హైదరాబాద్

ఫీజుల నియంత్రణకు సమగ్ర చట్టం తీసుకురావాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖైరతాబాద్, జూన్ 12: రాష్ట్రంలో ప్రైవేట్ విద్యాసంస్థల దోపిడీని అరికట్టేందుకు సమగ్ర చట్టాన్ని తీసుకురావాలని భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్‌ఎఫ్‌ఐ) ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఆదివారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో నాయకులు సాంబశివ, కోట రమేష్ మాట్లాడుతూ ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థలు వసూళ్లు చేస్తున్న ఫీజులకు అడ్డూ అదుపూ లేకుండా పోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. లక్షల్లో ఫీజులు వసూలు చేస్తూ విద్యారంగాన్ని వ్యాపారమయంగా మార్చిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన ప్రభుత్వాలు మిన్నకుండిపోవడం సిగ్గుచేటని విమర్శించారు. జూన్ నెల వస్తుందంటేనే తల్లిదండ్రులు హడలిపోయే పరిస్థితి నెలకొందని, టర్మ్‌ఫీజులు, పుస్తకాలు, నోట్ బుక్స్‌తో పాటు డ్రెస్సులు, షూలు కూడా వారే విక్రయించడం దారుణమన్నారు. విధిలేని పరిస్థితిలో తల్లిదండ్రులు బయట తక్కువ ధరకు దొరికినా అక్కడే కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఉందన్నారు. అందరికీ విద్యనందించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన విద్యాహక్కు చట్టం సైతం అమలుకాక పోవడం దారుణమైన విషయమని అన్నారు. విద్యారంగంలో ఏ చట్టాలు చేసినా కార్పొరేట్ సంస్థలు వాటిని ధిక్కరిస్తూ ఏదైచ్చగా వారికి నచ్చినట్టు చేసుకుపోతున్నాయని మండిపడ్డారు. కనీస వౌలిక వసతులను సైతం కల్పించకుండా పాఠశాలలు కొనసాగిస్తున్నా ప్రభుత్వానికి కనిపించడం లేదా అని ప్రశ్నించారు. వీటన్నింటిపై ప్రభుత్వం వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో ఆంజనేయులు, రామకృష్ణ, మల్లేష్, యాదగిరి, జావీద్ తదితరులు పాల్గొన్నారు