హైదరాబాద్

తక్షణమే న్యాయవాదులకు న్యాయం చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సికింద్రాబాద్, జూన్, 30: ముఖ్యమంత్రి కెసిఆర్ ముచ్చట్లు చెప్పుకుంటూ దావత్‌లతో గడపకుండా విషమిస్తున్న హైకోర్టు వివాధాన్ని తక్షణమే పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని టిడిపి నేతలు కోరారు. టిడిపి నగర నాయకులు ఎంఎన్ శ్రీనివాస్, మేకల సారంగపాణి, నల్లెల కిశోర్ మాట్లాడుతూ న్యాయవాదులు, న్యాయమూర్తుల ఆందోళనలతో రాష్ట్రం రగిలిపోతుంటే గవర్నర్ ప్రేక్షకపాత్ర పోషించడం తగదని చెప్పారు. పునర్‌విభజన చట్టంలో ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్‌గా నర్సింహన్‌కు విశేష అధికారాలున్నా నిశ్శబ్దం పాటిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తరుచూ కెసిఆర్, ఆయన కుమారుడు కెటిఆర్‌తో సమావేశమవుతున్న గవర్నర్ రాష్ట్రంలోని అతి ప్రధానమైన సమస్య గురించి ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. కేంద్ర మంత్రి సదానందగౌడ మాటలు సుద్ద అబద్దాలని పేర్కొన్నారు. హైకోర్టు విభజన సమస్య పూర్తిగా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన అంశమని, దీనిలో చంద్రబాబు నాయుడికి ఎలాంటి సంబంధం లేనప్పటికీ వాస్తవాలను ప్రక్కనపెట్టి తెలంగాణలో తెలుగుదేశం పార్టీని ఇరుకునపెట్టే విధంగా కేంద్ర మంత్రి మాట్లాడడం తగదని హితవుపలికారు. విభజన చట్టం ప్రకారం ఏపిలో హైకోర్టు ఏర్పాటుకు అవసరమైన నిధులు సదుపాయాలు కేంద్రమే సమకూర్చాల్సి ఉందని, ఏపిలో హైకోర్టు ఏర్పాటుకు సహకరించడానికి సిద్ధంగా ఉన్నామని చంద్రబాబుకు ఇప్పటికే కేంద్రానికి లేఖను రాశారని అన్నారు. ఈ విషయంలో కేంద్రమే నిర్ణయం తీసుకోకుండా ఇతరులపై నెట్టడం సరికాదని అన్నారు. తక్షణమే ఇరు రాష్ట్రాల సిఎంలను కూర్చోబెట్టి సమస్య పరిష్కారానికి కేంద్రం నడుం బిగించాల్సిన అవసరం ఉందని అన్నారు. తమ న్యాయమైన డిమాండ్‌ల కోసం ఉద్యమిస్తున్న న్యాయవాదులకు తెలుగుదేశం పార్టీ పూర్తి మద్దతు సహకారం అందిస్తుందని పేర్కొన్నారు. కేవలం హైకోర్టు మాత్రమే కాకుండా విభజన చట్టంలో పేర్కొన్న అంశాలన్నింటిని తక్షణమే కేంద్ర ప్రభుత్వం అమలు చేయాలని అన్నారు. కార్యక్రమంలో కూన వెంకటేశ్‌గౌడ్, భజరంగ్ శర్మ పాల్గొన్నారు.