హైదరాబాద్

మద్యం సేవించి బైక్ రేసింగ్ కఠిన చర్యలు కలేనా..?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖైరతాబాద్, జూన్ 19: బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ రోడ్లపై యువకులు మద్యం సేవించి రేసింగ్‌లకు పాల్పడుతున్నారు. అయతే వీరిలో రాజకీయ నాయకుల కుమారులు, పలుకుబడిగల అధికారులకుమారులువుండటంతో వారిని వదిలివేసి అనామకులపై కేసులు నమోదు చేస్తుండటంతో రేస్‌లకు అడ్డూ అదుపూ లేకుండాపోతోంది. వీకెండ్స్‌లో మద్యం సేవించి పందెం కట్టుకొని మరీ బైక్ రేసింగ్‌లకు తెగబడుతున్నారు. బంజారాహిల్స్ ట్రాఫిక్ పోలీసులు శనివారం అర్ధరాత్రి స్పెషల్‌డ్రైవ్ నిర్వహించారు. మితిమీరిన వేగంతో దూసుకువెళుతూ తోటి వాహనదారులను, పాదచారులను భయాందోళనకు గురిచేస్తున్నారన్న ఆరోపణపై పలువురిపై కేసులు నమోదుచేసి వారి వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. నిబంధనలకు విరుద్ధంగా రోడ్లపై దూసుకువెళ్లే వారు ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసు అధికారులు పదే పదే ప్రకటనలు చేస్తున్నప్పటికీ రేస్‌లు యథాతథంగా జరగడం గమనార్హం.చిత్తుగా చిత్తుగా మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న జూబ్లీహిల్స్ ట్రాఫిక్ పోలీసులు కేసులు నమోదు చేశారు. అర్ధరాత్రి జూబ్లీహిల్స్ రోడ్‌నెంబర్ -10 పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించారు. నిబంధనలకు విరుద్ధంగా మోతాదుకు మించి మద్యం సేవించి వాహనం నడుపుతున్న డిసిఎం తో పాటు తొమ్మిది కార్లు, 10 ద్విచక్రవాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకొని వాహదారులపై కేసులు నమోదు చేశారు. వీరందరికీ కౌన్సిలింగ్ నిర్వహించి కోర్టులో హాజరుపరుస్తామని పోలీసులు తెలిపారు.