హైదరాబాద్

బల్దియాలో కిస్సా కుర్సీకా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 2: మహానగర పాలక సంస్థలో ప్రస్తుతం కిస్సా కుర్సీకా జరుగుతోంది. ఒకవైపు ప్రస్తుతం పెరిగుతున్న జనాభా, రద్ధీకి అనుకూలంగా అభివృద్ధి పనులు చేపట్టేందుకు వీలుగా తగిన సంఖ్యలో ఇంజనీర్లు లేక పనుల్లో వెనకబడి పోతున్న జిహెచ్‌ఎంసికి కొద్దిరోజుల క్రితం ప్రభుత్వం 160 మంది ఇంజనీర్లను కేటాయించింది. ఇందులో ఇప్పటి వరకు 140 మంది అసిస్టెంటు ఇంజనీర్లు మేయర్, కమిషనర్ చేతుల మీదుగా నియామక పత్రాలను స్వీకరించారు. కానీ వారికి పోస్టింగ్‌లు ఇవ్వాలంటే ఇప్పటికే అసిస్టెంటు ఇంజనీర్ పోస్టుల్లో కొనసాగుతున్న ఎన్విరాన్‌మెంట్, పంచాయతీరాజ్, నీటిపారుదల శాఖకు చెందిన సుమారు ఇరవై మంది ఇంజనీర్లను గ్రేటర్ మాతృశాఖకు సరెండర్ చేయాల్సి ఉంది. ఇప్పటి వరకు గ్రేటర్‌లో ఇంజనీర్ల కొరత ఉన్నందున, ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇతర విభాగాలకు చెందిన ఇంజనీర్ల సేవలను వినియోగించుకున్నామని, ఇపుడు కావల్సిన స్థాయిలో ఇంజనీర్లను ప్రభుత్వం కేటాయించటంతో డిప్యూటేషన్లపై కొనసాగుతున్న ఇంజనీర్లు తమ మాతృశాఖకు వెళ్లాలని ఉన్నతాధికారులు సూచించారు. కానీ జిహెచ్‌ఎంసిని వదిలి వెళ్లేందుకు సుమారు ఇరవై మంది అసిస్టెంటు ఇంజనీర్లు, ఎగ్జిక్యూటీవ్ ఇంజనీర్లు సిద్దం లేరని తెలిసింది. కొత్తగా వచ్చిన వారికి ఎక్కడ పోస్టింగ్ ఇవ్వాలన్న విషయంపై ఉన్నతాధికారులు తలలు పట్టుకుంటున్నారు. ఇప్పటి వరకు అసిస్టెంటు ఇంజనీర్లుగా కొనసాగిన ఇతర శాఖలకు చెందిన వారిలో ఎక్కువ మంది అవినీతి ఆరోపణలెదుర్కొంటున్న వారు కూడా ఉన్నారు. జిహెచ్‌ఎంసి చేపట్టే ప్రతి పనికి సంబంధించి అంచనాలు తయారు చేయటం, క్షేత్ర స్థాయిలో పనులను తనిఖీ చేయటం వంటి కీలకమైన విధులు నిర్వర్తించే ఇంజనీర్లు తమ మాతృశాఖకు వెళ్లేందుకు ఇష్టపడకపోవటంతో ఎంతో ఉత్సాహాంగా పనిచేసి, నగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దటంలో భాగస్వాములయ్యేందుకు వచ్చిన యువ ఇంజనీర్ల ఉత్సా: ం తుస్సుమంది. జిహెచ్‌ఎంసిలోని ఉన్నతాధికారుల ఆదేశాలను ప్రస్తుతం సీట్లలో ఉన్న ఇంజనీర్లు ఏ మాత్రం లెక్క చేయకుండా, ఇక్కడే కొనసాగేందుకు సచివాలయం, మున్సిపల్ వ్యవహారాల శాఖ డైరెక్టర్, కమిషనర్ కార్యాలయంలో పైరవీలు ప్రారంభించినట్లు తెలిసింది. ఈ క్రమంలో ఈ ఇంజనీర్ల పంచాయతీ రేపో, మాపో రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి వెళ్లే అవకాశాలున్నట్లు పలు కార్మిక, ఉద్యోగ సంఘాల ప్రతినిధుల ద్వారా తెలిసింది.

మత్తునిద్రలో తెలంగాణ విజయ డెయిరీ

సికింద్రాబాద్, జూలై 2: తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి దాదాపు రెండు సంవత్సరాలు దాటినా విజయ డెయిరీకి మాత్రం తెలంగాణ రాలేదు. ప్రభుత్వం ఎన్నివిధాలుగా రాష్ట్రంలో పాడిపరిశ్రమను అభివృద్ధి చేయాలని చర్యలు తీసుకుంటున్నా, రైతులకు రు.4 లీటర్‌పై ప్రోత్సాహం కల్పించి పాల సేకరణను పెంచినా మొద్దునిద్రలో తూగుతున్న అధికారులు తమ అలసత్వంతో ప్రభుత్వ ప్రయత్నాలు బూడిదలో పోసిన పన్నీరులా చేస్తున్నారు. రెండు సంవత్సరాలు గడిచినా ఇప్పటివరకు కనీసం సంస్థ బోర్డును మార్చుకోలేని దుస్థితిలో అధికారులు కొట్టుమిట్టాడుతున్నారు. ప్రైవేటు డయిరీలు పోటీలో దూసుకుపోతుంటే చోద్యం చూస్తున్న అధికారులు సంస్థను పూర్తిగా నిర్వీర్యం చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారనడంలో అనుమానం లేదు. సంస్థలో అక్రమార్కుల ఆటలు కట్టించే నాధుడు లేకపోవడంతో సంస్థను చేజేతులా నాశనం చేస్తున్నారని సంస్థలో పనిచేసే కార్మికులే వాపోతున్నారంటే పరిస్థితి ఏ మేరకు దిగజారిందో అద్దం పడుతుంది. నగరంలో ఎన్ని డయిరీలు ఎంత మార్కెట్ చేసుకున్నా నగరవాసులు ప్రభుత్వ రంగ సంస్థ కావడంతో విజయపాలను ఎక్కువ శాతంలో కొనుగోలు చేస్తారు. ఇప్పటి వరకు ఎన్ని డయిరీలు మార్కెట్‌లోకి వచ్చినా ప్రజల సహకారం అభిమానంతో నిలదొక్కుకున్న సంస్థ ఇప్పుడు అధికారుల నిర్వాకంతో పూర్తిగా నిర్వీర్యం అయ్యే ప్రమాదంలోకి నెట్టబడుతోంది. మొన్నటి వరకు సమైక్య రాష్ట్రంలో కొనసాగిన ఏపి డయిరీ విజయ ఆవు లోగోతోనే పరిచయం. అయితే ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలుగా విడిపోయిన తర్వాత అటు ఏపిలో ఇటు తెలంగాణలో కూడా విజయ ఆవు లోగోనే వాడుతున్నారు. ఇంత వరకు బాగానే ఉన్నప్పటికీ, తాజాగా ఏపి కూడా తమ పాలను పాల ఉత్పత్తులను నగరంలో అమ్మడానికి సిద్ధమైంది. దీంతో ఇటు తెలంగాణ, ఆటు ఆంధ్ర రెండు కూడ ఒకే లోగోతో ఉండటం, తెలంగాణ డయిరీ యాజమాన్యం ఇప్పటివరకు పాలను ప్యాకింగ్ చేసే ఫిలిమ్‌ను మార్చుకోకుండా ఏపి పేరుతోనే ప్యాకింగ్ చేస్తుండడంతో, వినియోగదారులు ఏపి, తెలంగాణ పాల ఉత్పత్తులను గుర్తుపట్టడంలో తీవ్ర సందిగ్ధంలో ఉన్నారు. పాలు, పాల ఆధారిత ఉత్పత్తులను రెండు రాష్ట్రాలు ఒకే ఫిలిమ్, ఒకే లోగోతో మార్కెట్‌లోకి విడుదల చేయడంతో గందరగోళ పరిస్థితి నెలకొంది. రెండు సంవత్సరాలు గడుస్తున్నా తెలంగాణ విజయ డయిరీ సిబ్బంది పాలను ప్యాకింగ్ చేసే ఫిలిమ్‌పై తెలంగాణ స్టేట్ డయిరీ డవలప్‌మెంట్ ఫెడరేషన్ అని ముద్రించుకోకుండా పాతపద్ధతిలోనే ఎపిడిడిసిఎఫ్ పేరుతోనే మార్కెట్‌లో విడుదల చేస్తుంది. ఇప్పటి వరకు బాగానే నడిచిన ఏపి సైతం నగరంలో పోటీకి దిగడంతో రెండూ ఒకే ముద్రణతో మార్కెట్‌లో ఉంటే వినియోగదారులు ఎవరి ఉత్పత్తులను కొనాలో తెలియని అయోమయంలో ఉన్నారు. ఈ విషయం ముందుగానే అధికారులు తెలిసినప్పటికీ తాజాగా ఏపి మార్కెట్‌లోకి వచ్చిన తర్వాత ఘోరం జరిగిపోయినట్లు నటించడం ఎంత వరకు సమంజసమని కార్మికులు, వినియోగదారులు ప్రశ్నిస్తున్నారు. మొద్దునిద్రను నటిస్తూ తెలంగాణ విజయ డయిరీని దశలవారీగా కావాలని నిర్వీర్యం చేస్తున్న అధికారులపై తెలంగాణ ప్రభుత్వం కఠినంగా వ్యవహరించకపోతే పరిస్థితి చేజారిపోయే ప్రమాదం లేకపోలేదు. పాడిపరిశ్రమ శాఖకు మంత్రిగా ఉన్న తలసాని శ్రీనివాస్ యాదవ్ జరుగుతున్న అవకతవకలపై దృష్టి సారించకపోతే తెలంగాణలో విజయ డయిరీ కనుమరుగు కాక తప్పదనండలో ఎంతమాత్రం సందేహం లేదు.

