రాష్ట్రీయం

ఇంజనీరింగ్ విద్యార్థి ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 20: సీనియర్ విద్యార్థుల వేధింపులకు లోనైన ఓ ఇంజనీరింగ్ విద్యార్థి అవమానం భరించలేక ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన నగరంలోని కెపిహెచ్‌బి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కూకట్‌పల్లి నిజాంపేట్ అల్లాపూర్ సొసైటీలో నివాసముంటున్న నర్సింహ లాల్ బాబు కుమారుడు వెంకటకృష్ణ చైతన్య (19) చెన్నైలోని సత్యభామ ఇంజనీరింగ్ కళాశాలలో బిటెక్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. కళాశాలకు ఎదురుగా పిజి హాస్టల్‌లో మరో ఇద్దరితో కలిసి ఉండేవాడు. దీపావళి సెలవుల సందర్భంగా కృష్ణచైతన్య నిజాంపేట్‌లోని తల్లిదండ్రుల వద్దకు వచ్చాడు. గురువారం రాత్రి తన బెడ్‌రూమ్‌లోని సీలింగ్ ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. తాను చదివే కళాశాలలో సీనియర్ విద్యార్థుల వేధింపులను భరించలేక ఆత్మహత్య చేసుకున్నట్లు రాసిన సూసైడ్ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తన కుమారుడి చావుకు కారణమైన విద్యార్థులు పూర్ణచందర్, సూర్యను కఠినంగా శిక్షించాలని కృష్ణచైతన్య తండ్రి నర్సింహ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. గతంలో కూడా తన కుమారుడి ముఖంపై గాయాలు ఉన్నాయని వాటి గురించి ప్రశ్నించినా ఏమి చెప్పలేదని, ఇద్దరు విద్యార్థులు తన కుమారుడిని మానసికంగా వేధించడంతోనే ఆత్మహత్య చేసుకున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు.