హైదరాబాద్

భక్తిశ్రద్ధలతో విశాల్ దీవన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 26: సిక్కుల ఆది గురువు గురునానక్ జయంతి వేడుకలను నగరంలో సిక్కులు ప్రకాశ్ ఉత్సవ్ పేరిట అత్యంత భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించిన గురునానక్ జయంతి ఉత్సవాలు బుధవారం ముగిశాయి.
నగరంలోని గౌలీగూడ, సికిందరాబాద్‌లోని గురుద్వారాల ఆధ్వర్యంలో ఈ ఉత్సవాలు వేర్వేరుగా ఘనంగా జరుగుతున్న ఈ ఉత్సవాల్లో భాగంగా బుధవారం నిజాంకాలేజీ గ్రౌండ్స్‌లో విశాల్ దీవన్ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఉత్సవాల్లో భాగంగా మంగళవారం అర్థరాత్రి వరకు గౌలీగూడలోని గురుద్వారాలో కీర్తన్ దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. అలాగే బుధవారం నిజాం కాలేజీ గ్రౌండ్స్‌లో విశాల్ దీవన్ కార్యక్రమం ఘనంగా జరిగింది. దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన జాతీయ స్థాయిలో పేరుగాంచిన రాగిజాతలు గుర్బానీ కర్తీనలు ఆలపించి, గురునానక్ భోదనలు అందరికీ అర్థమయ్యే రీతిలో ఇందుకు గాను ప్రబంధక్ కమిటీ ప్రతినిధులు బల్దేవ్‌సింగ్ బగ్గా, బల్బీర్‌సింగ్ బగ్గా, కార్యదర్శులు ఎస్. అవతార్‌సిగ్, ఎస్. గురుదీప్ సింగ్ సాలుజలు మంగళవారం నిజాంకాలేజీ గ్రౌండ్స్‌ను సందర్శించి, విశాల్ దీవన్ ఏర్పాట్లను పరిశీలించారు.
ఈ కార్యక్రమంలో భాగంగా దేశంలోని వివిధ ప్రాంతాల్లో పేరుగాంచిన రాగిజాతలు హాజరై గురునానక్ కీర్తనలను ఆలపిస్తారని నిర్వాహకులు తెలిపారు. సామూహిక సంకీర్తనాలాపన కార్యక్రమానికి నగరంలోని వివిధ ప్రాంతాల నుంచే గాక, శివార్లు, ఇరుగుపొరుగు జిల్లాల నుంచి కూడా వేల సంఖ్యలో సిక్కులు హాజరవుతారని వారు తెలిపారు.
ఉదయం పదకొండు గంటల నుంచి మూడు గంటల వరకు జరిగే ఈ కార్యక్రమానికి సుమారు 30వేల నుంచి 40వేల వరకు సిక్కులు హాజరుకానున్నట్లు వారు వివరించారు. బుధవారం రాత్రి తొమ్మిది గంటల నుంచి అర్థరాత్రి రెండు గంటల వరకు సుప్రసిద్ధ రాగిజాతలు అఫ్జల్‌గంజ్‌లోని గురుద్వారాలో కీర్తన్ దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు.