హైదరాబాద్

కేంద్రం దృష్టికి ఆర్వోబి స్థల సేకరణ వివాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 27: వేగంగా పట్టణీకరణ పెరుగుతున్న జిహెచ్‌ఎంసి పరిధిలో ఏ అభివృద్ధి చేపట్టిన స్థల సేకరణ అనేది అధికారులకు పెద్ద సమస్యగానే మారుతోంది. కొన్ని అభివృద్ధి పనులకు సంబంధించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన సంస్థలే స్థలాలిచ్చేందుకు ముందుకు రాని పరిస్థితి నెలకొంది. ఫలితంగా రాష్ట్ర ప్రభుత్వం పలు ప్రతిపాదనల విషయంలో నేరుగా కేంద్ర ప్రభుత్వాన్ని ఆశ్రయించాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. సఫిల్‌గూడలో నిర్మించనున్న ఆర్వోబి విషయంలోనూ సరిగ్గా ఇదే జరిగింది. ఈ వంతెన నిర్మాణానికి అవసరమైన 23 ఎకరాల రక్షణ శాఖకు చెందిన స్థలాన్ని ఇచ్చేందుకు ఆ శాఖకు చెందిన కొందరు అధికారులు అనుకూలంగా లేరు. ఇటీవలే మున్సిపల్ మంత్రి కెటిఆర్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో సుమారు రూ. 2.95 కోట్ల విలువ చేసే తమ భూమిని ఆర్వోబికి ఇవ్వాలంటే తమకు ప్రత్యామ్నాయంగా గ్రేటర్ పరిధిలో జిహెచ్‌ంసికి చెందిన స్థలాన్ని ఇవ్వాలని సూచించారు. కానీ జిహెచ్‌ఎంసి పరిధిలో ఒకే చోట 23 ఎకరాల స్థలం లేకపోవటంతో అధికారులు తలలు పట్టుకోవాల్సిన పరిస్థితులు తలెత్తాయి. శివార్లలోని సఫిల్‌గూడ రైల్వే క్రాస్ నుంచి సుమారు 2.91 కిలోమీటర్ల పొడవున నిర్మించనున్న ఆర్వోబికి ఏళ్ల క్రితం ప్రతిపాదనలు తయారు చేసినా, ఇందుకు పట్టిన స్థల సేకరణ గ్రహణం ఇంకా వీడనేలేదు. రాష్ట్రంఆవిర్భవించక ముందు సమైక్యాంధ్ర ప్రభుత్వం హయాంలో రూపకల్పన చేసిన ఈ ప్రతిపాదనకు నిధులు పుష్కలంగా ఉన్నా, స్థల సేకరణకు సంబంధించి అనుకోని ఇబ్బందులు తలెత్తుతున్నాయి. రక్షణ శాఖ అధికారులు అడిగిన విధంగా ప్రత్యామ్నాయంగా భూమి ఇవ్వలేని పరిస్థితులు తలెత్తినందున ఈ ఆర్వోబి ప్రతిపాదనపై ఎలాంటి నిర్ణయం తీసుకోవాలని కోరుతూ అధికారులు ప్రతిపాదనలను ముఖ్యమంత్రి కెసిఆర్ పరిశీలనకు పంపినట్లు సమాచారం. అయితే దీనిపై త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖతో చర్చించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలిసింది. స్థల సేకరణతో పాటు అన్నీ సిద్ధంగా ఉంటే కేవలం 18 నుంచి 24 నెలల వ్యవధిలో నిర్మించనున్న ఈ సఫిల్‌గూడ ఆర్వోబి పనులు స్థల సేకరణ వివాదం నుంచి ఏళ్ల నుంచి పెండింగ్‌లో పడుతూనే వస్తున్నాయి. ఇప్పటికైనా ముఖ్యమంత్రి కెసిఆర్ జోక్యంతోనైనా పరిష్కారమవుతుందని ఆశిద్దాం.
