హైదరాబాద్

‘నల్ల’కుంటలో కాలాపానీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముషీరాబాద్, జూన్ 22: పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా విస్తరించని మంచినీటి పైప్‌లైన్‌ల సామర్థ్యానికి తోడు కాలం చెల్లిన పైప్‌లైన్‌ల వ్యవస్థతో కలుషిత నీటి సరఫరా నగరవాసులను కాటు వేస్తోంది. నగరంలో ఎక్కడో ఒక చోటు కలషిత మంచినీటి ఉదంతాలు వెలుగు చూస్తూనే ఉన్నాయి. నగరం నడిబొడ్డున భోలక్‌పూర్‌లో కలుషిత నీరు తాగి 14 మంది మృత్యవాత పడి దాదాపు వందలాద మంది తీవ్ర అస్వస్థత గురైనా ప్రభుత్వ యంత్రాంగం కళ్ల తెరవటం లేదు. ఏదైనా సంఘటన జరిగినప్పడు మాత్రమై ఆఘమేఘాల మీద స్పందించటం, తర్వాత షరామామూలే అన్న చందంగా మారింది. తాజాగా నల్లకుంటలో కలుషిత నీటి సరఫరాతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. కొద్ది రోజులుగా తంతు కొనసాగుతున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యారు. నల్లకుంట డివిజన్‌లోని డాక్టర్ చారి లేన్ పరిసర ప్రాంతాలలో దాదాపు పది రోజులుగా కలుషిత నీరు తాగి ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారు. బుధవారం జలమండలి అధికారిని బస్తీకి పిలిపించిన ప్రజలు కలుషిత నీటిని చూపించి ఆగ్రహం వ్యక్తం చేశారు. డాక్టర్ చారి లేనే, పరిసర ప్రాంతాలలో దాదాపు 150 కుటుంబాలు కలుషిత నీటి భారిన పడి సమస్యలు ఎదుర్కుంటున్నారు. గత కొన్నిరోజులుగా నల్లాలలోంచి దుర్గంధంతో కూడిన మురుగు నీరు సరఫరా అవుతున్నాయని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. డ్రైనేజీ, మంచినీరు పైప్‌లైన్‌లు కలువటం వల్లే సమస్య ఉత్పన్నమవుతుందని స్థానికులు వాపోతున్నారు అయినా సంబంధిత అధికారులు పైప్‌లైన్‌లు మార్చటంలో మీనమేషాలు లెక్కిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కనీసం లీకేజీని గుర్తించి తాత్కాలికంగానైనా సమస్యను పరిష్కరించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే మురుగునీరు తాగిన చిన్నారులు, వృద్ధులు అనారోగ్యం పాలయ్యారని తెలిపారు. ఫలితంగా మంచినీటిని కొనుక్కోవాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రతి ఇంటికి మంచినీరు అందిస్తామని చెబుతున్నా వాస్తవ పరిస్థితి విరుద్ధంగా ఉందని, సమస్య పరిష్కరించకానికి యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేస్తున్నారు.