపయోగించుకుంటారనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. తాము కొద్దిరోజుల క్రితమే చైనా కమ్యూనిస్టు పార్టీ 18వ మహాసభలు నిర్వహించామని, తమ దేశాభివృద్ధికి తమ ఆలోచనలను ప్రతినిధుల ముందు వుంచామంటూ భారత్-చైనాల మధ్య ఆర్థికాభివృద్ధిలో అనేక పోలికలు వున్నాయని చెప్పారు. తాము చైనాలో డిజిటల్ చైనా కోసం ఇంటర్నెట్ ప్లస్ ఇనీషియేట్ కార్యక్రమాన్ని చేపట్టామని, భారత్ కూడా అదే భావనతో డిజిటల్ ఇండియా కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు. భారత్‌లోని రాష్ట్రాలతో చైనా మరింత దృఢ సంబంధాలు ఏర్పరచుకునే దిశగా తమ పార్టీ కృషి చేస్తోందని ఆయన చెప్పారు. పరస్పర అవగాహన, దేశీయ వ్యవహారాల్లో జోక్యం చేసుకోకపోవటం, సమానత్వం, పరస్పర సహకారం అనే నాలుగు సూత్రాల ఆధారంగా తాము తెలుగుదేశం పార్టీతో సంబంధాలు బలపర్చుకుంటున్నామని చెప్పారు. కమ్యూనిస్టు పార్టీకి ప్రపంచంలోని 180 దేశాల్లోని 800 పార్టీలతో సత్సంబంధాలున్నాయని, అందులో తాము వివిఐపిలు కావచ్చని చంద్రబాబు ఆకాంక్షించారు. చైనాలో పార్టీకి, ప్రభుత్వానికి వున్న సంబంధాలపై తెలుగుదేశం విప్ ధూళిపాళ్ల నరేంద్ర అడిగిన ప్రశ్నకు ఛెన్ పెంగ్జియాంగ్ స్పందిస్తూ ఒక్కమాటలో సమాధానం చెప్పటం కష్టమన్నారు. దీనిపై తెలుగుదేశం నాయకులు చైనాలో పర్యటించి అధ్యయనం చేయాలని సూచించారు. చైనాలో 8 ప్రజాస్వామ్య పార్టీలున్నాయని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. తాము ప్రస్తుతం 13వ పంచవర్ష ప్రణాళికను రూపొందిస్తున్నామని, పార్టీ ద్వారా ఈ ప్రణాళిక ముసాయిదాను కేంద్ర కమిటీకి పంపిస్తామని, అప్పుడు కేంద్ర కమిటీ అంగీకార యోగ్యమైన డ్రాఫ్ట్‌ను అత్యున్నతమైన పార్లమెంట్‌కు పంపిస్తుందని చెప్పారు. ప్రతి ఏటా డ్రాఫ్ట్ కమిటీ సమావేశమవుతుందని, వచ్చే మార్చిలో ఈ సమావేశం వుంటుందని చెప్పారు. పీపుల్స్ కాంగ్రెస్ వచ్చే సమావేశాల్లో ప్రధాన ఎజెండా 13వ పంచవర్ష ప్రణాళికా ముసాయిదా ధ్రువీకరణేనని ఛెన్ పెంగ్జియాంగ్ తెలుగుదేశం పార్టీ ప్రతినిధులకు వివరించారు.

నిఘా సంస్థల హెచ్చరికలతో నగరం అప్రమత్తం
విజయవాడ , నవంబర్ 23: కేంద్ర నిఘా వర్గాల హెచ్చరికలతో నగర పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. ప్రపంచంలో ప్రస్తుతం తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్న తీవ్రవాద కార్యకలాపాల నేపథ్యంలో దేశవ్యాప్తంగా అలర్ట్ ప్రకటిస్తూ కేంద్ర నిఘా సంస్థలు రాష్ట్ర ప్రభుత్వాలను అప్రమత్తం చేశాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో అల్‌ఖైదా ఉగ్రవాద సంస్థకు చెందిన తీవ్రవాదులు దాడులకు పాల్పడే అవకాశం ఉందంటూ నిఘా వర్గాలు చేసిన హెచ్చరికలతో తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు పోలీసు యంత్రాంగాన్ని అప్రమత్తం చేశాయి. దీనిలోభాగంగా రాష్ట్ర రాజధాని నగరంలో భద్రత మరింత కట్టుదిట్టమైంది. హెచ్చరికలతో అప్రమత్తమైన నగర పోలీసు యంత్రాంగం ప్రత్యేక భద్రతా చర్యలు చేపట్టింది. ఎప్పటి