1నుంచి క్యాన్సర్
నిర్ధారణ పరీక్షలు
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, ఏప్రిల్ 27: వచ్చే నెల మే 1వ తేదీ నుంచి బషీర్‌బాగ్‌లోని సక్సేనా హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచితంగా క్యాన్సర్ నిర్దారణ పరీక్షలు నిర్వహించనున్నట్లు ప్రముఖ వైద్య నిపుణులు, ఎన్విరాన్‌మెంట్ మెడిసన్ స్పెషలిస్టు డా. ప్రవీణ్‌కుమార్ తెలిపారు. బుధవారం ఆయన దోమల్‌గూడలోని ఎస్‌ఎంఎస్ మీడియా సెంటర్‌లో విలేఖర్లతో మాట్లాడుతూ ఈ శిబిరంలో రకరకాల పరీక్షలను సైతం పూర్తిగా ఉచితంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. వ్యాధి వచ్చాక కాకుండా ముందే రొమ్ము క్యాన్సర్‌ను గుర్తించే ‘్ధర్పోస్కాన్’ అత్యాధునిక యంత్రాన్ని ఇటీవలే విదేశాల నుంచి దిగుమతి చేసుకున్నామని, దీని ద్వారా క్యాన్సర్‌కు దారితీసే కణాలను కూడా ముందుగానే గుర్తించవచ్చునని వివరించారు.
భారీగా కల్తీనెయ్యి స్వాదీనం
సైదాబాద్, ఏప్రిల్ 27: గుట్టుచప్పుడు కాకుండా కల్తీ నెయ్యి తయారు చేసి మార్కెట్‌లో విక్రయిస్తున్న స్థావరంపై దాడులు నిర్వహించిన తూర్పుమండల టాస్క్ఫోర్స్ పోలీసులు భారీ నిల్వలను స్వాధీనం చేసుకొని ఇద్దరిని అరెస్టు చేశారు. సైదాబాద్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం చంపాపేట్ కుమ్మరిబస్తీలో నివాసం ఉండే గాజుల నట్రాజ్(38) ఇంటి వద్దనే వెంకటేశ్వర డెయిరీ ఫామ్ నిర్వహిస్తున్నాడు. అందులోనే కొంతకాలంగా వనస్పతి, పలుక్రీములు, నూనెలతో కల్తీనెయ్యి తయారు చేయడం మొదలు పెట్టాడు. ఇలా తయారు చేసిన కల్తీనెయ్యిని సితార ఆగ్‌మార్క్ స్వచ్ఛమైన నెయ్యి పేరుతో అమ్మకాలు సాగిస్తున్నాడు. విశ్వసనీయ సమాచారంతో టాస్క్ఫోర్స్ పోలీసులు మంగళవారం రాత్రి డెయిరీ ఫామ్‌పై దాడులు నిర్వహించారు. అక్కడ నిల్వచేసి ఉన్న 930 లీటర్ల కల్తీనెయ్యి, కల్తీనెయ్యికి ఉపయోగిస్తున్న 700 లీటర్ల క్రీములు, 90 లీటర్ల నూనె, 80 లీటర్ల డాల్డాను స్వాదీనం చేసుకున్నారు. కల్తీ నెయ్యి తయారీదారుడు నాగరాజు, అతనికి సహకరిస్తున్న డ్రైవర్ వాసుపల్లి జోజిబాబు(35)లను అదుపులోకి తీసుకున్నారు. తదుపరి విచారణ నిమిత్తం వారిని సైదాబాద్ పోలీసులకు అప్పగించారు. టాస్క్ఫోర్స్ అడిషనల్ కమీషనర్ కోటిరెడ్డి పర్యావేక్షణలో ఇన్‌స్పెక్టర్ శ్రీ్ధర్, ఎస్‌లు ఎ.సుధాకర్, ఎ. శ్రీనివాసులు ఆకస్మిక దాడుల్లో పాల్గొన్నారు. తాళం వేసిన ఇళ్లు టార్గెట్
