హైదరాబాద్

యోగను శాస్ర్తియ కోణంలో చూడాలి: గురువు కమలేష్‌జీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 21: యోగను యువత శాస్ర్తియ కోణంలో చూడాలని శ్రీరామచంద్ర మిషన్ గురువర్యులు కమలేష్‌జీ ఉద్భోదించారు. అంతర్జాతీయ యోగ దినోత్సవం సందర్భంగా గచ్చిబౌలి స్టేడియంలో శ్రీరామచంద్ర మిషన్ ఏర్పాటు చేసిన హార్ట్ఫుల్‌నెన్ ధ్యాన శిక్షణా కార్యక్రమంలో గురువర్యులు అమెరికా నుంచి నేరుగా ఆన్‌లైన్ ద్వారా మాట్లాడారు. యువత శాస్తవ్రేత్తగా మారి తమ హృదయాన్ని ప్రయోగశాలగా మార్చి యోగా శాస్ర్తియతను తెలుసుకోవాలన్నారు. యోగ, ధ్యానంతో మానసిక ప్రశాంతత కలుగుతుందన్నారు. ప్రతి ఒక్కరు తమ జీవితం యొక్క పరమార్ధాన్ని తెలుసుకోవాల్సిన సమయం ఆసన్నమైందని పేర్కొన్నారు. మనిషి జీవితకాలంలో పరిణితి చెందేందుకు ధ్యానం ఎంతో ఉపయోగపడుతుందని చెప్పారు. హార్ట్ఫుల్‌నెస్ ధ్యానం ప్రత్యేకత యోగికిట్రాన్స్‌మిషన్ అని తెలిపారు. శ్రీరామచంద్ర మిషన్ మెట్రోజోన్ కోఆర్డినేటర్ డాక్టర్ సాయిరాంరెడ్డి మాట్లాడుతూ యువతో యోగా పట్ల అవగాహన కల్పించేందుకు కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. హైదరాబాద్ పరిసర ప్రాంతాల నుంచి 60 పాఠశాలల నుంచి 20వేల మంది విద్యార్థినీ, విద్యార్థులు పాల్గొన్నారని పేర్కొన్నారు. తెలంగాణ జోనల్ కోఆర్డినేటర్ ఎస్‌వి కృష్ణారావు మాట్లాడుతూ రామచంద్ర మిషన్ సుమారు 144 దేశాల్లో వ్యాప్తిచెందిందని అన్నారు. యువతలో విలువలు పెంచెందుకు వారికి నాణ్యమైన జీవితాన్ని అందించేందుకు ధ్యానం దోహదపడుతుందని పేర్కొన్నారు. హృదయంలో దివ్యత్వాన్ని వెలికితీసేందుకు హార్ట్ఫుల్‌నెస్ ధ్యానం ఉపకరిస్తుందని చెప్పారు. ముందుగా విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను అలరించాయి. కార్యక్రమంలో సీనియర్ పోలీసు అధికారి విసి సజ్జన్నార్ పాల్గొన్నారు.
సహజ యోగతో సంపూర్ణ ఆరోగ్యం
హైదరాబాద్: ఆత్మసాక్షాత్కారం కోసం సహజ యోగధ్యానం చాల సరళమైన విధానమని పలువురు వక్తలు పేర్కొన్నారు. అంతర్జాతీయ యోగ దినోత్సవాన్ని రవీంద్రభారతిలో నిర్వహించారు. తెలంగాణ ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి బుర్ర వెంకటేశం, తెలంగాణ రీజియ్ సహజ యోగ కోఆర్డినేటర్ బ్రహ్మచా మాట్లాడుతూ యోగతో ఏకాగ్రత పెరుగుతుందని అన్నారు. పాఠశాలలో యోగ నేర్పించేందుకు కేంద్ర ప్రభుత్వ నియమ నిబంధనలు విడుదల చేస్తోందని పేర్కొన్నారు. యోగతో ఆరోగ్యవంతమై జీవితంతోపాటు దుర్వాసనలకు దూరంగా ఉండవచ్చని చెప్పారు. యోగతో అశాంతి, కలతలు లేకుండా సంతోషంగా ఉండవచ్చని డ్రగ్స్ కంట్రోల్ సంయుక్త సంచాలకుడు సుబ్బిరెడ్డి అన్నారు.
