హైదరాబాద్

గిరిజన సర్పంచ్‌పై సస్పెన్షన్‌పై ఉద్యమం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖైరతాబాద్, జూన్ 9: అగ్రకుల నేతలు, అధికారుల కుట్రలతో సస్పెన్షన్‌కు గురైన మహేశ్వరం మండలం తుమ్మలూరు గ్రామ సర్పంచ్‌పై ఉన్న సస్పెన్షన్ ఎత్తివేయకపోతే రాష్టవ్య్రాప్త ఉద్యమం చేస్తామని ఆల్ ఇండియా ఎరుకల హక్కుల పోరాట సమితి హెచ్చరించింది. గురువారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో బాధిత సర్పంచ్ యాదమ్మతో కలిసి సమితి జాతీయ అధ్యక్షుడు ప్రభాకర్ మాట్లాడారు. భారత రాజ్యాంగం ద్వారా సంక్రమించిన గిరిజన రిజర్వేషన్ హక్కుల ద్వారా గెలిచిన యాదమ్మకు ఉద్దేశపూర్వకంగా ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండా పోయిందని యాదమ్మ కన్నీరు పెట్టుకుంది. ఈ విషయంలో ప్రభుత్వం జోక్యం చేసుకొని యాదమ్మకు న్యాయం చేయకపోతే రాష్టవ్య్రాప్తంగా ఆందోళనను ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.