పాత నేరస్థుడి అరెస్టు
నేరేడ్‌మెట్, ఏప్రిల్ 27: తాళం వేసి ఉన్న ఇళ్లను ఎంచుకుని దొంగతనాలకు పాల్పడుతున్న పాత నేరస్థుడిని అరెస్టు చేసి అతని వద్ద నుండి 12 లక్షల రూపాయలు విలువ చేసే బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్న సంఘటన మల్కాజిగిరి పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. బుధవారం మల్కాజిగిరి పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో మల్కాజిగిరి ఎసిపి రవిచందన్‌రెడ్డి, సిఐ శేఖర్‌గౌడ్, ఎస్‌ఐ హఫీజుద్దీన్ వివరాలు వెల్లడించారు. వైజాగ్‌కు చెందిన అనిల్‌కుమార్ చక్రవర్తి అలియాస్ అనిల్ అలియాస్ పులి పాత నేరస్థుడు. రాత్రి వేళల్లో తాళాలు వేసి ఉన్న ఇళ్లను ఎంచుకుని దొంగతనాలు చేస్తూ తప్పించుకు తిరుగుతున్నట్టు ఎసిపి తెలిపారు. మేడిపల్లి, మల్కాజిగిరి పోలీస్‌స్టేషన్ పరిధిలో 8 దొంగతనాలకు పాల్పడినట్టు పోలీసులు తెలిపారు. దొంగతనం కేసులో గతంలో జైలుకు వెళ్లిన అనిల్ ఇటీవల విడుదలై వౌలాలి రైల్వే రిజర్వేషన్ కౌంటర్ వద్ద అనుమానాస్పదంగా తిరుగుతుండగా పోలీసులు పట్టుకుని ప్రశ్నించడంతో అసలు విషయం చెప్పాడు. వెంటనే అనిల్‌ను అరెస్టు చేసి 50 తులాల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్టు ఎసిపి తెలిపారు.
క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ముగ్గురి అరెస్టు
నేరేడ్‌మెట్, ఏప్రిల్ 27: గుట్టు చప్పుడు కాకుండా అపార్ట్‌మెంట్‌లో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ముగ్గురిని అరెస్టు చేసిన సంఘటన మల్కాజిగిరి పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. సిఐ శేఖర్‌గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం- మల్కాజిగిరి వాణినగర్‌లోని ఆర్య అపార్ట్‌మెంట్‌లో నివసించే పడాల మహేష్‌బాబు(44), మల్లిఖార్జుననగర్‌లో నివసించే మహేష్‌కుమార్(46), రసూల్‌పూరలో నివసించే బెల్లం కిరణ్‌కుమార్(37) స్నేహితులు. ఐపిఎల్ సీజన్‌లో భాగంగా సెల్‌ఫోన్‌ల ద్వారా ఆన్‌లైన్ బెట్టింగ్ నిర్వహిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. మంగళవారం రాత్రి వాణినగర్‌లోని మహేష్‌బాబు ఇంటిపై దాడిచేసి బెట్టింగ్‌కు పాల్పడుతున్న ముగ్గురిని అరెస్టు చేసి వారివద్ద నుండి 9 లక్షల నగదు, 15 సెల్‌ఫోన్‌లు, రెండు ల్యాప్‌టాప్‌లు, టివి స్వాధీనం చేసుకున్నట్టు సిఐ తెలిపారు.
అత్తింటి వేధింపులు తాళలేక గృహిణి ఆత్మహత్య
నేరేడ్‌మెట్, ఏప్రిల్ 27: అత్తింటి వేధింపులు భరించలేక గృహిణి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన నేరేడ్‌మెట్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. ఎస్‌ఐ ప్రవీణ్‌బాబు తెలిపిన వివరాల ప్రకారం- నేరేడ్‌మెట్ భగత్‌సింగ్‌నగర్‌లో నివసించే గౌరిశంకర్ (30)కి చింతల్‌కు చెందిన కవిత(26)తో 2014లో పెళ్లి జరిగింది. పెళ్లి సమయంలో లక్ష రూపాయల కట్నం, పది తులాల బంగారం, బైక్ కట్నం కింద అందజేసినట్టు పోలీసులు తెలిపారు. వృత్తిరీత్యా ఎలక్ట్రిషియన్‌గా పనిచేసే గౌరిశంకర్ కొంత కాలంగా అదనంగా లక్ష రూపాయల కట్నం తీసుకురావాలని కుటుంబసభ్యులతో కలసి నిత్యం భార్యను శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. వేధింపులు భరించలేని అమె మంగళవారం రాత్రి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు. మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

రాజకీయాలకు అతీతంగా ధార్మిక విలువలు, దైవచింతన ఉండాలి
* పుష్పగిరి పీఠాధిపతి విద్యానృసింహ భారతీ మహాస్వామి
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, ఏప్రిల్ 27: దేవాలయాల్లో ఆధ్యాత్మికత లోపించకుండా చూడాలని, రాజకీయాలకు అతీతంగా ధార్మిక విలువలు, దైవచింతన పెరిగేలా చూడాలని పుష్పగిరి పీఠాధిపతి విద్యానృసింహ భారతీ మహాస్వామి అన్నారు. బుధవారం అల్వాల్ సమీపంలోని మిలటరీ డైరీ రోడ్డులో నిర్మించిన లక్ష్మీగణపతి దేవాలయంలో మరకత శ్రీలక్ష్మీగణపతి విగ్రహప్రతిష్ట కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కరకమాలతో స్వామివారి యంత్ర ప్రతిష్ట గావించారు. ప్రధాన విగ్రహంతో పాటు నవగ్రహాల ప్రతిష్టకు ఏర్పాటు చేసిన మంటపంపై నవ గ్రహ యంత్రాలను కూడా భారతీ స్వామి ప్రతిష్టించారు. ఈ సందర్భంగా ఆయన భక్తులను ఉద్దేశించి ప్రసంగించారు. మరకతం అంటే పచ్చరంగని, వినాయకుడు బుధుడికి అధిదేవత, సర్వవిఘ్నాలను నివారించి సర్వులకు శుభాలనిచ్చేదేవుడని, అలాగే లక్ష్మీదేవి ఇంట్లో స్థిరంగా ఉండాలంటే వినాయకు పక్కన ఉంటే ధనం స్ధిరంగా ఉంటుందని అన్నారు. ఈ ప్రాంతంలో నిర్మించిన దేవాలయం అందరికీ క్షేమకరం అవుతుందని అన్నారు. ఇంత గొప్ప దైవకార్యాన్ని తలపెట్టి దీక్షతో చేస్తున్న మోత్కూరు సత్యనారాయణ శాస్ర్తీని అభినందనలతో కొనియాడారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ జ్యోతిష్య విద్వాన్ దేవిశ్రీ గురూజీ ఆలయ గోపుర శిఖర స్థాపన, కలశాభిషేకం నిర్వహించారు. పలువురు ప్రముఖులు అతిథులుగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
బిందెడు నీటి కోసం అల్లాడుతున్న వికారాబాద్ వాసులు
* వృథానీటిని అరికట్టడంలో అధికారులు విఫలం
* ట్యాంకర్ల నిర్వహణపై లోపించిన సమన్వయం
వికారాబాద్, ఏప్రిల్ 27: ఎండలు తీవ్రమవడం, భూగర్భ జలాలు అడుగంటి బోర్లలో నీరు రాకపోవడంతో బిందెడు నీటి కోసం పట్టణవాసులు అల్లాడిపోతున్నారు. కొందరు ఎంత దూరమైనా వెళ్ళి చేతిపంపుల నుండి నీరు తెచ్చుకుంటుండగా మరికొందరు, బబుల్స్ కొంటుండగా, మరికొందరు బ్యారల్‌కు 50 రూపాయలు చెల్లించి ట్యాంకర్ల నిర్వాహకుల నుండి కొంటున్నారు. తీవ్ర నీటి ఎద్దడి సమస్య ఇంటి యజమానులు, అద్దెకు ఉంటున్న వారి మధ్య చిచ్చుపెడుతోంది. నీటి సమస్య ఇంత తీవ్రంగా ఉన్నా మున్సిపల్ అధికారులు, సిబ్బంది మాత్రం తమకేమీ పట్టదన్నట్టు నీటి వృధాను అరికట్టడం లేదు.
