హైదరాబాద్

క్రమబద్ధీకరణకు ఇదే చివరి అవకాశం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 18: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఆక్రమిత స్థలాల క్రమబద్ధీకరణ ప్రక్రియను మరోసారి యుఎల్‌సి భూములకు వర్తింపచేసింది. దీనికి ప్రత్యేకంగా జీవో నంబర్ 92ద్వారా ఉత్తర్వులు జారీ చేసింది. పట్టణ భూ గరిష్ట పరిమితి చట్టానికి లోబడి ప్రభుత్వానికి అప్పగించిన భూముల్లో ఆక్రమించుకున్న భూముల క్రమబద్ధీకరణకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు రంగారెడ్డి జిల్లాలో సుమారు 600 ఎకరాల ఖాళీ స్థలాలను క్రమబద్ధీకరించేందుకు అవకాశం కల్పించగా హైదరాబాద్ జిల్లాలోని సుమారు 71 ఎకరాల ఖాళీ స్థలాల క్రమబద్ధీకరణకు అవకాశం కల్పిస్తోంది. ప్రైవేట్ స్థలాలుగా భావించి కొనుగోలు చేసిన ఈ స్థలాలను క్రమబద్ధీకరించుకోని పక్షంలో సదరు ఖాళీ స్థలాలను తిరిగి ప్రభుత్వం స్వాధీనం చేసుకుని బహిరంగ వేలం వేయడంతోపాటు ఇతర ప్రజా ప్రయోజనాలకు ఈ స్థలాలను వినియోగించుకోవాలని నిర్ణయించింది. ఈమేరకు ఈ నెల 25వ తేదీలోగా యుఎల్‌సి భూములను క్రమబద్ధీకరించుకునేందుకు ముందుకు రానివారి స్థలాలను 26వతేదీనుండి ప్రభుత్వం ఆక్రమించుకుని సదరు భూములను ప్రజా ప్రయోజనాలకు వినియోగించుకుంటామని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ రఘునందన్‌రావు హైదరాబాద్ జిల్లా కలెక్టర్ రాహుల్ బొజ్జాలు సంయుక్తంగా శనివారం రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్‌లో ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో స్పష్టం చేసారు. జీవో 58, 59 ద్వారా ప్రభుత్వ, యుఎల్‌సి భూములను ఆక్రమించుకుని ఇళ్లు నిర్మించుకున్నవారికి క్రమబద్ధీకరించుకునేందుకు అవకాశం కల్పించి క్రమబద్ధీకరణ చేసామని ప్రస్తుతం పట్టణ భూ గరిష్ట పరిమితి చట్టం అమలుకు ముందు ప్రైవేటు భూములు తర్వాత ప్రభుత్వ భూములుగా మారిన ఈ భూములను క్రమబద్ధీకరించుకునే అవకాశం ప్రభుత్వం కల్పించిందని ఇద్దరు కలెక్టర్లు స్పష్టం చేసారు. మొత్తం ప్రక్రియ తొంభై రోజుల్లో పూర్తి చేయాలని 59వ జీవోలో పేర్కొన్న నిబంధనల ప్రకారమే ఈ స్థలాలు కూడా నిర్ణీత విస్తీర్ణానికి నిర్ణయించిన ధరలను ప్రభుత్వానికి చెల్లించి రిజిస్ట్రేషన్లు చేయించుకోవచ్చునని వారు స్పష్టం చేసారు. ఇప్పటి వరకు ప్రభుత్వం సేకరించిన వివరాల మేరకు సుమారు 5,700 మంది రంగారెడ్డి జిల్లాలో యుఎల్‌సి భూములను కొనుగోలు చేసి ఆక్రమణలో ఉండగా అందులో 4,200 మంది 250 చదరపు గజాల లోపు విస్తీర్ణంలో ఆక్రమణలో ఉన్నట్టు గుర్తించినట్టు కలెక్టర్ రఘునందన్‌రావు స్పష్టం చేసారు. మూడు దఫాలుగా చెల్లించాల్సిన మొత్తాన్ని 90 రోజుల్లోగా చెల్లించాలని దరఖాస్తు చేసుకునే సమయంలో స్థానికంగా ఉన్న ఈసేవా, మీసేవాలల్లో 2000 రూపాయలు చెల్లించి దరఖాస్తు చేసుకోవచ్చునని వివరించారు. సర్వీసు చార్జీగా 35 రూపాయలు మీసేవా యాజమాన్యానికి చె ల్లించాల్సి ఉంటుందని వివరించారు. మీ సేవా కేంద్రాల్లో ఆధార్ కార్డు లేని కారణంగా దరఖాస్తు స్వీకరించడం లేదన్న ప్రశ్నకు కలెక్టర్ రఘునందన్ రావు స్పందిస్తూ ఈక్రమబద్ధీకరణకు గతంలో జరిగిన రిజిస్ట్రేషన్ దస్తావేజుల ఆధారంగానే క్రమబద్ధీకరణ చేస్తామని కేవలం గుర్తింపుకు మాత్రమే ఆధార్ కార్డును పరిగణనలోకి తీసుకుంటామని ఆయన తెలిపారు. రు.2000లు చెల్లించి ఆధార్ లేకున్నా దరఖాస్తు చేసుకోవచ్చునని ఆయన వివరించారు. ఈ జీవో ద్వారా 3వేల గజాలలోపు విస్తీర్ణాన్ని జిల్లా పరిధిలోని కమిటీ నిర్ణయం తీసుకుని క్రమబద్ధీకరణ చేస్తుందని అంతకు మించి విస్తీర్ణం ఉంటే ప్రభుత్వానికి సిఫార్సు చేస్తుందని తెలిపారు. హైదరాబాద్ జిల్లాలో సుమారు 16వందల ఎకరాల యుఎల్‌సి భూములుండగా అందులో ఖాళీగా 71 ఎకరాలు మాత్రమే ఉందని, వాటిని క్రమబద్ధీకరించే ప్రక్రియను మొదలుపెట్టినట్టు కలెక్టర్ రాహుల్ బొజ్జా స్పష్టం చేసారు. ఎలాంటి కోర్టు వివాదాలు లేకుండా ఉన్న ఈ స్థలాన్ని కొనుగోలు చేసినాలేదా ఆక్రమణ దారులకు ఎలాంటి ఆధారాలున్నా క్రమబద్ధీకరణ చేసుకునేందుకు ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. హైదరాబాద్‌లో ఎక్కువ శాతం ఎన్నారైలు ఈస్థలాలను కొనుగోలు చేసి వుంటారని వివరాలు అందుబాటులో లేకున్నా సదరు ఖాళీ స్థలాల్లో నోటీసులు అంటించామని ఆయన తెలిపారు. తెలిసిన వివరాల మేరకు హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో నోటీసులు జారీ చేసామని ఆయన తెలిపారు. చివరి అవకాశంగా ప్రభుత్వం కల్పిస్తున్న క్రమబద్ధీకరణకు ముందుకు రాని పక్షంలో 22ఎ ద్వారా రిజిస్ట్రేషన్లు జరగకుండా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేస్తుందని ఆయన తెలిపారు.

