హైదరాబాద్

ఓయు పిజి ఇసెట్ 2016 ఫలితాలు విడుదల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాచారం, జూన్ 16: నాణ్యమైన ఇంజనీరింగ్ విద్యతోనే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని ఉన్నత విద్యామండలి చైర్మన్ పాపిరెడ్డి అన్నారు. ఓయు పిజి ఈసెట్ 2016 పరీక్షా ఫలితాలను ఓయు రిజిస్ట్రార్ సురేష్‌కుమార్‌తో కలసి పాపిరెడ్డి విడుదల చేశారు. ఈసందర్భంగా ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ ఓయు పరిధిలోని ఇంజనీరింగ్ ఎంటెక్, ఎంఫార్మసీ కోర్సుల ప్రవేశానికి నిర్వహించిన పిజి ఈసెట్ 2016 పరీక్షా ఫలితాల్లో 85.01శాతం ఉత్తీర్ణత సాధించారని తెలిపారు. ఓయు ఇంజనీరింగ్ కాలేజీలో నాణ్యమైన ఇంజనీరింగ్ విద్యను అభ్యసించిన విద్యార్ధులు తెలంగాణ పునర్‌నిర్మాణానికి వారథులుగా ఉంటారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఓయు పిజి ఈసెట్ ఇంజనీరింగ్ పరీక్షకు 43,403 దరఖాస్తు చేసుకోగా 41,251 మంది విద్యార్ధులు ఉత్తీర్ణత సాధించారని తెలిపారు పరీక్ష కన్వీనర్ వెంకటాచలం, రామాచంద్ర, రమేష్‌బాబు పాల్గొన్నారు.

ఓయు సైన్స్‌కాలేజీ ప్రిన్సిపాల్ నాగేశ్వర్‌రావును సస్పెండ్ చేయాలి
దళిత కాంట్రాక్టు అధ్యాపకుల పట్ల ఓయు సైన్స్ కాలేజీ ప్రిన్సిపాల్ నాగేశ్వర్‌రావుకుల దురహంకారంతోకక్ష సాధింపులకు పాల్పడుతున్నారని కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈసందర్భంగా ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ ఓయులో కాంట్రాక్టు అధ్యాపకులను మానసిక వేధింపులకు గురిచేస్తున్నాడని తెలిపారు. దళిత కాంట్రాక్టు అధ్యాపకులను కులంపేరుతో దూషణలకు పాల్పడినా ఎందుకు చర్యలు తీసుకోవడంలేదని విద్యార్థి సంఘాల నాయకులు పాపిరెడ్డికి వినతిపత్రం అందజేశారు. నాగేశ్వర్‌రాపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి రిజిస్ట్రార్ కార్యాలయంలో డిసిపితో చర్చలు జరపడంలో ఆంతర్యం ఏమిటిని విద్యార్థులు ప్రశ్నించారు. వెంటనే నాగేశ్వర్‌రావుని సస్పెండ్ చేయాలని విద్యార్ధి సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. కార్యక్రమంలో విద్యార్ధి సంఘాల నాయకులు స్టాలిన్, శరత్, వెంకట్, అంజిబాబు, రవి పాల్గొన్నారు.