రంగారెడ్డి

తాగిన మత్తులో కానిస్టేబుల్ వీరంగం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వనస్థలిపురం, జూన్ 11: తాగిన మైకంలో ఓ మహిళపై దురుసుగా ప్రవర్తించి, అమెపై దాడికి పాల్పడిన సంఘటన సంఘటన ఎల్‌బినగర్ పోలీస్టేషన్ పరిధిలో శనివారం రాత్రి చోటు చేసుకుంది. పూర్తి విరాల్లోకి వెళితే..ఎల్‌బినగర్ కామినేని ఆసుపత్రి ఎదురుగా ఉన్న పిఆర్‌వైన్స్‌లో మేడిపల్లి పోలీస్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న గోపి, అంబర్‌పేట్ గ్రేహాండ్స్ విభాగంలో పనిచేస్తున్న సుధాకార్ రాత్రి తొమ్మిది గంటల ప్రాంతంలో పీకలదాక మద్యం సేవించారు. వైన్స్ ఎదురుగా ఉన్న సుమలత అనే మహిళ తినుబండరాలను విక్రయిస్తోంది. మహిళతో తినుబండరాలు కొనుగోలు విషయంలో దురుసుగా ప్రవర్తించడంతో పాటు ఆమెపై దాడి చేశారు. ఇద్దరు కానిస్టేబుళ్లు పరోక్షంగా మహిళను గాయపర్చారు. వైన్‌షాప్‌లో వీరంగం సృష్టించి అడ్డుకున్నవారిపై దాడికి పాల్పడ్డారు. గాయాలపాలైన మహిళ తీవ్ర ఆవేదనకు గురై స్థానిక ఎల్‌బినగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. రంగంలోకి దిగిన పోలీసులు సీసీ కెమెరా ఫుటేజ్‌ల అధారంగా గోపీ, సుధాకర్‌లను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసును నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎల్‌బినగర్ ఇన్స్‌పెక్టర్ కాశీరెడ్డి తెలిపారు.

అంబులెన్స్‌లో ప్రసవం

పరిగి, జూన్ 11: మారుమూల ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం కోట్ల రూపాయలు ఖర్చు చేస్తూ ప్రజలకు అందుబాటులో ఆసుపత్రులు నిర్మించినప్పటికీ ప్రభుత్వ ఆశయం మాత్రం పూర్తిగా నెరవేరడం లేదు. ప్రభుత్వ ఆసుపత్రిలో సరైన వైద్యం అందక ఓ మహిళ అంబులెన్స్‌లో ప్రసవించన ఉదంతం శనివారం పరిగిలో జరిగింది. పరిగి మండలం రూఫ్‌ఖాన్‌పేట్ గ్రామానికి చెందిన నిండు గర్భిణీ కల్పన ప్రసవం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకుంది. ఉదయం నుంచి మధ్యాహ్నం సమయం వరకు పరిగి ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవ వేదన అనుభవించింది. ఇక్కడ ప్రసవం కావడం కష్టం అంటూ ఆసుపత్రిలో వైద్యులు చేతులెత్తేశారు. దీంతో ఆమెను ప్రభుత్వ అంబులెన్స్‌లో వికారాబాద్ ఆసుపత్రికి తరలిస్తుండగా మనె్నగూడ సమీపంలోకి రాగానే కల్పన ప్రసవించింది. అక్కడి నుంచి అంబులెన్స్‌ను వెనక్కి పరిగి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు కల్పనకు, అప్పుడే పుట్టిన శిశువును ఆసుపత్రిలోకి తీసుకువెళ్లి వైద్యం అందించారు. ఇక్కడే వైద్యం సరిగ్గా చేస్తే ప్రసవం అయ్యేదని అనవసరంగా వికారాబాద్‌కు అంబులెన్స్‌లో పంపారని కల్పన కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు.

నర్సరీలను పరిశీలించిన మంత్రులు

ధారూర్, జూన్ 11: హరితహారంలో భాగంగా మొక్కలను నాటేందుకు ఏర్పాటు చేసిన నర్సరీలను రాష్ట్ర మంత్రులు జోగు రామన్న, మహేందర్‌రెడ్డి పరిశీలించారు. శనివారం ధారూర్ మండలంలోని కెరెళ్ళి, ధారూర్, రుద్రారం గ్రామాలలో ఉపాధిహామీ పథకం కింద ఏర్పాటు చేసిన నర్సరీలను వారు రాష్ట్ర అటవీశాఖ మంత్రి జోగు రామన్న, రవాణా మంత్రి మహేందర్‌రెడ్డి పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జూలై నెలలో రాష్టవ్య్రాప్తంగా హరితహారం కార్యక్రమంలో భాగంగా మొక్కలను నాటేందుకు లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. వర్షాలు సకాలంలో కురియడంతో మొక్కలు అధిక సంఖ్యలో నాటేందుకు సన్నాహాలు చేస్తున్నామన్నారు. గత సంవత్సరం వర్షాలు సకాలంలో కురియనందున ఆశించిన స్థాయిలో విజయవంతం కాలేకపోయిందని ఈ సంవత్సరం వర్షాలు సమృద్ధిగా కురుస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. పాఠశాలలు, రోడ్లకు ఇరువైపులా, పొలాల దగ్గర, ప్రతి ఇంటి దగ్గర మొక్కలను విరివిగా నాటాలన్నారు. చెట్లద్వారానే వర్షాలు కురుస్తాయన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ ఆశయాలను మనందరం ముందుకు తీసుకువెళదామన్నారు. రంగారెడ్డి జిల్లా అభివృద్ధికి అధిక నిధులు కేటాయించి అభివృద్ధిలో పరుగులు తీయిస్తామని మంత్రులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వికారాబాద్, చేవెళ్ళ ఎమ్మెల్యేలు సంజీవరావు, యాదయ్య, ధారూర్ ఎంపిపి ఉమాపార్వతి, పిఎసిఎస్ వైస్ చైర్మన్ వేణుగోపాల్ రెడ్డి, వికారాబాద్ జడ్‌పిటిసి ముత్తహార్ షరీఫ్, డ్వామా పిడి, ఎపిఓ శ్రీనివాస్, టిఆర్‌ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.