హైదరాబాద్

సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ విభజన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 23: సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్‌ను విభజిస్తూ తెలంగాణ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇక నుంచి సైబరాబాద్ ఈస్ట్, సైబరాబాద్ వెస్ట్ పోలీస్ కమిషనరేట్‌గా కొనసాగనున్నాయి. జనాభా పెరుగుదల, నేరాల విస్తృతి కారణంగా సైబరాబాద్ కమిషనరేట్ పరిధి పెంచుతూ, రెండుగా విభజించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రంగారెడ్డి, సైబరాబాద్, నల్గొండ, మెదక్, మహబూబ్‌నగర్ జిల్లాల్లోని పలు ప్రాంతాలను సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోకి వస్తాయి. అలాగే డిజిపి అనురాగ్ శర్మ విజ్ఞప్తి మేరకు సైబరాబాద్ కమిషనరేట్‌కు ప్రభుత్వం అదనపు సిబ్బందిని మంజూరు చేసింది. 346 పోలీస్, 135 మినిస్ట్రియల్ స్ట్ఫా, 2000 హోంగార్డ్స్, 41 ఔట్ సోర్సింగ్ పోస్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జోన్‌ల వివరాలు ఇలా ఉన్నాయ.
* సైబరాబాద్ కమిషనరేట్ ఈస్ట్‌లోని జోన్స్: భువనగిరి, మల్కాజ్‌గిరి, ఎల్‌బినగర్.
* డివిజన్లు: భువనగిరి, చౌటుప్పల్, మల్కాజ్‌గిరి, కుషాయిగూడ, వనస్థలిపురం, ఎల్‌బి నగర్, ఇబ్రహింపట్నం.
* సిసిఎస్‌లు: భువనగిరి, మల్కాజ్‌గిరి, ఎల్‌బి నగర్
* మహిళా పోలీస్ స్టేషన్: సరూర్‌నగర్
సైబరాబాద్ కమిషనరేట్ వెస్ట్‌లోని జోన్లు: బాలానగర్, మాదాపూర్, శంషాబాద్
* డివిజన్లు: బాలానగర్, పహాడిషరీఫ్, మాదాపూర్, కూకట్‌పల్లి, మియాపూర్, శంషాబాద్, రాజేంద్రనగర్, షాద్‌నగర్
* సిసిఎస్‌లు: బాలానగర్, మాదాపూర్, శంషాబాద్
* మహిళా పోలీస్ స్టేషన్: ఐటి కారిడార్