పాఠశాలలో యోగ విద్యను ప్రవేశపెట్టాలి
ఉప్పల్: పాఠశాలలో యోగ విద్యను తప్పని సరిగా ప్రవేశపెట్టాలని మధుర చారిటబుల్ ట్రస్టు చైర్మన్ రాగిడి లక్ష్మారెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. అంతర్జాతీయ యోగ దినోత్సవం సందర్భంగా మంగళవారం రామంతాపూర్ లక్ష్మినారాయణకాలనీలోని ప్రభుత్వ పాఠశాల ఆవరణలో విద్యార్థులతో కలిసి యోగ ఆసనాలను చేశారు. యోగ సాంప్రదాయక విద్యగా శాస్ర్తియ శక్తిగా తీర్చిదిద్ది యోగాసనాల పట్ల ప్రజల్లో అవగాహన కల్పించి దీర్ఘకాలిక వ్యాధులను తరిమి కొట్టాలని పేర్కొన్నారు. ఆరోగ్యానికి, ఆత్మసౌందర్యానికి, ఆద్యాత్నిక సాధనకు యోగ ఎంతో దోహదపడుతుందన్నారు. యోగ మాస్టర్ బొడ్డు రవీందర్, ట్రుస్టు సభ్యులు నర్సింహారెడ్డి, ఆషు, సమ్మద్, మల్లేష్, సంజయ్, కరుణాకర్‌రెడ్డి, ఎండి రఫిక్ పాల్గొన్నారు.
ఉప్పల్ ప్రభుత్వ హైస్కూల్, లిటిల్ ఫ్లవర్ హైస్కూల్, ప్రశాంతినగర్ కాలనీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో యోగ వేడుకలను నిర్వహించారు. శారీరక, మానసిక రుగ్మతలను అధిగమించేందుకు యోగ ఎంతో ఉపయోగపడుతుందని లిటిల్ ఫ్లవర్ స్కూల్ ప్రిన్సిపాల్ జార్జి జోసఫ్ అన్నారు. యోగ గురువు రవీందర్ ఆధ్వర్యంలో విద్యార్థులు సూర్య నమస్కారాలు, ఆసనాల విన్యాసాలను ప్రదర్శంచారు.
ఘట్‌కేసర్‌లో..
ఘట్‌కేసర్: ప్రపంచ యోగ దినోత్సవాన్ని ఘట్‌కేసర్ మండలంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. ప్రాధమిక పాఠశాలల నుంచి ఇంజనీరింగ్ కళాశాలలు, ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులు, యువకులు, మహిళలు, ప్రజలు అంతర్జాతీయ యోగ డే ను ఘనంగా నిర్వహించారు. ఉదయం ఆరు గంటల నుండే యోగా ను ప్రారంభించారు. ఘట్‌కేసర్ మండల కేంద్రంతో పాటు సంస్కృతి టౌన్‌షిప్, ఎన్‌ఎఫ్‌సినగర్, అంకుషాపూర్, అవుషాపూర్, కొండాపూర్, చౌదరిగూడ, కొర్రెముల, ఘనపూర్, అన్నోజిగూడ, ఏదులాబాద్ గ్రామాలతో పాటు నల్ల నర్సింహ్మరెడ్డి ఇంజనీరింగ్ కళాశాల, విజ్ఞాన జ్యోతి మహిళా ఇంజనీరింగ్ కళాశాల, విజ్ఞాన్ హైస్కూల్, ఎన్‌ఎఫ్‌సినగర్‌లోని కేంధ్రీయ విద్యాలయం, ఏదులాబాద్ పుడమి పాఠశాల. మండల కేంద్రంలోని జడ్పీ బాల, బాలికల ఉన్నత పాఠశాలలలో యోగ డే ను ఘనంగా నిర్వహించారు. ఆరోగ్యమే మహాభాగ్యమని, సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండేందుకు ప్రతి నిత్యం యోగ చేయాలని పలువురు నేతలు పిలుపునిచ్చారు.
