హైదరాబాద్

సూక్ష్మ పరిశీలన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 4: మహానగర పాలక సంస్థ చెత్త తరలించే వాహనాల రాకపోకలపై ప్రత్యేకంగా దృష్టి సారించింది. నగరంలోని వివిధ ప్రాంతాల్లోని చెత్త కుండీల నుంచి ట్రాన్స్‌ఫర్ స్టేషన్‌కు, అక్కడి నుంచి డంపింగ్ యార్డుకు చెత్తను తరలించే రవాణా విభాగాన్ని సర్కిళ్లు, జోన్ల వారీగా వికేంద్రీకరించటంతో వాహనాలు సంఖ్య సుమారు ఇరవై శాతం తగ్గింది. అయినా డీజిల్ వినియోగం తగ్గకపోవటంతో కమిషనర్ జనార్దన్ రెడ్డి సూక్ష్మంగా పరిశీలిస్తున్నారు. ఇందుకు కోసం ఈస్ట్‌జోన్‌లో ప్రయోగాత్మకంగా నిర్వహించిన పిన్ పాయింట్ కార్యక్రమం సత్పలితాలిస్తోంది.
అక్కడ ఈ కార్యక్రమం విజయవంతం కావటంతో పాటు కేవలం వారం రోజుల్లో రెండు వేల లీటర్ల డీజిల్‌ను ఆదా చేయటంతో అధికారులు ఈ పిన్ పాయింట్ కార్యక్రమాన్ని అన్ని జోన్లలో అమలు చేసేందుకు సిద్ధమవుతున్నారు.
ఇందుకు గాను గతంలో కేవలం వాహనాల సంఖ్య, వాటి ట్రిప్పులను బట్టి డీజిల్‌ను కేటాయించేవారు. కానీ ఇప్పటికే రవాణా విభాగాన్ని వికేంద్రీకరించిన కమిషనర్ వీలైనంత మేరకు డీజిల్ బ్లాక్ మార్కెట్‌కు తరలకుండా అడ్డుకోవాలన్న సంకల్పంతో ఈ పిన్‌పాయింట్ కార్యక్రమాన్ని రూపొందించారు.
ఈ కార్యక్రమం కింద చెత్తను తరలించే వాహనాలు చెత్తను లోడ్ చేసుకునే రెండు ప్లేసర్ బిన్ల మధ్య ఎన్ని కిలోమీటర్ల దూరం ఉంది? అలాగే ఈ డంపర్ ప్లేసర్ నుంచి ట్రాన్స్‌ఫర్ స్టేషన్ మధ్య ఎన్నిక కిలోమీటర్ల దూరం ఉంది? ఈ వాహనాల మైలేజీ ఏమిటీ అన్న విషయంపై లోతుగా వివరాలను అధ్యయనం చేస్తున్నారు.
ఇదే తరహాలో ఈస్ట్‌జోన్‌లో ప్రయోగాత్మకంగా చేసిన ఈ అధ్యయనంతో వారం రోజుల్లోనే రెండు వేల లీటర్ల డీజిల్ బ్లాక్ మార్కెట్‌కు తరలకుండా అడ్డుకోగలిగారు.
ఈ రకంగా సత్ఫలితాలివ్వటంతో ఈ పిన్‌పాయింట్ కార్యక్రమాన్ని నగరంలోని మొత్తం 24 సర్కిళ్లలో అమలు చేయాలని అధికారులు భావిస్తున్నారు.
అయితే గతంలోనున్న 3900 బిన్లు ఆ తర్వాత చేపట్టిన పలు చర్యలతో 2900లకు తగ్గాయి.
అయితే వాహనాల్లో కొన్ని కాలం చెల్లటంతో వాటిని స్క్రాప్ కింద విక్రయించటంతో ఆ సంఖ్య కూడా తగ్గింది. అంటే వాహనాలు చెత్తను లోడ్ చేసుకునే వెయ్యి ప్రాంతాలు దాదాపుగా తగ్గినట్టే. అయినా డీజిల్ వినియోగం ఎందుకు తగ్గటం లేదన్న అనుమానం వచ్చిన అధికారులు ఈ పిన్‌పాయింట్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. కానీ ఏ వాహనంలో కూడా వేగాన్ని సూచించే మీటర్లు గానీ లేకపోవటం, వాహనాలు ఎక్కువ స్పీడుగా నడవకపోవటం, తక్కువ మైలేజీ రావటం వల్ల డీజిల్ వినియోగం పెరిగిందని క్షేత్ర స్థాయి సిబ్బంది పేర్కొంటున్నారు. ఈ పిన్‌పాయింట్ కార్యక్రమాన్ని సర్కిళ్ల వారీగా డంపర్ బిన్ల మధ్య దూరం, అక్కడి నుంచి ట్రాన్స్‌ఫర్ స్టేషన్ మధ్యనున్న దూరాన్ని గుర్తించి, అందుకు సరిపడే డీజిల్‌ను కేటాయించాలని అధికారులు భావిస్తున్నారు. కానీ ఈ విషయంలో అధికారులు వాహనాల కండీషన్ అంశాన్ని పరిగణలోకి తీసుకోకుండా కొత్త వాహనం ఇచ్చే మేలేజీని పరిగణలోకి తీసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ప్రవేశపెడితే ఇప్పటికే అంతంతమాత్రంగా ఉన్న చెత్త తరలింపు మున్ముందు మరింత స్తంభించే అవకాశముందని చెత్తను తరలించే క్షేత్ర స్థాయి విధులు నిర్వర్తించే సిబ్బంది అంటున్నారు.