హైదరాబాద్

కళారూపాల మ్యూజియం ఏర్పాటు చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 22: తెలంగాణలో ఎన్నో జానపద కళారూపాలు వెలుగులోకి రాకుండా నిక్షిప్తమై ఉన్నాయని, వాటినన్నింటినీ వెలికితీసి తెలంగాణ కళారూపాలతో మ్యూజియం ఏర్పాటు చేయాలని తెలుగు విశ్వవిద్యాలయానికి సినీ గేయ రచయిత సుద్దాల అశోక్ తేజ సూచించారు. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో ‘జాతీయ నృత్యోత్సవం-2017’లో భాగంగా బుధవారం ఉదయం విశ్వవిద్యాలయం ప్రాంగణంలోని ఎన్టీఆర్ ఆడిటోరియంలో ‘తెలంగాణ ప్రజాకళలు’ అనే అంశంపై జరిగిన సదస్సులో సుద్దాల అశోక్‌తేజ కీలకోపన్యాసం చేశారు. నిజాం వ్యతిరేక ఉద్యమంలోనూ, తెలంగాణ రాష్ట్ర సాధనలోనూ తెలంగాణ కళలు ఉపయోగపడ్డాయని అన్నారు. రేడియో, టీవీ, సినిమాలు లేని కాలంలో ప్రజలను జానపద కళలే ఉత్తేజ పరిచాయని చెప్పారు. జానపద కళారూపాలకు ఆధారమైన పాట మొదలైన తరువాత ఆటగా దృశ్యరూపం దాల్చిందని అన్నారు. కళలకు పాట గుండె అని, బండరాయిని సుత్తితో పగలకొట్టేటప్పుడు సుత్తి దెబ్బ లయబద్ధంగా ఉంటుందని, రాయి త్వరగా పలుగుతుంది.
తెలుగు నేలపై ఏడుపులో కూడా గీతం వినిపిస్తుందని, భాషకు పాటకు రాగ సంబంధం ఉందని అన్నారు. జానపద కళలు ఏ రూపంలోనైనా పరకాయ ప్రవేశం చేయగలవు అని చెప్తూ కుటుంబ నియంత్రణ ప్రచారంలో జానపద గీతంగా బుర్రకథగా, హరికథగా, చిందు యక్షగాన రూపంలో చెప్పవచ్చు కానీ శాస్ర్తియ కళారూపంలో చెప్పడం సాధ్యం కాదన్నారు. పాల్కురికి సోమనాథుని బసవ పురాణంలో జానపద కళల గురించి ప్రస్తావించారని, పాట నుండే అన్ని కళలకు మూలం అని తెలిపారు. తెలుగు విశ్వవిద్యాలయం తరఫున ఉపకులపతి, అధ్యాపకులు కలసి సుద్దాల అశోక్ తేజను ఘనంగా సత్కరించారు. సభకు అధ్యక్షత వహించిన ఎస్వీ సత్యనారాయణ మాట్లాడుతూ ఈనెల 24వ తేదీన ఆవుల సాంబశివరావు పురస్కార ప్రదానోత్సవ కార్యక్రమం నిర్వహిస్తున్నామని చెప్పారు. తెలుగు విశ్వవిద్యాలయ స్థాపనలో కృషి చేసిన ఉమారామారావుకు అంకితం చేస్తున్నామని అన్నారు. ‘నాట్య గ్రంథాలలో దేశి ప్రస్తావన’ అనే అంశంపై జొన్నలగడ్డ అనురాధ ప్రసంగించారు. పదవ శతాబ్దం తరువాత నాట్య శాస్త్రంలో దేశి అనే పదం చోటుచేసుకుందని అన్నారు. అనంతరం పేరిణి ప్రదర్శనల గురించి కళాకృష్ణ ప్రసంగించారు. సదస్సులో రిజిస్ట్రార్ సత్తిరెడ్డి స్వాగతం పలికారు.