రంగారెడ్డి

మంత్రుల హరితహారం సమీక్షకు అధికారుల డుమ్మా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వికారాబాద్, జూన్ 11: ఇద్దరు మంత్రులు నిర్వహించిన హరితహారం సమీక్షా సమావేశానికి అధికారులు గైర్హాజరయ్యారు. శనివారం అనంతగిరి హరిత రిసార్ట్స్ హాలులో ఏర్పాటు చేసిన హరితహారం సమీక్షా సమావేశానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర అటవీశాఖ మంత్రి జోగు రామన్న, రాష్ట్ర రవాణా శాఖ మంత్రి డాక్టర్ పి.మహేందర్‌రెడ్డి హాజరయ్యారు. సమావేశానికి జిల్లా కలెక్టర్ రాకపోవడంతో ఎందుకు రాలేదని మంత్రి జోగురామన్న ప్రశ్నిస్తూ కనీసం జాయింట్ కలెక్టరైనా రావాలి గదా అని ప్రశ్నించారు. సమావేశానికి సబ్‌కలెక్టర్ వచ్చిందంటూ సమాధానం రావడంతో జిల్లా సమాచారమంతా సబ్‌కలెక్టర్ వద్ద ఉందా అని ప్రశ్నించగా కేవలం రెండు నియోజకవర్గాలకే పరిమితమని సమాధానం రావడంతో అసహనం వ్యక్తం చేశారు. సమావేశానికి జిల్లా పంచాయతీ అధికారి, సాగునీటి పారుదల ఎస్‌ఇ, అర్‌అండ్‌బి ఎస్‌ఇ, పంచాయతిరాజ్ ఎస్‌ఇ అధికారులతో పాటు ఎక్సైజ్ శాఖ అధికారులు హాజరుకాకపోవడంపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అన్ని శాఖలకు సమాచారం ఇచ్చారా లేదా అని, రాత పూర్వకంగా ఇచ్చారా, ఫోన్‌లో చెప్పారా అని అటవీశాఖ అధికారులపై విరుచుకుపడ్డారు. కలెక్టర్ ద్వారా సమాచారం వెళ్ళడం సరైంది కాదని రాతపూర్వకంగా అన్ని శాఖలకు లేఖలు పంపాలని మంత్రి మహేందర్‌రెడ్డి పేర్కొన్నారు. ఇద్దరు మంత్రులు వచ్చిన సమావేశానికి అధికారులు రాకపోతే ఎలా అని వాపోయారు. సాగునీటి పారుదల శాఖకు చెందిన ఎఇ రావడంతో జిల్లా సమాచారం ఉందా అని మంత్రులు ప్రశ్నించగా రెండో శనివారం తన వద్ద సమాచారం లేదంటూ హాస్యాస్పదమైన సమాధానం చెప్పారు. కొందరు అధికారులు వారి పరిధుల్లో నాటాల్సిన మొక్కల సంఖ్యను చెప్పడంలో గత ఏడాది నాటిన మొక్కల వివరాలు చెప్పడంలో విఫలమవడమే కాకుండా, అటవీశాఖ అధికారులు సైతం లెక్కలు చెప్పడంలో తడబడటంతో మంత్రులు అసంతృప్తి వ్యక్తం చేశారు. అటవీశాఖ అధికారులు ఇప్పటికైనా ప్రజాప్రతినిధులతో టచ్‌లో ఉంటే హరితహారం విజయవంతం చేయవచ్చని చురకలు వేశారు. నియోజకవర్గ, మండల, గ్రామస్థాయిల్లో సమావేశాలు ఏర్పాటు చేసుకోవాలని మంత్రి రామన్న సూచించారు.