హైదరాబాద్

వ్యవసాయ పరిశోధనా ఫలితాలు రైతాంగానికి అందాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 7 : వ్యవసాయ విశ్వవిద్యాలయంలో జరిగే పరిశోధనా ఫలితాలు రైతులకు చేరాల్సి ఉందని, ఇందుకోసం ఏరువాక కేంద్రాలు, కృషి విజ్ఞాన కేంద్రాలు సంధానకర్తలుగా పనిచేయాలని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రత్యేక అధికారి డాక్టర్ వి. ప్రవీణ్‌రావు కోరారు. వ్యవసాయ విశ్వవిద్యాలయంలోని విస్తరణ కేంద్రాల రాష్టస్థ్రాయి సాంకేతిక, వార్షిక ప్రణాళికలపై నాలుగు రోజుల పాటు రాజేంద్రనగర్‌లో ఏర్పాటు చేసిన సమావేశాలను మంగళవారం ప్రవీణ్‌రావు ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయ యాంత్రీకరణ, నీటి యాజమాన్యంపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాల్సిన అవసరం ఉందన్నారు. ఆధునిక శాస్ర్తియ పద్ధతులను రైతులకు తెలియచేసేందుకు కెవికె, ఏరువాక కేంద్రాల శాస్తవ్రేత్తలు కృషి చేయాలని విశ్వవిద్యాలయం విస్తరణ సంచాలకులు డాక్టర్ జమునారాణి కోరారు. విత్తనాభివృద్ధికి కెవికెలు ప్రత్యేకశ్రద్ద తీసుకోవాలని సూచించారు. కెవికె జోనల్ ప్రాజెక్టు డైరెక్టర్ డాక్టర్ వైజి ప్రసాద్ మాట్లాడారు.