హైదరాబాద్

మూడు నెలల్లో రూ. 340 కోట్ల ఆస్తిపన్ను వసూలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 1: జంటనగర ప్రజలకు పౌరసేవలు, అవసరాలకు తగిన విధంగా అభివృద్ధి పనులు చేపట్టే మహానగర పాలక సంస్థ ప్రధాన ఆర్థిక వనరైన ఆస్తిపన్ను వసూళ్లపై ఈ ఏటా కాస్త ముందుగానే దృష్టి సారించిన సంగతి తెలిసిందే! గడిచిన రెండేళ్ల నుంచి ఆర్థిక సంవత్సరం ప్రారంభం కాగానే ఎర్లిబర్డ్ స్కీంను అమలు చేస్తూ చెల్లించాల్సిన పనుల్లో బకాయిదారులకు రాయితీ ఇవ్వటం, సక్రమంగా, సకాలంలో పన్ను మొత్తం చెల్లించే వారిలో విజేతలను ఎంపిక చేసి తొలుత రూ.లక్ష, ఆ తర్వాత వారిని రూ. 3లక్షలు చొప్పున ప్రకటిస్తున్న నగదు బహుమతులు సత్ఫలితాలిస్తున్నట్లు అధికారులు తెలిపారు. వర్థమాన ఆర్థిక సంవత్సరంలో గడిచిన మూడు నెలల్లో ఆస్తిపన్ను రూ. 115 కోట్ల వరకు వసూలైనట్లు అధికారులు తెలిపారు. అయితే గత ఆర్థిక సంవత్సరం జూన్ నెలాఖరు వరకు అయిన కలెక్షన్‌తో పోలిస్తే సుమారు రూ 225 కోట్ల వరకు వసూలు కాగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూన్ నెలాఖరు వరకు రూ. 340 కోట్ల మేరకు పన్ను వసూలైనట్లు అధికారులు తెలిపారు. అంటే గత సంవత్సరం కన్నా దాదాపు 51.11 శాతం కలెక్షన్ వృద్ధి చెందినట్లు వెల్లడించారు. ఇందుకు జిహెచ్‌ఎంసి అధికారులు బకాయిదార్లను ఆకర్షితులను చేసేందుకు తొలుత అమలు చేసిన ఎర్లీబర్డ్ పథకం, అది ముగిసిన వెంటనే జూన్ మాసంలో ఆస్తిపన్ను చెల్లించే వారికి ప్రతి వారం రూ. 3లక్షల నగదు పురస్కారాలు అందజేసే ప్రక్రియ మంచి ఫలితాలనిచ్చిందని అధికారులు పేర్కొన్నారు. ముఖ్యంగా ఆన్‌లైన్ ద్వారా చెల్లించే వారి సంఖ్య ఈ ఏట గణనీయంగా పెరిగింది. కేవలం జూన్ 23వ తేదీ నుంచి 30వ తేదీ వరకు దాదాపు 13వేల 907 మంది ఆన్‌లైన్ ద్వారా రూ. 34.70 కోట్లను చెల్లించారు.
10లోపు ఆన్‌లైన్‌లో చెల్లించే వారికి బహుమతులు
జూలై 10వ తేదీ లోపు ఆన్‌లైన్ ద్వారా ఆస్తిపన్ను చెల్లించే బకాయిదార్లను ఎంపిక చేసి, వారికి కూడా నగదు బహుమతులను ప్రదానం చేయనున్నట్లు డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దిన్, అదనపు కమిషనర్ సురేంద్రమోహన్ తెలిపారు. జూన్ 23 నుంచి 30వ తేదీ వరకు పన్ను చెల్లించిన వారిలో శుక్రవారం విజేతలను ఎంపిక చేసి నగదు బహుమతులను ప్రకటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆన్‌లైన్ చెల్లింపును ప్రోత్సహించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ఆస్తిపన్నుతో పాటు ట్రేడ్‌లైసెన్సు ఫీజులను చెల్లించే వారికి కూడా రూ. 3లక్షల నగదు బహుమతులను అందించనున్నట్లు వారు ప్రకటించారు. జూలై మాసం ప్రారంభం నుంచి చెల్లించాల్సిన ఆస్తిపన్ను మొత్తంలో ప్రతి నెల 2 శాతం వడ్డీని వర్తింపజేయనున్నట్లు అధికారులు తెలిపారు.
రూ.లక్ష విజేత జంగిరెడ్డి
శుక్రవారం నిర్వహించిన డ్రాలో బంపర్ బహుమతిగా బల్దియా ప్రకటించిన రూ. లక్ష నగదును శేరిలింగంపల్లికి చెందిన డా.కనకాల జంగిరెడ్డికి దక్కింది. రూ. 25వేల మొదటి బహుమతిని ఎల్బీనగర్ సర్కిల్‌కు చెందిన కె.కోటేశ్వరమ్మకు, రూ. 12వేల 500 చొప్పున రెండు బహుమతులు కాప్రా సర్కిల్‌కు చెందిన చిల్లా వెంకటసుధాకర్, కూకట్‌పల్లి సర్కిల్‌కు చెందిన రవిబాబులను వరించాయి. అలాగే రూ. 5వేల చొప్పున 5 బహుమతులకు గాను శేరిలింగంపల్లికి చెందిన వి. బద్రినారాయణ, ఆబిడ్స్‌కు చెందిన రాజశేఖర్, శేరిలింగంపల్లి సర్కిల్‌కు చెందిన సయ్యద్ అబ్దుల్ వసీ, కాప్రా సర్కిల్‌కు చెందిన కాష్యప్, సికిందరాబాద్ సర్కిల్‌కు చెందిన శకుంతలబాయ్‌ల దక్కించుకున్నారు. రూ. 2వేల 500 చొప్పున పది మందికి, రూ. వెయ్యి చొప్పున వంద మందికి కన్సోలేషన్ బహుమతులను కూడా ప్రకటించారు.