హైదరాబాద్

న్యాయవాదుల ‘చలో హైదరాబాద్’తోఉద్రిక్తత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముషీరాబాద్, జూలై 1: ప్రత్యేక హైకోర్టు సాధన.. న్యాయమూర్తుల ఆప్షన్ల రద్దు.. డిమాండ్ చేస్తూ శుక్రవారం ఇందిరాపార్కు వద్ద నిర్వహించిన మహాధర్నాకు తెలంగాణ వ్యాప్తంగా వేలాదిగా న్యాయవాదులు తరలివచ్చారు. విభిన్న రాజకీయ పార్టీల ఆందోళనలు.. ప్రజా సంఘాల నిరసనలతో నిత్యం రంగు..రంగులు సంతరించుకునే ఇందిరాపార్కు పరిసరాలు శుక్రవారం జరిగిన న్యాయవాదుల మహాధర్నాలో వేలాది మంది న్యాయవాదులు ధరించిన తెల్ల షర్టులు..నల్లకోట్లతో ‘బ్లాక్ అండ్ వైట్’ గామారింది. తెలంగాణ అడ్వకేట్స్ జెఏసి పిలుపుమేరకు జరిగిన ధర్నా భారీ పోలీసు బందోబస్తు.. అడుగడుగునా నిఘా, ఉద్వేగ బరిత వాతావరణం మద్య జరిగింది. రాజకీయ పక్షాలు..ప్రజాసంఘాల ప్రతినిధులు హాజరై సంఘీబావం తెలిపి ప్రసంగించారు. రాజకీయ జెఏసి చైర్మన్ ప్రొ.కోదండరాం, టిపిసిసి నాయకుడు ఉత్తంకుమార్‌రెడ్డి, దుద్దిళ్ల శ్రీ్ధర్‌బాబు, టిఆర్‌ఎస్ ఎంపి బూర నర్సయ్యగౌడ్, ఎమ్మెల్యేలు వి.శ్రీనివాస్‌గౌడ్, గువ్వల బాలరాజు, సిపిఐ నేత చాడా వెంకట్‌రెడ్డి, జస్టిస్ బి.చంద్రకుమార్, ఆయా న్యాయవాదుల సంఘాల నాయకులు హాజరై ప్రసంగించారు. న్యాయవాదుల డిమాండ్లు న్యాయమైనవనీ..ప్రత్యేక హైకోర్టు విభజన జరిగే వరకు న్యాయవాదులకు అండగా ఉంటామని ప్రతీన బూనారు. న్యాయవాదులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, హైకోర్టు సిజెకి వ్యతిరేకంగా పెద్దపెట్టున నినాదాలు చేశారు. మహిళా న్యాయవాదులు సైతం తమ ఆటాపాటలు.. డప్పు చప్పుళ్లతో నిరసన వ్యక్తం చేశారు. ఆయా జిల్లాలు.. వివిధ బార్ అసోసియేషన్‌ల నుండి తరలి వచ్చిన న్యాయవాదులు ఎవరికి వారు బాజాభజంత్రీలతో..ర్యాలీగా నినాదాలు చేస్తూ వచ్చి దీక్షా శిబిరంలో చేరారు. వేలాదిగా న్యాయవాదులు తరలి రావటంతో ఇందిరాపార్కు, ఆర్టీసీ క్రాస్‌రోడ్డు పరిసరాలు జనసంద్రమయ్యాయి. మధ్యాహ్నం ఒంటి గంట నుంచి దాదాపు మూడు వరకు స్వల్పంగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. వందల సంఖ్యలో బస్సులు, కార్లు, క్యాబ్‌లు రావటంతో ఎన్టీఆర్ స్టేడియంలో పార్కింగ్ సౌకర్యం ఏర్పాటు చేశారు. అదే స్టేడియంలో భోజన ఏర్పాట్లు చేశారు. సెంట్రల్ జోన్ డిసిపి విబి కమల్‌హాసన్ రెడ్డి కార్యక్రమం ముగిసే వరకు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించారు. చిక్కడపల్లి ఎసిపి జోగుల నర్సయ్య, ముషీరాబాద్, చిక్కడపల్లి, గాంధీనగర్, పోలీస్‌స్టేషన్‌లతో పాటు అదనపు పోలీసు బలగాలు, నిఘా వర్గాలను, స్పెషల్ పోలీసులను భారీగా మోహరించారు.