నుంచో నగరానికి నక్సల్స్, ఉగ్రవాదులకు షెల్టర్ జోన్‌గా పేరుంది. దీనికితోడు గతంలో కూడా పలు సందర్భాల్లో నగరంలో ఉగ్రవాద సంస్థలు పేలుళ్లకు పాల్పడిన దాఖలాలు ఉన్నాయి. ఉగ్రవాదులు తలదాచుకున్న ఘటనలు కూడా వెలుగుచూశాయి. ముఖ్యంగా జిల్లాలోని కొన్ని ప్రాంతాలు ఉగ్రవాద కార్యకలాపాలకు కేంద్రంగా కూడా మారినట్లు స్థానిక నిఘా సంస్థలే చెబుతున్నాయి. ఆతర్వాత క్రమంలో కార్యకలాపాలు తగ్గుముఖం పట్టినా షెల్టర్ జోన్ అనే అంశాన్ని మాత్రం నిఘా వర్గాలు కొట్టిపారేయలేని స్థితి. అయితే ప్రస్తుతం రాష్ట్ర విభజన అనంతరం నగరానికి ప్రాధాన్యత పెరగడం, ముఖ్యమంత్రి సహా పాలనా యంత్రాంగం ఇక్కడే ఉండి పరిపాలన సాగించడంతో పాటు రాష్ట్ర రాజధానిగా పేరొందిన క్రమంలో తాజా హెచ్చరికలతో నగర పోలీసు యంత్రాంగం భద్రతపరంగా మరింత కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోంది. సీఎం క్యాంపు కార్యాలయంతో పాటు రైల్వేస్టేషన్, బస్టాండు, దుర్గగుడి, ఇతర ముఖ్యమైన ప్రదేశాలు, మాల్స్, ప్రముఖ సంస్థలు, తదితర చోట్ల భద్రత మరింత పెంచడంతో పాటు నగరంలో ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు. ముఖ్యమైన ప్రదేశాల్లో ప్రత్యేక పికెట్లు ఏర్పాటు చేశారు.

ఆటోనగర్‌లో కేంద్ర ఎక్సైజ్ కార్యాలయం ప్రారంభం
పటమట, నవంబర్ 23: నూతన రాజధానిలో సరికొత్తగా ప్రారంభిస్తు న్న కేంద్ర ఎక్సైజ్ కార్యాలయం ద్వారా పన్ను చెల్లింపుదారులకు మెరుగైన సేవలందించంటం ద్వారా సేవలలో మేటిగా నిలవాలని కస్టమ్స్, సెంట్రల్ ఎక్సైజ్, సర్వీస్ టాక్స్ ఎ.పి. చీఫ్ కమిషనర్ ఆర్.శకుంతల కోరారు. సోమవారం ఇండస్ట్రీయల్ ఎస్టేట్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన సెంట్రల్ ఎక్సైజ్ డివిజనల్ కార్యాలయాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో అమె పాల్గొని మాట్లాడుతూ ఎక్సైజ్ శాఖను ఆర్థిక పరంగా ముందుకు తీసుకెళ్లడం ఉద్యోగుల అందరి బాధ్యత అన్నారు. లక్ష్యాలను చేరుకోవడం కోసం అవసరమైన అత్యుత్తమ విధానాలు, సాంకేతికతలు, నైపుణ్యాలు ఉద్యోగులు అందిపుచ్చుకోవాలన్నారు. ఉద్యోగులకు అవసరమైన అన్ని సౌకర్యాలు, ప్రయోజనాలకు అధిక ప్రాధాన్యత ఇస్తామన్నారు. ఉద్యోగులందరి సహకారంతో కస్టమ్స్, ఎక్సైజ్ వ్యవస్థను మరింత బలోపేతం చేస్తామన్నారు. సెంట్రల్ ఎక్సైజ్ కమిషనర్ జెఎస్. చంద్రశేఖర్ మాట్లాడుతూ సుపారిపాలనే లక్ష్యంగా ఎక్సైజ్ కార్యాలయాలకు కార్పొరేట్ లుక్ ఇస్తామన్నారు. తమ శాఖలకి సంబంధించి కృష్ణా, గుంటూరు, పశ్చిమ గోదావరి జిల్లాలలోని అన్ని కార్యాలయాల్లో పరిశుభ్రతకు, ఆహ్లదకర వాతావరణానికి పెద్దపేట వేస్తున్నామన్నారు. కస్టమ్స్ కమిషనర్ ఎస్‌కె. రెహమాన్ మాట్లాడుతూ ఉద్యోగులు వృత్తిని ప్రేమించాలన్నారు. కార్యసాధనకే నిరంతరం కృషి చేయాలన్నారు. ప్రభుత్వ ఆర్థిక పరిపుష్టికి ఉద్యోగుల సేవలే ఎంతో కీలకమన్నారు. ఎక్సైజ్ అప్పీల్స్ కమిషనర్ ఆర్.మంగబాబు మాట్లాడుతూ అధికారులు, పన్ను చెల్లింపుదారుల మధ్య స్నేహపూర్వక వాతావరణం ఉండాలని సూచించారు.