హైదరాబాద్

అక్రమార్కులను వదిలేది లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చాంద్రాయణగుట్ట, జూన్ 19: గత కొద్ది సంవత్సరాలుగా జిల్లా, రాష్ట్ర చెస్ అసోసియేషన్‌లను అడ్డుగా పెట్టుకుని అక్రమాలను చేసిన అక్రమారులను వదిలేది లేదని తెలంగాణ రాష్ట్ర చెస్ సంఘం ప్రధాన కార్యదర్శి అనంచిన్ని వెంకటేశ్వరరావు స్పష్టం చేశారు. ఉచితంగా కోచ్‌లకు, నిర్వాహకులకు రాష్ట్ర చెస్ అసోసియేషన్ ఏర్పాట్లుచేసిన శిక్షణా తరగతుల ముగింపు కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిధిగా విచ్చేసి భావోద్వేగంగా ప్రసంగించారు. గతంలో జరిగిన ప్రతి అవినీతి కార్యక్రమానికి ఇప్పటికే సాక్ష్యాధారాలను సేకరించటం జరిగిందని, స్థాయినిబట్టి చర్యలకు న్యాయ నిపుణులను సంప్రదిస్తున్నట్లు, ఇప్పటికి కూడా ఒకరిద్దరు అసోసియేషన్‌ను అడ్డుగా పెట్టుకుని అక్రమాలు చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారని, వాటి ఆటలు సాగవని, ఇప్పటికే చాలా వరకు నియంత్రించామని, అనుమతి లేకుండా కోచింగ్ క్యాంపులు, టోర్నీలు ఏర్పాటుచేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరికలతో వినని వారికి సస్పెన్షన్ వేటు సిద్ధంగా ఉంటుందని ఆయన హెచ్చరించారు.
ఏ అకాడమికీ అనుమతి లేదు
వన్‌గోల్ చెస్ అకాడమీ సహా రాష్ట్రంలో ఏ ఒక్క ‘అకాడమీకి’ అనుమతి ఇవ్వలేదని, అకాడమీ ముసుగులో అధిక ఫీజులు నియంత్రణే తమ లక్ష్యమని జూన్ 30 వరకు ఉన్న అకాడమీల అనుమతుల దరఖాస్తు గడువును ఎట్టి పరిస్థితులలోనూ పెంచమని ఆయన చెప్పారు.
ప్రత్యేక దుస్తులు
వినూత్న ప్రయత్నాలకు తెరదీసిన చెస్ అసోసియేషన్ ‘లోగో’తో కూడిన టీ-షర్ట్స్‌ను అసోసియేషన్ ప్రధానసలహాదారు కె.ఎస్.ప్రసాద్ ఆవిష్కరించగా, కార్యక్రమానికి ఎన్.సి.గోపాలం అధ్యక్షత వహించగా, నిజామాబాద్ జిల్లా అసోసియేషన్ కార్యదర్శి రమేష్, గుమ్మడి స్రవంతి పాల్గొనగా, అంతార్జతీయ ఆర్బిటర్ కె.కరుణాకర్‌రెడ్డి, ఫిడే నిబంధనల శిక్షణ అందరిని అలరించింది.
వేటు ఎవరిపై...?
కార్యదర్శి ఫైర్‌బ్రాండ్ అనంచిన్ని వెంకటేశ్వరరావు నోట వచ్చిన వేటు పదం చెస్ వర్గాలలో తీవ్ర సంచలనం కలిగించింది. ఎప్పుడూ వౌనంగా ఉండే అనంచిన్ని తీవ్రస్థాయిలో అక్రమార్కుల గురించి ప్రస్తావించటంతో వేదికపైన ఉన్న సీనియర్ సభ్యులను నిశే్చష్టులను చేయగా, చెస్ వర్గాలను ఆనందింప జేసింది. మరి వేటు ‘‘మాజీ’’ల మీదనా..? లేక ఇప్పటికే జిల్లా అసోసియేషన్‌ల మీద పెత్తనం చెలాయిస్తున్న వారిపైన విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు ఈ నెల 22న ప్రధాన సలహాదారు కె.ఎస్. ప్రసాద్‌చే ఒక కార్యక్రమంలో కీలక ప్రకటనకు అనంచిన్ని సిద్ధం చేసినట్లు తెలిసింది.