హైదరాబాద్

హైకోర్టు ఆవరణలో ఉద్రిక్తత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చార్మినార్, జూన్ 13: న్యాయాధికారుల నియామకంలో ఆప్షన్‌ను రద్దు చేయటంతో పాటు హైకోర్టును వెంటనే విభజించాలని డిమాండ్ చేస్తూ న్యాయవాదులు చేపట్టిన ‘్ఛలో హైకోర్టు’ కార్యక్రమంతో పాతబస్తీలోని హైకోర్టు ఆవరణలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఆదివారం రాత్రి నుంచే పోలీసులు హైకోర్టు ఆవరణ మొత్తాన్ని తమ ఆధీనంలోకి తీసుకోవటంతో మదీనా చౌరస్తా నుంచి సిటీ హైకోర్టు, సిటీకాలేజీల రూట్‌లో వాహనాలను అనుమతించలేదు. అంతేగాక, మదీనా చౌరస్తా వద్దనే పోలీసులు సోమవారం ఉదయం ఐడి కార్డులున్న న్యాయవాదులను మాత్రమే అనుమతించటం, ఆ తర్వాత ర్యాలీగా వచ్చిన న్యాయవాదులను పోలీసులు అడ్డుకునేందుకు ప్రయత్నించటంతో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఆ తర్వాత న్యాయవాదులు రోడ్డుపై బైఠాయించి పెద్ద ఎత్తున నినాదాలు చేయటంతో రంగంలోకి దిగిన పోలీసులు వారిని అరెస్టు చేశారు. నిత్యం రద్దీగా ఉండే మదీనా చౌరస్తా మీదుగా సిటీకాలేజీ వైపు వాహనాలను అనుమతించకపోవటంతో వాహనదారులు ప్రత్యామ్నాయంగా చిన్న చిన్న గల్లీల ద్వారా ప్రయాణించారు. ఉన్నట్టుండి ఒక్కసారిగా ట్రాఫిక్ ఆంక్షలను అమలు చేయటంతో ఈ విషయం తెలీక చాలా మంది వాహనదారులు పోలీసులు మూసివేసిన రూట్‌లో ప్రయాణించేందుకు యత్నించటం, వారిని పోలీసులు వెనక్కి పంపించటం వంటి పరిణామాల నేపథ్యంలో ట్రాఫిక్ సమస్య రెట్టింపయ్యింది. చార్మినార్, శాలిబండల వైపు కూడా అనుమతించకపోవటంతో ట్రాఫిక్ భారీగా స్తంభించింది. చాంద్రాయణగుట్ట నుంచి శివార్ల నుంచి, మరికొన్ని సదూర ప్రాంతాల నుంచి మహాత్మగాంధీ బస్ స్టేషన్‌కు వచ్చే వాహనాలు, ఆర్టీసి బస్సులు చాంద్రాయణగుట్ట, కంచన్‌బాగ్, సైదాబాద్, మలక్‌పేటల మీదుగా స్టేషన్‌కు చేరుకున్నాయి. మరోవైపు ఆరంఘర్ చౌరస్తా, జూపార్కు, బహద్దూర్‌పురా, పురానాపూల్, ముస్లింజంగ్ బ్రిడ్జి వంటి ప్రాంతాల మీదుగా ఎక్కువ వాహనాలు వచ్చాయి. ఆంక్షలు అమల్లో ఉన్నపుడు గౌలీగూడ ఎంజిబిఎస్ బస్ స్టేషన్ నుంచి బెంగుళూరు, కర్నూలు, మహాబూబ్‌నగర్, షాద్‌నగర్‌ల వైపు వెళ్లే ఆర్టీసి బస్సులు ట్రాఫిక్ చిక్కుకున్నాయి. ఆంక్షలకు తోడు రంజాన్ ట్రాఫిక్ తోడు కావటంతో వాహనదారుల ఇబ్బందులు వర్ణనాతీతం.