యోగతోనే మానసిక ప్రశాంతత
కుషాయిగూడ: యోగతోనే మానసిక ప్రశాంతత దొరుకుతుందని చర్లపల్లి జైలు సూపరింటెండెంట్ కొలను వెంకటేశ్వర్‌రెడ్డి అన్నారు. ప్రపంచా యోగ దినోత్సవం పూరస్కరించుకొని చర్లపల్లి కేంద్ర కారాగారంలోని ఖైదీలకు యోగను నేర్పించారు. యోగతో నిత్య యవ్వన శరీర సౌందర్యంతో మానసిక ఉల్లాసం కలుగుతుందని తెలిపారు. ఎఎస్‌రావునగర్ డివిజన్‌లో కార్పొరేటర్ పావనిరెడ్డి అధ్వర్యంలో ప్రపంచ యోగ దినోత్సవం సందర్భాంగా ప్రభుత్వ పాఠశాలలో విద్యార్ధులతో యోగ చేయించారు. కార్యక్రమంలో కార్పొరేటర్ గోల్లూరి అంజయ్య, మాజి కార్పొరేటర్ కోత్త రామారావు, టిఆర్‌ఎస్ నాయకులు మణిపాల్‌రెడ్డి పాల్గొన్నారు.
నిత్య యోగతో సంపూర్ణ ఆరోగ్యం
కెపిహెచ్‌బికాలనీ: నిత్యం యోగాభ్యాసంతో సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందవచ్చని అక్షర పాఠశాల డైరెక్టర్ మధన్‌మోహన్‌రావు అన్నారు. మంగళవారం అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని అక్షర పాఠశాల ఆవరణలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. విద్యార్ధులకు యోగ పట్ల అవగాహన కల్పిస్తూ విద్యార్ధులచే యోగాసనాలను వేయించారు. పాఠశాల డైరెక్టర్ మధన్‌మోహన్‌రావు మాట్లాడుతూ యోగం, రాజయోగ ద్యానం, యోగాభ్యాసాల ప్రదర్శన ఆయా ఆసనాలలో కలిగే ఫలితాలను విద్యార్ధులకు వివరించారు. కార్యక్రమంలో పాఠశాల అసోసియేట్ డైరెక్టర్ రఘుకుమారి, ప్రిన్సిపాల్ జానకి, ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.
బాలాజీనగర్‌లో..
అంతర్జాతీయ యోగ దినోత్సవం సందర్భంగా బాలాజీనగర్ డివిజన్ పరిధిలోని రావూస్ హైస్కూల్‌లో పిరమిడ్ ద్యాన కేంద్రం సౌజన్యంతో ధ్యాన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి బాలాజీనగర్ డివిజన్ కార్పోరేటర్ పన్నాల కావ్యా హరీష్‌రెడ్డి ముఖ్య అతిధిగా హాజరై యోగాపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో పిరమిడ్ ధ్యాన కేంద్రం సభ్యులు రమాదేవి, లక్ష్మి, శ్రీనాధ్, సుదీర్, గంగ, రాజేశ్వరి, శ్రీనివాసులు, వెంకటేష్, రవీంద్రరెడ్డి, ప్రభాకర్, శేఖర్‌రెడ్డి, రఘునాధ్‌రెడ్డి, సంధ్య, తుల్జారాం పాల్గొన్నారు.
కెపిహెచ్‌బికాలనీలో..
కెపిహెచ్‌బికాలనీ 9వ ఫేజ్‌లో పార్క్‌లో యోగ దినోత్సవ వేడుకలను టిఆర్‌ఎస్ నాయకులు జనగాం సురేష్‌రెడ్డి, లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో నిర్వహించారు. కార్యక్రమానికి కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, కెపిహెచ్‌బికాలనీ డివిజన్ కార్పొరేటర్ మందడి శ్రీనివాస్‌రావు ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. యోగ చేయడం వల్ల మానసిక దృడత్వంతో పాటు మానసిక ప్రశాంతత లభిస్తుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు నారాయణరాజు, వేణుగోపాల్, సత్యనారాయణ, నాని, శ్రీను పాల్గొన్నారు.
