హైదరాబాద్

చిన్నారులను విద్యావంతులుగా తీర్చి దిద్దాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అల్వాల్, జూన్ 9: చిన్నారులను మంచి విద్యావంతులుగా తీర్చిదిద్దాలని రాష్ట్ర మంత్రి హరీష్‌రావు చెప్పారు. గురువారం ఓల్డ్ అల్వాల్‌లో నూతనంగా చిన్నారుల కోసం ఏర్పాటు చేసిన పాఠశాలను ఆయన ప్రారంభించారు. ప్రభుత్వ పాఠశాలలు ఇంకా ప్రజలకు అన్ని రంగాల్లో అందుబాటులోకి రాలేదని, అదేసమయంలో కొంతమంది మంచి అనుభవం ఉన్న వారు ప్రాంతాలవారీగా ఏర్పాటు చేసి నిర్వహిస్తున్న సంస్థలకు మంచి స్పందన ఉందని ఆయన చెప్పారు. చిన్నారులను పాఠశాలకు పంపటానికి ముందు ఏర్పాటు చేస్తున్న డే కేర్ సెంటర్‌లకు నగరంలో మంచి ప్రాధాన్యత ఉందని ఆయన వివరించారు. కార్యక్రమంలో మల్కాజిగిరి ఎంపి మల్లారెడ్డి, ఎమ్మెల్యే చింతల కనకారెడ్డి, శాసనమండలి సభ్యుడు ఫారూక్ హుస్సేన్, మైనంపల్లి హనుమంతరావు పాల్గొన్నారు.