హైదరాబాద్

చేప ప్రసాదం పంపిణీ షురూ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, చార్మినార్, జూన్ 8: మృగశిరకార్తెను పురస్కరించుకుని ఆస్తమా రోగులకు బత్తిని సోదరులు ఉచితంగా చేప ప్రసాదం పంపిణీ బుధవారం ఉదయం ఎనిమిదిన్నర గంటలకు ప్రారంభమైంది. ఉదయం బత్తిని కుటుంబీకులు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి ప్రసాదం పంపిణీని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే రాజాసింగ్ ముఖ్య అతిధిగా హజరు కాగా, ఉదయం వేళల్లోనే మాజీ ఎంపి పొన్నం ప్రభాకర్ కూడా వచ్చి ప్రసాదం స్వీకరించారు. ప్రారంభం సమయంలో ఒక్కసారిగా బ్యారికేడ్లలోని జనం ముందుకు తోసుకుంటూ రావటంతో స్వల్ప తోపులాట జరిగింది. ఆ తర్వాత పోలీసులు చేప పిల్లల కొనుగోలు కౌంటర్ల వద్ద నుంచి పరిమిత సంఖ్యలో ప్రసాదం స్వీకరణకు అనుమతిస్తూ పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. పంపిణీ ప్రారంభానికి ముందే ఇతర రాష్ట్రాలు, పలు విదేశాల నుంచి వచ్చిన జనం బ్యారికేడ్లలో కిక్కిరిసింది. ఎవరికెలాంటి ఇబ్బందులు కలగకుండా, క్యూ లేన్లలో వేచి ఉన్న వారికి అసౌకర్యం కలగకుండా పోలీసులు భారీ ఏర్పాట్లు చేశారు. కానీ చేప ప్రసాదంలో శాస్ర్తియత లేదని, ఆస్తమా వ్యాధిని తగ్గించే ఔషధగుణాలు కూడా లేవంటూ గత కొద్ది సంవత్సరాలుగా జరుగుతున్న ప్రతికూల ప్రచారం కేవలం తెలుగు రాష్ట్రాల ప్రజలను ప్రభావితం చేయగలిగిందే తప్పా, ఉత్తర భారతంలోని వివిధ రాష్ట్రాల నుంచి తరలివచ్చే జనంపై ఏ మాత్రం ప్రభావం చూపలేదని చెప్పవచ్చు. ముఖ్యంగా ఈ సారి బీహార్, ఉత్తర్‌ప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన ప్రజలెక్కువ మంది ఈ ప్రసాదాన్ని స్వీకరించారు. గత కొద్ది సంవత్సరాలుగా ఈ ప్రసాదానికి వ్యతిరేకంగా ప్రచారం జరుగుతున్నా, గడిచిన ఏడాదితో పోల్చితే చేప ప్రసాదం స్వీకరించే వారి సంఖ్య ఏ మాత్రం తగ్గలేదనే చెప్పవచ్చు. పైగా బుధవారం సాయంత్రం కూడా ఉత్తరాది నుంచి ఆస్తమా రోగులు నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌కు తరలివచ్చారు. ఇందుకు గాను బత్తిని కటుంబీకులు సుమారు అయిదు లక్షల మందికి అందేలా ప్రసాదం తయారు చేయగా మధ్యాహ్నం మూడున్నర గంటల వరకు సుమారు 36వేల 500 కొర్రమీను చేప పిల్లలు అమ్ముడుపోయినట్లు, మరో 5వేల చేప పిల్లలు వివిధ కారణాలతో చనిపోయినట్లు మత్స్యశాఖ డిప్యూటీ డైరెక్టర్ శంకర్ రాథోడ్ వెల్లడించారు. ఇదే సంఖ్య కేవలం గంట వ్యవధిలో 44వేలకు పెరిగింది. ఆ తర్వాత రాత్రి ఏడు గంటల వరకు సుమారు 46వేల మంది టోకెన్లను కొనుగోలు చేసి ప్రసాదం స్వీకరించారు. ముఖ్యంగా తొక్కిసలాట జరగకుండా, ప్రజల భద్రతే ప్రధాన లక్ష్యంగా 32 క్యూ లైన్లు, ప్రసాదం పంపిణీ నిమిత్తం 40 టోకెన్ కౌంటర్లు, మరో 30 చేప పిల్లల కౌంటర్లను ఏర్పాటు చేశారు. కేవలం చేప పిల్లలను విక్రయించేందుకు మత్స్యశాఖ అధికారులు దాదాపు 175 మంది సిబ్బందిని నియమించారు. పురుషులకు, మహిళలకు, వికలాంగుల సౌకర్యార్థం ప్రత్యేకంగా బ్యారికేడ్లను, విఐపిలకు ప్రత్యేక క్యూ లైన్లను ఏర్పాటు చేశారు. ఇంకా కొనసాగుతున్న చేప ప్రసాదం పంపిణీ గురువారం ఉదయం ఎనిమిదిన్నర గంటల వరకు కొనసాగించనున్నట్లు బత్తిని హరినాధ్‌గౌడ్ తెలిపారు.
పాతబస్తీలో రెండురోజులు పంపిణీ
మృగశిరకార్తెను పురస్కరించుకుని ఇరవై నాలుగు గంటల పాటు నాంపల్లి ఎగ్జిబిషన్‌లో చేప ప్రసాదాన్ని పంపిణీ చేసినానంతరం అదనంగా మరో రెండు రోజుల పాటు పాతబస్తీలోని దూద్‌బౌలీలో గల తమ నివాసం వద్ధ ఈ ప్రసాదాన్ని ఉచితంగా పంపిణీ చేయనున్నట్లు బత్తిని హరినాధ్‌గౌడ్ తెలిపారు. వ్యతిరేకంగా ప్రచారం జరుగుతున్నా, పైసా తీసుకోకుండా తాము పంపిణీ చేస్తున్న ఈ ప్రసాదానికి ఆదరణ ఏ మాత్రం చెక్కు చెదరలేదని ఆయన ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.