హైదరాబాద్

భువనగిరి కేంద్రంగా సైబరాబాద్ ఈస్ట్ కమిషనరేట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ, జూలై 1: నల్లగొండ జిల్లా భువనగిరి పోలీస్ సబ్ డివిజన్ పరిధిలోని భువనగిరి టౌన్, రూరల్, బీబీనగర్, పోచంపోల్లి, బొమ్మలరామారం, వలిగొండ, చౌటుప్పల్ టౌన్ పోలీస్ స్టేషన్లతో కూడిన సైబరాబాద్ ఈస్ట్ కమిషనరేట్ కార్యాలయం పనులు శుక్రవారం నుండి భువనగిరి కేంద్రంగా అధికారికంగా ప్రారంభమైనట్లుగా జిల్లా ఎస్పీ ఎన్.ప్రకాశ్‌రెడ్డి తెలిపారు. ఇప్పటిదాకా భువనగిరి డిఎస్పీ కార్యాలయం కొనసాగిన భవనంలో సైబరాబాద్ ఈస్ట్ కమిషనరేట్ కార్యాలయం పనిచేస్తుందని అన్నారు. భువనగిరి డిఎస్పీ కార్యాలయాన్ని యాదగిరిగుట్టకు మార్చామని తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు భువనగిరి సబ్ డివిజన్ పరిధిలో మిగిలిన 10పోలీస్ స్టేషన్లు యాదగిరిగుట్ట, ఆలేరు, తుర్కపల్లి, రాజాపేట, ఆత్మకూర్(ఎం), గుండాల, మోత్కూర్, చిట్యాల, రామన్నపేట, సంస్థాన్ నారయణపూర్ పోలీస్ స్టేషన్లతో కొత్తగా యాదగిరిగుట్ట పోలీస్ సబ్ డివిజన్‌గా ఏర్పాటవుతుందని పేర్కొన్నారు. యాదగిరిగుట్ట సర్కిల్‌ను యధావిధిగా కొనసాగిస్తు కొత్తగా చిట్యాల, మోత్కూర్‌ను సర్కిల్ ఇన్‌స్పెక్టర్ కేంద్రాలు ఏర్పాటు చేయడం కోసం ప్రభుత్వానికి నివేదిక అందించామని తెలిపారు.