హైదరాబాద్

సర్కిళ్ల స్థాయిలో సమన్వయ భేటీలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 28: మహానగర వాసుల జీవితంతో ముడిపడి ఉన్న వివిధ ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయాన్ని పెంపొందించేందుకు ఇకపై సర్కిళ్ల స్థాయిల్లో కూడా సమన్వయ సమావేశాలను నిర్వహించాలని సమన్వయ సమావేశంలో వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన అధికారులు నిర్ణయించారు. ప్రతి నెల మాదిరిగా ఈసారి సమన్వయ సమావేశం మంగళవారం మెట్రోరైలు కార్యాలయంలో జరిగింది. జిహెచ్‌ఎంసి చేపడుతున్న ఎస్‌ఆర్‌డిపి, రోడ్డు నిర్మాణ పనులు, వర్షాకాలం అత్యవసర పనులపై మేయర్ బొంతు రామ్మోహన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో మేయర్ మాట్లాడుతూ ప్రతి నెల ఉన్నతాధికారులతో జరుగుతున్న ఈ సమావేశాల మాదిరిగానే ఇకపై సర్కిల్ స్థాయిలో కూడా సంబంధిత అధికారుల సమన్వయ సమావేశాలు నిర్వహించాలని, ఈ సమావేశాలకు ఓ పర్యవేక్షక అధికారులుగా ఒక్కో సర్కిల్‌కు ఒక సీనియర్ అధికారి హాజరవుతారని మేయర్ తెలిపారు.
హైదరాబాద్ నగరంలో వివిధ విభాగాలు, కేబుల్ సంస్థలచే 772 కిలోమీటర్ల మేర రోడ్డు తవ్వకాలు పూర్తి కాగా, వీటిలో 746 కిలోమీటర్ల రోడ్ల పునరుద్ధరణ జరిగిందని తెలిపారు. అయితే రోడ్ల నిర్మాణంతో పాటు రోడ్ల తవ్వకాలు ఇతర పనులను చేపట్టే కాంట్రాక్టర్లపై నియంత్రణ, పర్యవేక్షణ లోపించటంతో ఈ పనులు సకాలంలో పూర్తిగాక జిహెచ్‌ఎంసి తీవ్ర విమర్శలను ఎదుర్కొంటుందని మేయర్ తెలిపారు. హైదరాబాద్ నగరంలో దాదాపు రూ. 3 కోట్ల 68 లక్షల రూపాయల వ్యయంతో తవ్విన రోడ్డు పునరుద్దరణ పనుల చేపట్టగా వీటిలో 65 శాతం పనులు పూర్తయ్యాయని ఇంజనీర్లు వివరించారు.
మినిష్టర్ రోడ్డులో 132 కెవి లైన్ అండర్‌గ్రౌండ్ పనులకు 1.68 కిలోమీటర్ల మేర రోడ్డు తవ్వకానికి తెలంగాణ ట్రాన్స్‌కో అనుమతులు ఇవ్వగా, పనులు జరుగుతున్నాయని వివరించారు శ్రీనగర్‌కాలనీలో కూడా 220 కెవి విద్యుత్ లైన్‌ను వేయటానికి 1.90 కిలోమీటర్ల రోడ్డు తవ్వకాలకు టిఎస్‌ఎస్‌పిడిసిఎల్‌కు అనుమతి ఇవ్వగా, పనులు పూర్తికావస్తున్నట్లు తెలిపారు. ఉషాముల్లపూడి మార్గంలో 4.65 కిలోమీటర్ల రోడ్డులో గోదావరి జలాల పైప్‌లైన్ నిర్మాణానికి జలమండలి రోడ్లు, భవనాల శాఖ రోడ్డు తవ్వకానికి అనుమతులు ఇవ్వగా, ఈ పనులు జిహెచ్‌ఎంసికి బదలాయించటం జరిగిందని, ఇప్పటి వరకు 65 శాతం రోడ్డు పునరుద్దరణ పనులు పూర్తయ్యాయని తెలిపారు. సమావేశం అనంతరం మేయర్, జిహెచ్‌ఎంసి కమిషనర్ జనార్దన్ రెడ్డి, మెట్రోరైలు ఎండి డా.ఎన్వీఎస్‌రెడ్డి, అదనపు కమిషనర్(ట్రాఫిక్) జితేంధ్ర, జలమండలి ఎండి దానాకిషోర్‌లతో కూడిన బృందం నగరంలో వర్షం వల్ల నీరు నిలిచిన ప్రాంతాలను సందర్శించింది. మాసాబ్‌ట్యాంక్,సరోజినిదేవి కంటి ఆసుపత్రి, మెహిదీపట్నం, టోలీచౌకీ, షేక్‌పేట, ఫిల్మ్‌నగర్, మాదాపూర్ మార్గాల్లో రోడ్లను తనిఖీ చేశారు.
ప్రతి పని వద్ద బారికేడ్లు
జిహెచ్‌ఎంసి పరిధిలో జరిగే ప్రతి ఇంజనీరింగ్ పనుల వద్ద ఆయా పనులు, నిర్మాణం పూర్తి చేసే కాలం, కాంట్రాక్టర్ పేరు, సెల్‌నెంబర్లు తెలియజేసే వివరాలతో సమాచార బోర్డులను విధిగా ఏర్పాటు చేయాలని సమావేశంలో మరోసారి నిర్ణయించారు. పనులు జరిగే ప్రాంతం చుట్టూ హెచ్చరికలు తెలియజేసే హద్దులను ఏర్పాటు చేయాలని, ఈ విషయంలో నిబంధనలు పాటించని కాంట్రాక్టర్లపై తగు చర్యలు చేపట్టాలని నిర్ణయించారు. నగరంలో రోడ్ల నిర్వాహణను ఒకే సంస్థకు అప్పగించటంపై పూర్తి స్థాయి నివేదికను రూపొందించటానికి కన్సల్టెన్సీలను ఎంపిక చేయాలని మేయర్ పేర్కొన్నారు.