బస్టాండ్ రోడ్ బస్టాండ్ మలుపు వద్ద నడిరోడ్డుపై, సమీపంలో రోడ్డు పక్కన పైపులైను లీకేజీ అయి వారంరోజులుగా నీరు వృథాగా పోతున్నా పట్టించుకునే నాథుడే కరవయ్యాడు. మున్సిపల్ కార్యాలయం అదే దారిలో ఉన్నా లీకేజీలు కనిపించకపోవడం ఆశ్చర్యకరం. ఇక పట్టణంలోని 28 వార్డులకు నీటి సరఫరా కోసం పది ట్యాంకర్లు ఏర్పాటు చేసినా ఏ ఒక్క వార్డు ప్రజలకు సరిపోను నీటిని సరఫరా చేయలేని పరిస్థితిలో ఉండటం విచిత్రం. మున్సిపల్ కార్యాలయం వద్ద ఉన్న వాటర్ ఫిల్లింగ్ స్టేషన్ వద్ద ఎపుడు చూసినా ట్యాంకర్లు దర్శనమిస్తున్నా ఏవార్డుకు వెళ్ళినా ట్యాంకర్ రావడం లేదనే సమాధానం రావడం మున్సిపల్ అధికారుల పనితీరుకు నిదర్శనం. ఫిల్లింగ్ పాయింట్ వద్ద నీరు నింపుకుంటున్న ట్యాంకర్లు ఎక్కడకు వెళుతున్నాయనే అనుమానం ప్రజల్లో కలుగుతోంది. ఏ ట్యాంకరు ఎపుడు ఏవార్డుకు వెళుతుంది.
వార్డులో ఎక్కడ నిలబెడతారనే స్పష్టంగా ప్రకటించకపోవడం అధికారులు, సిబ్బంది మధ్య సమన్వయ లోపానికి నిదర్శనం. 28 వార్డుల కౌన్సిలర్‌లు నీటి సరఫరాపై దృష్టి పెట్టకపోతే ప్రజాధనం వృధా కావడమే కాకుండా, నీటి కోసం ఖర్చు చేసిన నిధులు బూడిదలో పోసిన పన్నీరవడం ఖాయం. అంతే కాకుండా కౌన్సిల్‌కు చెడ్డపేరు వచ్చే అవకాశం లేకపోలేదు.
మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న
ముగ్గురికి పది రోజుల జైలు శిక్ష
* ఏప్రిల్ మాసంలో 987 కేసులు నమోదు
* అత్యధికంగా ద్విచక్ర వాహనదారులపై కేసులు
హైదరాబాద్, ఏప్రిల్ 27: మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న 987 మందికి కోర్టు జైలు శిక్ష విధించింది. వీరిలో ముగ్గురికి పది రోజులు జైలు శిక్ష విధించగా మిగత వారికి జారిమానతో పాటు జైలు శిక్ష విధించారు. నగర ట్రాఫిక్ పోలీసులు ఇప్పటి వరకు నగరంలోని వివిధ ప్రాంతాల్లో నిర్వహించిన మద్యం తనిఖీల్లో దాదాపు 4,638 మందిపై కేసులు నమోదు చేసిన్నట్లు నగర ట్రాఫిక్ అదనపు కమిషనర్ జితేంద్ర తెలిపారు. కేవలం ఏప్రిల్ మాసంలో నేటి వరకు నిర్వహించిన తనిఖీల్లో 987 మందిపై కేసులు నమోదు చేయడం జరిగిందని తెలిపారు. అత్యధికంగా 724 మంది ద్విచక్రవాహనదారులు ఉండగా, 46 మంది త్రివిల్లర్, 173 మంది ఫోర్ విల్లర్ వాహనాదారులుండగా ఇతరులు 44 మంది ఉన్నారు. నగరంలో ఏడాది పోడవున మద్యం తనిఖీలను నిర్వహిస్తున్నట్లు జితేంద్ర తెలిపారు. మద్యం తాగి వాహనాలు నడిపినపుడు అత్యధికంగా రోడ్డు ప్రమాదాలు జరిగి అనేక మంది మృతి చెందటంతో వారి కుటుంబ సభ్యులు అనాదాలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరు ట్రాఫిక్ నిబందనకలు పాటించి పోలీసులకు సహకరించాలని చెప్పారు.

అమరవీరుల స్మారక భవన నిర్మాణానికి భూమిపూజ
వికారాబాద్, ఏప్రిల్ 27: అమరవీరుల స్మారక భవన నిర్మాణానికి జిల్లా ఎస్పీ రమారాజేశ్వరి బుధవారం భూమి పూజ చేశారు. కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ ఎన్.వెంకటస్వామి, డిఎస్పీ టి.స్వామి, సిఐ జి.రవి, జిల్లా పోలీసు అదికారుల సంఘం అధ్యక్షుడు టి.అశోక్, మాజీ అధ్యక్షుడు అబ్దుల్ హఫీజ్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
ఆర్మ్‌డ్ రిజర్వ్‌డ్ మెబిలైజేషన్ ముగింపు
ప్రతి ఏడాది మాదిరిగానే ఆర్మ్‌డ్ రిజర్వ్‌డ్ సిబ్బందికి జిల్లా పోలీసు కార్యాలయం ఆవరణలో 15 రోజుల పాటు మొబిలైజేషన్, శారీరక శిక్షణ, పునశ్చరణ తరగతులు నిర్వహించారు. బుధవారం నిర్వహించిన ముగింపు కార్యక్రమానికి జిల్లా ఎస్పీ రమారాజేశ్వరి, అదనపు ఎస్పీ ఎన్.వెంకటస్వామిలు హాజరై 102 మంది కవాతు గౌరవవందనం స్వీకరించారు.
కార్యక్రమంలో డిఎస్పీ టి.స్వామి, డిటిసి డిఎస్పీ లతామాధురి, ఆర్‌ఎస్‌ఐ, పోలీసు సిబ్బంది పాల్గొనగా కవాతు కమాండర్‌గా ఆర్‌ఐ వెంకటేశ్వరరావు వ్యవహరించారు.
జిల్లా ఇన్‌చార్జి ఎస్పీగా
వెంకటస్వామి
రంగారెడ్డి జిల్లా ఎస్పీ రమారాజేశ్వరి ఖమ్మంకు బదిలీ కావడంతో ఇన్‌చార్జి జిల్లా ఎస్పీగా అదనపు ఎస్పీ ఎన్.వెంకటస్వామి బుధవారం కార్యాలయంలో రమారాజేశ్వరి చేతుల మీదుగా బాధ్యతలు స్వీకరించారు. బదిలీపై వెళ్లిన ఎస్పీ రమారాజేశ్వరి అతి తక్కువ కాలం పనిచేశారు. జిల్లాకు ఎస్పీలుగా పనిచేసిన వారిలో తొమ్మిది నెలల నుండి మూడు సంవత్సరాల దాకా పనిచేసినవారే. రమారాజేశ్వరి మాత్రం కేవలం ఐదు నెలలు పనిచేసినా తనదైన శైలిలో ప్రత్యేకతను చాటుకున్నారు.