యోగ దినోత్సవ వేడుకలు
వనస్థలిపురం: అంతర్జాతీయ యోగ దినోత్సవం సందర్భంగా ఎల్‌బినగర్ నియోజకవర్గంలో పలు ప్రాంతాల్లో వేడుకలను నిర్వహించారు. మన్సురాబాద్ నాగార్జున మాంటిస్సోరీ, ఐఐటి కానె్సప్ట్, ఒలింపియాడ్ స్కూల్‌లో యోగ ఆసనాలు నిర్వహించారు. మానసిక ఒత్తిడిని తగ్గించుకొని ప్రశాంత జీవనం అలవాటు చేసుకోవడానికి యోగ ఉపయోగపడుతుందని విద్యా సంస్థల చైర్మన్ జి.విఠల్‌రెడ్డి అన్నారు. కార్యక్రమంలో వైస్‌చైర్మన్ రాజని, జి.కార్తికేయరెడ్డి, డైరెక్టర్లు ఆనంద్‌కుమార్, ప్రిన్సిపాల్ బిసి స్వర్ణకుమారి పాల్గొన్నారు.
హుడా పార్కులో..
వనస్థలిపురం రైతుబజార్ వెనుక ఉన్న హుడా పార్కులో పతాంజలి యోగ కేంద్రం ప్రధాన కార్యదర్శి గంధం శివశంకర్ ఆధ్వర్యంలో ఉచిత యోగ శిక్షణ కేంద్రాన్ని నిర్వహించారు. ఎల్‌బినగర్ నియోజకవర్గ టిఆర్‌ఎస్ ఇన్‌చార్జి రాంమోహన్‌గౌడ్, కార్పొరేటర్లు జిట్టా రాజశేఖర్‌రెడ్డి, లక్ష్మీప్రసన్న, సామ తిరుమల్‌రెడ్డి, యోగ గురువు శ్రీనివాసరావు, యోగ కేంద్రం అధ్యక్షుడు యాదయ్య గౌడ్, బిక్షపతి, ప్రమీల పాల్గొన్నారు.
రాజేంద్రనగర్‌లో..
రాజేంద్రనగర్: యోగతోనే సంపూర్ణ ఆరోగ్యం సాధ్యపడుతుందని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే టి.ప్రకాష్‌గౌడ్ అన్నారు. అంతర్జాతీయ యోగ దినోత్సవాన్ని పురస్కరించుకొని దుర్గానగర్‌లోని మినీ స్టేడియంలో యోగ ఆసనాలు నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ యోగ ఆసనాలతో మనోస్థైర్యం పెరుగడంతో పాటు మానసిక ప్రశాంతత లభిస్తుందని అన్నారు. ప్రతి రోజు యోగా చేయడం దినచర్యగా పెట్టుకోవాలని, అప్పుడే సంపూర్ణ ఆరోగ్యం సాధ్యపడుతుందని చెప్పారు. శారీరక, మానసిక, రుగ్మతలు యోగాతో దూరమవుతాయని తెలిపారు. మైలార్‌దేవ్‌పల్లి డివిజన్ కార్పొరేటర్ తోకల శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ యోగ సాధనతో శరీరం, మనస్సు, బుద్ధి వృద్ధి చెందుతాయని అన్నారు. ముందుగా యోగ సాధకులతో కలిసి ఆసనాలు చేశారు.
ఎఎస్‌రావునగర్‌లో..
ఉప్పల్: డాక్టర్ ఏఎస్‌రావునగర్‌లోని విజయా ఉన్నత పాఠశాలలో మంగళవారం అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలను నిర్వహించారు. విద్యార్థులు పాద హస్తాసనం, త్రికోణాంగాసనం, అర్ధచక్రాసనం, యోగాసనాలను ప్రదర్శించి అందర్ని ఆకట్టుకున్నారు. పాఠశాల కరాస్పండెంట్ రాజేశ్వర్‌రావు, పాఠశాల ఆర్గనైజర్ వీణ, వెంగబాబు, కళ్యాణి పేర్కొన్నారు.