గాంధీ’ ఆసుపత్రికి రూ.50 లక్షలు

హైదరాబాద్, జూన్ 18: దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వాసుపత్రిగా పేరుగాంచిన గాంధీకి హాస్పిటల్‌లో సౌకర్యాలను మెరుగుపరిచేందుకు తన నియోజకవర్గం అభివృద్ధి నిధుల నుంచి రూ. 50లక్షలు మంజూరు చేస్తున్నట్లు రాష్ట్ర పశు సంవర్థక శాఖ, సినిమాటోగ్రాఫీ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ తెలిపారు. శనివారం ఆయన సికిందరాబాద్ గాంధీ ఆసుపత్రిలో సమస్యలు, సౌకర్యాలను తెల్సుకునేందుకు సమావేశమందిరంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గతంలో చేసిన వాగ్దానం మేరకు ఆసుపత్రికి రెండు అంబులెన్స్‌లను కూడా వారం రోజుల్లో అందజేయనున్నట్లు తెలిపారు. ఇప్పటికే నగరంలోని ప్రతి అర్బన్ హెల్త్‌సెంటర్‌కు రూ. పది లక్షలు మంజూరు చేయనున్నట్లు తెలిపారు. ఆసుపత్రికి తక్షణమే కావల్సిన పరికరాలు, సౌకర్యాల జాబితాను తయారు చేసిన ఇవ్వాలని, అందులో ప్రాధాన్యత ప్రాతిపదికన వాటిని సమకూర్చేందుకు రూ. 50లక్షలను కేటాయిస్తామన్నారు. ఆసుపత్రిలో నెలకొన్న డాక్టర్లు, సిబ్బంది కొరతను పదిరోజుల్లో ఆరోగ్యశాఖ మంత్రికి వివరించి, మంత్రి ఆసుపత్రి సందర్శించేలా ప్రయత్నిస్తానని మంత్రి హామీ ఇచ్చారు.