హైదరాబాద్

10నుంచి ఆషాఢ బోనాల ఉత్సవాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముషీరాబాద్, జూన్ 11: ఆషాఢమాసం బోనాలు గ్రేటర్ హైదరాబాద్‌లో జూలై 10న ప్రారంభమై ఆగస్టు1వ తేదీన ముగుస్తాయని శ్రీమహంకాళి జాతర ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటి నేతలు వెల్లడించారు. ఈ ఉత్సవాలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఆహ్వానిస్తునట్లు వారు తెలిపారు. శనివారం హైదర్‌గూడ ఎన్‌ఎస్‌ఎస్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో కమిటీకు నూతనంగా ఎన్నికైన చైర్మన్ కె.ప్రవీణ్‌కుమార్ గౌడ్, ఉపాధ్యక్షులు చేతన్‌సూరి, సురేష్‌కిరణ్, ప్రధానకార్యదర్శి బిఆర్ సదానంద్‌ముదిరాజ్, కార్యదర్శులు దేవేందర్‌నాధ్ అసూర్య, బత్తుల సుబాష్ గౌడ్, శివచంద్రగిరి, అరవింద్‌కుమార్, ప్రచారకార్యదర్శులు మాణిక్‌ప్రభు, ధర్మతేజ, మీడియా కార్యదర్శులు జి.చిరంజీవి, ఎం.సంజయ్‌కుమార్ మాట్లాడారు. బోనాల ఉత్సవంలో భాగంగా జూలై 22న దేవీఅభిషేకం, ధ్వజారోహణ, కలశస్థాపన, 23న లక్షఫలార్చన, 24న ఘటస్థాపన, 26న దీపోత్సవం, 27న శాఖాంబరి పూజ, 28న లక్షపుష్పార్చన, 29న లక్ష కుంకుమార్చన, 30న నవచండీ హవనము, తొట్టెల నిర్వహణ, 31న బలిహరణ, దేవీ మహాభిషేకం, బోనాల సమర్పణ, ఆగస్టు1న అష్టదళపాద పద్మారాదన, పోతరాజు స్వాగతం, రంగ కార్యక్రమంలో భవిష్యవాణి, ఊరేగింపు జరుగుతుందని తెలిపారు. బోనాల ఉత్సవంలో ప్రధాని మోదీని ఆహ్వానించటానికి త్వరలో ఉమ్మడి దేవాలయ బృందం ఢిల్లీకి వెళ్లాలని నిర్ణయించినట్లు తెలిపారు.
గత సంవత్సర బోనాల ఉత్సవం సందర్భంగా పలు దేవాలయాలకు ఆర్ధిక సహాయం అందలేదని, ఈసారి ఆలయాలను గుర్తించి ఆర్ధిక సహకారం అందించాలని కోరారు. ఉమ్మడి దేవాలయా ఊరేగింపు కమిటి ఆధ్వర్యంలో విజయవాడ కనకదుర్గ అమ్మవారికి బోనం సమర్పించే కార్యక్రమాన్ని ఈసారి ప్రభుత్వం సౌజన్యంలో నిర్వహించి రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు మంచి సందేశం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఈ ఆషాడ మాసంలో ఒక వారం ఆరోగ్యవారంగా ప్రకటించి వాతావరణ మార్పులతో సంభవించే వివిధ రకాల వ్యాధుల గురించి ప్రజల్లో అవగాహన కల్పించాలని కోరారు.