హైదరాబాద్

ముంచుకొస్తున్న ముప్పు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 18: మహానగరానికి వర్షం ముప్పు ముంచుకొస్తోంది. నేడో,రేపో నైరుతి రుతుపవనాలు తాకుతుండటంతో నగరంలో గత సంవత్సరం కన్నా ఎక్కువ మోతాదులో వర్షం కురిసే అవకాశామున్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది. అయినా మోతాదుకు మించి వర్షం కురిస్తే నగరంలో పరిస్థితి మరో సారి అతలాకుతలం కానుంది. కొద్ది రోజుల క్రితం బలమైన ఈదురుగాలులతో కురిసిన వర్షాలకు వందల సంఖ్యలోచెట్లు నేలకొరగటంతో పాటు ఇద్దరు ప్రాణాలు కొల్పోవల్సిన దుస్థితి తలెత్తింది. గతంలో ఎన్నడూ లేని విధంగా దాదాపు 150 కి.మీల వేగంతో గాలులు వీయటంతో ఈ విపత్కరమైన పరిస్థితి తలెత్తిందంటూ సర్దిచెప్పుకుంటున్న అధికారులను ఈ సారి నైరుతి రుతుపవనాల రాక, సాధారణం కంటే ఎక్కువ వర్షాలు కురిసే అవకాశముందంటూ ముందుగా హెచ్చరిస్తున్నా, నగరవాసులకు వాన కష్టాలు తప్పేట్టు లేవు. ముఖ్యంగా నగరంలో నేటికీ నిజాంకాలం నాటి వరద నీటి కాలువలు, డ్రైనేజీ వ్యవస్థ ఉంది. ఫలితంగానే పదిహేనేళ్ల క్రితం నగరం నీటి మునిగింది. మున్ముందు నగరంలో వరదలు సంభవించుకండా చేపట్టాల్సిన చర్యల కోసం అప్పటి ప్రభుత్వం నియమించిన కిర్లోస్కర్ కమిటీ చేసిన సిఫార్సుల్లో నేటికీ ఒక్కటి కూడా అమలు చేయని అధికారులు ఆ సిఫార్సులు పాతకాలం నాటివేనని నేటి అధికారులు కొట్టి పారేస్తున్నారు. గంట సమయంలో ఏడు సెంటీమీటర్లకు మించి వర్షం కురిస్తే నాలాలు, డ్రైనేజీలు కలిసిపోయి సీవరేజీ నీళ్లు రోడ్డున ప్రవహించే పరిస్థితి నెలకొంది. వరద నీటి కాలువలను మెరుగుపరిచేందుకు, కబ్జాలతో కుదించుకుపోయిన నాలాలకు విముక్తి కల్గించి, ఆధునీకరించేందుకు అధికారులు ఎన్ని ప్రతిపాదనలు చేసినా, ఎదో ఒక అడ్డంకి ఎదురవుతూనే ఉంది. నాలాల ఆధునీకరణకు 2007లో కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సంస్థ అయిన జెఎన్‌ఎన్‌యుఆర్‌ఎం నుంచి రూ. 250 కోట్లు విడుదలైనా, తొలుత వాటిని ఎలా వినియోగించుకోవాలో తెలియక తికమక పడ్డ అధికారులు, తీరా కళ్లు తెరిచి నిధులను వెచ్చించి నాలాలను ఆధునీకరిద్దామన్న సమయానికి భవన నిర్మాణ సామాగ్రి రేట్లు గణనీయంగా పెరిగిపోయాయి. ఎలాగోలాగ పనులు చేపట్టేందుకు ముందుకు రాగా, నాలాలపై వెలసిన ఆక్రమణలు తొలగింపు పెద్ద తలనొప్పిగా మారింది. ప్రజాప్రతినిధులు ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతూ నాలాలకిరువైపులా ఆక్రమణలను చేసుకుని జీవిస్తున్న పేదల ఇళ్లను కాపాడుతామని క్షేత్ర స్థాయిలో ప్రజలను నమ్మిస్తూనే చట్టసభల్లో మాత్రం నాలాల ఆధునీకరణ ముందుకు సాగటం లేదని, అధికారులు ఒక్క కబ్జాను కూడా తొలగించలేకపోయారని నిలదీయం పరిపాటైపోయింది. ఏ పనులు చేపట్టినా అలసత్వం వహించే అధికారులు, ఏ ప్రయోజనం లేనిదే దేనీకీ అంగీకరించని ప్రజాప్రతినిధులు పుణ్యమాని నగరంలో నాలాల ఆధునీకరణకు ఇప్పటి వరకు వందల కోట్లు వెచ్చించినా ఆశించిన ఫలితమేమీ దక్కలేదు. మోతాదుకు మించి వర్షం కురిస్తే నాలాలకిరువైపులా ఉన్న ఇళ్లు నీటి మునగాల్సిన పరిస్థితి దాపురించింది.
నాలాల ఆధునీకరణకు రూ. 7వేల కోట్లు కావాలి
నగరంలోని భారీ, మధ్య, చిన్న తరహా నాలాలను ఆధునీకరించేందుకు సుమారు రూ. 7వేల కోట్ల వరకు ఖర్చవుతున్నట్లు అంచనాలున్నాయని, ఇంత పెద్ద మొత్తంలో నిధులు ఎక్కడి నుంచి సమకూర్చుకోవాలని గ్రేటర్ ఇంజనీర్ ఇన్ చీఫ్ ఇంతియాజ్ అహ్మద్ వ్యాఖ్యానించారు. ముఖ్యంగా నాలాలపై వెలసిన ఆక్రమణల తొలగింపుకు సంబంధించి న్యాయపరంగా ఎన్నో చిక్కులున్నాయని, అవన్నీ తొలగి, ఆక్రమణలను తొలగిస్తే తప్పా, నాలాల ఆధునీకరణకు అవకాశం లేదని ఆయన సమాధానమిచ్చారు.

