హైదరాబాద్

బోనాల పండుగకు భారీ ఏర్పాట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 9: తెలంగాణ సంస్కృతిక సంప్రదాయాలకు ప్రతీకగా జరుపుకునే బోనాల పండుగకు జిహెచ్‌ఎంసి విస్తత్ర ఏర్పాట్లు చేయనుంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని వివిధ ప్రాంతాల్లో అత్యంత వైభవంగా నిర్వహించే బోనాల పండుగకు వౌలిక సదుపాయాల కల్పన, లైటింగ్ ఏర్పాటు, దోమల నివారణ నిమిత్తం ఫాగింగ్, వాహనాల పార్కింగ్, రాహదారుల నిర్మాణం, ఆలయాలకు కలరింగ్, శానిటేషన్ తదితర పనులను చేపట్టడానికి జిహెచ్‌ఎంసి కమిషనర్ డా. బి. జనార్దన్ రెడ్డి ఇంజనీరింగ్ అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. గతంలో మాదిరిగా ఈ సారి కూడా బోనాల పండుగకు విస్త్రృత ఏర్పాట్లను చేయాలని ఆదేశించారు. జూలై 17న గోల్కొండ బోనాలతో ప్రారంభం కానున్న ఈ ఉత్సవాలు హైదరాబాద్, సికిందరాబాద్‌తో పాటు గ్రేటర్ పరిధిలోని 18 సర్కిళ్లలో శ్రావణ మాసం వరకు పెద్ద ఎత్తున జరుగుతాయి. సికిందరాబాద్ ఉజ్జయినీ మహాంకాళీ దేవాలయంలో జూలై 24, 25న పెద్ద ఎత్తున బోనాల ఉత్సవం జరుగనుంది. వేలాది మంది ప్రజలు హజరయ్యే ఈ బోనాల పండుగకు నగరంలోని ఆలయాల వద్ధ పలు సౌకర్యాలు కల్పించేందుకు ఏర్పాట్ల నిమిత్తం స్వయంగా కమిషనర్ జనార్దన్ రెడ్డి గురువారం ఉదయం సికిందరాబాద్ శ్రీ ఉజ్జయిని మహాంకాళీ టెంపుల్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా జోనల్ కమిషనర్ హరిచందన, డిప్యూటీ కమిషనర్ విజయరాజ్, స్థానిక ప్రజాప్రతినిధులు, ఆలయ కమిటీ సభ్యులతో కలిసి చేపట్టాల్సిన ఏర్పాట్లపై చర్చించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ బోనాల పండుగ జరిగే ఆలయాల వద్ధ అలంకరణ, రహదార్ల నిర్మాణం, మరమ్మతులు, ప్రజలకు ఏ విధమైన ఇబ్బందులు రాకుండా ఉండేందుకు లైటింగ్ వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు వినియోగించునున్నారు. ఈ నిధులకు సంబంధించిన పనులకు గాను ఇప్పటికే కొన్నింటిని టెండరింగ్ పూర్తయి పనులు ప్రారంభించేందుకు చర్యలు చేపట్టామన్నారు.
భోజనం ఏలా ఉంది?
శ్రీ ఉజ్జయిని మహాంకాళీ దేవాలయాన్ని సందర్శించిన కమిషనర్ సమీపంలోనున్న రూ. 5 భోజన పంపిణీ కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ కేంద్రం ద్వారా అందిస్తున్న కూరగాయాల నాణ్యత, రుచిని, భోజనం ఆరగిస్తున్న వారిని అడిగి తెల్సుకున్నారు. ఈ కేంద్రం వద్ధ శుభ్రత పాటించాలని రోడ్లపై ప్లేట్లు వంటివి వేయకుండా, వాటిని డస్ట్‌బిన్లలోనే వేయాలని సూచించారు. రూ. 5కే కడుపు నిండా భోజనం పెడుతున్న జిహెచ్‌ఎంసికి భోజనం ఆరగిస్తున్న వారు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం బుద్ద్భవన్ కార్యాలయ సముదాయాన్ని కమిషనర్ పరిశీలించారు.