హైదరాబాద్

అత్యవసర బృందాలు రె‘్ఢ’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 23: వర్షాకాలం కష్టాలను ఎదుర్కొనేందుకు గ్రేటర్‌లో జిహెచ్‌ఎంసి అత్యసర బృందాలు సిద్దమయ్యాయి. ఈ సారి సాధారణం కన్నా అత్యధిక మోతాదులో వర్షం కురిసే అవకాశముందంటూ కేంద్ర వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేయటంతో అప్రమత్తమైన జిహెచ్‌ఎంసి వర్షంతో ఎదురయ్యే కష్టాలను నివారించేందుకు, విపత్కర పరిస్థితుల్లో ప్రాణ, ఆస్తి నష్టాలను తగ్గించేందుకు గాను మొత్తం 70 అత్యవసర బృందాలను సిద్ధం చేయగా, వీటిలో 30 ప్రత్యేక బృందాలున్నాయి. ప్రతి సంవత్సరం మాధిరిగా కాకుండా ఈ సారి జిహెచ్‌ఎంసి అధికారులు టౌన్‌ప్లానింగ్, బయోడెవర్శిటీ విభాగాలకు చెందిన ఎమర్జెన్సీ బృందాలను కూడా ఏర్పాటు చేశారు.
ఈ మేరకు గురువారం మేయర్ బొంతు రామ్మోహన్ ప్రధాన కార్యాలయంలో జెండా ఊపి ప్రారంభించారు. మొత్తం 39 బృందాల్లో ఏడు బృందాలు సర్కిల్ స్థాయి బృందాలుండగా, మరో ఏడు టౌన్‌ప్లానింగ్ బృందాలున్నాయి. మరో ఏడు బయోడైవర్శిటీ విభాగానికి చెందిన అత్యవసర బృందాలున్నాయి. ఇక మిగిలిన వాటిలో అప్పటికపుడే వర్షంతో రోడ్లపై ఏర్పడే గుంతలకు మరమ్మతులు చేసేందుకు ప్రత్యేక బృందాలు, సెంట్రల్ ఎమర్జెన్సీ అత్యవసర బృందాలతో కలిపి మొత్తం 70 బృందాలు క్షేత్ర స్థాయి సహాయక చర్యలకు సిద్దమయ్యాయని చెప్పవచ్చు. ఈ సారి వర్షాలు కాస్త ఎక్కువగా కురిసే అవకాశమున్నాయన్న హెచ్చరికల నేపథ్యంలో అత్యవసర బృందాల ఏర్పాటు, అందులోని కార్మికులకు కావల్సిన పనిముట్లు, సామాగ్రిని సమకూర్చేందుకు జిహెచ్‌ఎంసి సుమారు రూ. 14 కోట్లను వెచ్చించినట్లు మేయర్ బొంతు రామ్మోహన్ వెల్లడించారు. ఇప్పటి వరకు వెచ్చించిన ఈ రూ. 12 కోట్లతో పాటు వేరుగా మరో రూ. 2 కోట్లను వెచ్చించినట్లు తెలిపారు. ఇందులో రూ. 1.10 కోట్ల విలువైన పనిముట్లు, యంత్రాలను నగర పోలీసు శాఖకు, రూ. 90లక్షల విలువైన యంత్రాలు పరికరాలను సైబరాబాద్ పోలీసులకు అందించినట్లు మేయర్ తెలిపారు.