చెల్లప్ప కమిషన్ విచారణ
తాండూరు, ఏప్రిల్ 27: రాజ్యాంగం ద్వారా వివిధ కులాలు, తెగలకు రిజర్వేషన్లు అమలవుతున్నాయని ఎస్‌సి, ఎస్‌టి కమిషన్ చైర్మన్ చెల్లప్ప అన్నారు. బుధవారం తాండూరు మండల పరిషత్ కార్యాలయంలో రిజర్వేషన్లపై సమీక్ష నిర్వహించారు. వాల్మీకిబోయలను ఎస్‌టిలో చేర్చాలనే డిమాండ్‌తో ప్రభుత్వం కమిషన్‌ను వేసిందని అన్నారు. రాజ్యాంగం ప్రకారం 50శాతం రిజర్వేషన్ మించరాదని చెప్పారు. ఎస్‌సి, ఎస్‌టి రిజర్వేషన్లు సవరించాలంటే పార్లమెంట్‌లో చట్టం తేవాలని, బిసి రిజర్వేషన్లు సవరించాలంటే ఆయా రాష్ట్రాలకు అధికారం ఉంటుందని చెప్పారు. ఇష్టానుసారంగా రిజర్వేషన్లు సవరిస్తే న్యాయస్థానం ఊరుకోదని పేర్కొన్నారు. కైతలంబాడి, వాల్మీకిబోయలు మనరాష్ట్రంలో ఎస్‌టి జాబితాలో లేరని తెలిపారు. కుటుంబ సర్వేలో ఉప్పరి కులం వెలుగులోకి వచ్చిందని చెప్పారు.
సమీక్షలో కమిషన్ సభ్యులు హెచ్‌కె నాగు, కె.జగన్నాథరావు, సబ్ కలెట్టర్ శృతి ఓజా, తహశీల్దార్ రవీందర్, డిప్యూటీ తహశీల్దార్ మహేష్‌గౌడ్ ఉన్నాను. చెల్లప్ప కమిషన్‌ను స్థానిక వాల్మీకిబోయలు కలిసి తమను ఎస్‌టి జాబితాలో చేర్చాలని కోరారు. అదనంగా ఇతర కులాలను ఎస్‌టిల్లో చేర్చవద్దని తాండూరు బంజార సేవా సంఘం ప్రతినిధులు కోరారు.

‘మిష్టర్ రాహుల్’ 29న విడుదల
వికారాబాద్, ఏప్రిల్ 27: తెలంగాణ స్వరాష్ట్రంలో నిర్మించిన తొలి వినోదభరిత చిత్రం మిష్టర్ రాహుల్ పక్కా ప్రొఫెషనల్ ఏప్రిల్ 29న విడుదలవుతుందని రంగారెడ్డి జిల్లా టిసిడిఎస్ (తెలంగాణ సినిమా డిస్ట్రిబ్యూటర్స్ సొసైటీ) అధ్యక్షుడు శ్రీశైలం యాదవ్ తెలిపారు. బుధవారం స్థానిక ఆర్‌అండ్‌బి అతిథిగృహంలో ఏర్పాటు చేసిన టిసిడిఎస్ జిల్లా సమావేశంలో మాట్లాడుతూ సినిమాను సయ్యద్ రఫి సొంత నిర్మాణ సంస్థలో దర్శకుడిగా నిర్మించారని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 50 థియేటర్లలో సినిమా విడుదలవుతుందని పేర్కొన్నారు. టిసిడిఎఫ్ రాష్ట్ర నాయకుడు మున్నా మాట్లాడుతూ కుటుంబ సమేతంగా చూడదగ్గ చిత్రమని, సినిమా చూసి ఘనవిజయం సాధించేలా చేయాలని ఆకాంక్షించార