హైదరాబాద్

గృహకార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చార్మినార్, జూన్ 16: గృహకార్మికుల సమస్యల పరిష్కారానికి శక్తివంచన లేకుండా తనవంతు కృషి చేస్తానని హోం మంత్రి నాయిని నర్సింహరెడ్డి హామీ ఇచ్చారు. అంతేగాక, అనేక సమస్యలతో సతమతమవుతున్న కార్మికుల సమస్యలను సిఎం కెసిఆర్ దృష్టికి తీసుకెళ్తానని ఆయన వ్యాఖ్యానించారు. గురువారం బషీర్‌బాగ్‌లోని ప్రెస్‌క్లబ్‌లో తెలంగాణ రాష్ట్రీయ గృహకార్మిక యూనియన్ ఆధ్వర్యంలో ప్రపంచ గృహకార్మిక దినోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి హోం మంత్రి నాయిని ముఖ్య అతిధిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన నేరుగా కార్మికులను కలిసి వారి సమస్యలను అడిగి తెల్సుకున్నారు. మాట్లాడుతూ ఈఎస్‌ఐ కార్డు కావాలని గృహకార్మికులు కోరటం న్యాయమే అయినా, కార్డు మంజూరీ, కార్డును వర్తింపజేసేందుకు ఉన్న ప్రత్యేక గైడ్‌లైన్స్ ఉన్నాయని ఆయన వివరించారు. ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ గృహకార్మికులు చేస్తున్న పనిని ఇతర పని క్యాటగిరీ కింద గుర్తించి అయిదేళ్లు అయిందన్నారు. మనదేశంలో ఈ చట్టాన్ని తీసుకురావాలంటే ఇంకా సమయం పట్టే అవకాశముందన్నారు. గృహకార్మికులు పనిచేసే ఇళ్లలో యజమానులు ఏమైనా ఇబ్బందులకు గురి చేస్తే నేరుగా తన దృష్టికి తీసుకువస్తే, తాను స్పందించిన సరైన చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. కార్మికులపై అనేక అంశాలకు సంబంధించి చైతన్యం రావాలని, కార్మికులంతా ఐక్యంగా ఉంటేనే ఏదైనా సాధించుకునే అవకాశముందని సూచించారు. మీ సమస్యలు ఏ రకంగా ఉంటాయో ఓ ట్రేడ్ యూనియన్ నేతగా తనకు బాగా తెలుసని, సమస్యల పరిష్కారం, మీ సంక్షేమం, అభ్యున్నతి కోసం ప్రభుత్వం కూడా తగిన సహాయం అందజేస్తోందని మంత్రి వ్యాఖ్యానించారు. అనంతరం రాష్ట్ర మహిళా కమీషన్ చైర్మన్ త్రిపుర వెంకటరత్నం మాట్లాడుతూ గృహకార్మికులకు వేతనంతో కూడిన ఒక రోజు సెలవును ఇవ్వాలని, అంతేగాక, వీరికి ఈఎస్‌ఐ, పిఎఫ్‌లను వర్తింపజేయటంతో పాటు వీరికి జరుగుతున్న వేధింపులను అడ్డుకోవాలని కోరారు. కార్యక్రమంలో ఐఎల్‌టియు నేత ఎస్.ఎల్. పద్మ, ఐఎన్‌టియుసి నాయకురాలు అరుణ, వివిధ కార్మిక సంఘాల నేతల ప్రేమ్‌పావనీ, ఐద్వా ప్రతినిధి ఆశాలత, లిసీ జోసఫ్ పాల్గొన్నారు.