పర్యావరణ విధ్వంసానికి
పాల్పడుతున్న కెసిఆర్ ప్రభుత్వం
టిపిసిసి అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి ధ్వజం

హైదరాబాద్, జూన్ 18: హైదరాబాద్‌లో వ్యూహాత్మక రోడ్ల అభివృద్ధి పథకం పేరిట కెసిఆర్ ప్రభుత్వం పర్యావరణ విధ్వంసానికి పాల్పడుతోందని టిపిసిసి అధ్యక్షులు ఎన్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి ధ్వజమెత్తారు. అశాస్ర్తియమైన విధానాల ద్వారా నగరంలో పచ్చదనాన్ని హరించే వేసే చర్యలకు స్వస్తి చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
శనివారం ఇక్కడ ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, దేశంలోని పేరు తెచ్చుకున్న కెబిఆర్ పార్కును నాశనం చేయవద్దని కోరారు. గాంధీభవన్‌లో మాజీ మంత్రి మర్రి శశిధర్ రెడ్డి ఎస్‌ఆర్‌డిపిపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. ఈ కార్యక్రమానికి పలువురు కాంగ్రెస్ నేతలు హాజరయ్యారు.
అనంతరం ఉత్తంకుమార్ రెడ్డి మాట్లాడుతూ రాజధానితో పాటు రాష్ట్రంలో ఎక్కడైనా పర్యావరణానికి హాని కలిగించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటే కాంగ్రెస్ పార్టీ చేతులు ముడుచుకుని కూర్చోదన్నారు. ప్రజల ప్రయోజనాల కోసం అభివృద్ధిని స్వాగతిస్తామని, అదే సమయంలో రాజకీయ, ఆర్ధిక ప్రయోజనాల కోసం పర్యావరణానికి ముప్పుతెచ్చే విధంగా ప్రభుత్వం వ్యవహరించరాదన్నారు.
స్కైవేస్, ట్విన్ టవర్లు ఎందుకని ఆయన ప్రశ్నించారు. ఎస్‌ఆర్‌డిపి వల్ల భవిష్యత్తులో ట్రాఫిక్ సమస్యలు ఉత్పన్నమవుతాయన్నారు. మాజీ మంత్రి మర్రి శశిధర్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజలు పచ్చదనాన్ని హరించివేసే పథకాలను హర్షించడం లేదన్నారు. అభివృద్ధి పేరిట కెబిఆర్ పార్కును విధ్వంసం చేయరాదన్నారు. ప్రముఖ పర్యావరణ వేత్త పురుషోత్తం రెడ్డి మాట్లాడుతూ, ప్రజల కోసం అభివృద్ధిని స్వాగతిస్తామని, కాని ఎస్‌ఆర్‌డిపి వల్ల సమతుల్యత దెబ్బతింటుందన్నారు.