పాతబస్తీలో రంజాన్ సందడి

హైదరాబాద్, జూలై 2: రంజాన్ మాసం సందర్భంగా పాతబస్తీలోని రోడ్లన్నీ రద్దీగా మరాయి. షాలిబండ నుండి మదీనా వరకు ఉన్న దుకాణాలు విక్రయ దారులతో కిటకిటలాడుతున్నాయి. దీంతో పాతబస్తీలోని వివిధ ప్రాంతాలు పండుగ వాతావరణాన్ని సంతరించుకున్నాయి. అంతే కాకుండా రంజాన్ మాసంలో ఎంతో పవిత్రమైన చివరి శుక్రవారం సందర్భంగా నగరంలోని ముస్లింలు అధిక సంఖ్యలో పాల్గొని సామూహిక ప్రార్థనలు నిర్వహించిన అనంతరం కోనుగోలు దారులతో షాపులు కిటకిటలాడుతున్నాయి. నగర పోలీసు కమిషనర్ ఎం.మహేందర్‌రెడ్డి నగరంలోని వివిధ ప్రాంతాల్లో పర్యటించి శాంతి భద్రతలను పర్యవేక్షించారు. రంజాన్ సందర్భంగా మసీదుల వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు.
నిఘా నీడలో చార్మినార్ పరిసర ప్రాంతాలు
నగరంలో ఐఎస్‌ఐఎస్ తీవ్రవాదుల ములాలకు సంబంధించి పాతబస్తీలోని వివిధ ప్రాంతాల్లో బయట పడటంలో నగర పోలీసులు భద్రతపై దృష్టి సారించారు. ఈ క్రమంలో నగరంలోని అన్ని జోన్ పరిధిలోని డిసిపిలు శాంతి భద్రతలపై దృష్టి సారించి ప్రార్ధనా మందిరాలు, జనసంద్రం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో, షాపింగ్‌మాల్, సినిమా థియేటర్‌లలో భద్రతను కట్టుదిట్టం చేశారు. అనేక ప్రాంతాల్లో ప్రధాన కూడళ్ల వద్ద తనిఖీలు ముమ్మరం చేశారు. ప్రత్యేకంగా చార్మినార్‌లో ఇరు వర్గాలకు సంబంధించిన ప్రార్థన మందిరాలు ఉండటంతో భద్రతను మరింత పెంచారు. చార్మినార్ వైపు వచ్చే రోడ్లపై భారీకెడ్‌లను ఏర్పాటు చేసి తనిఖీ చేసిన తరువాతనే పోలీసులు అనుమతిస్తున్నారు. చార్మినార్ ఎసిపి అశోక్‌చక్రవర్తి, చార్మినార్ ఇన్స్‌పెక్టర్ చంద్రశేఖర్‌రెడ్డిలు ఎప్పటికపుడు శాంతి భద్రతలను పర్యవేక్షిస్తున్నారు.

సకాలంలో పనులు పూర్తి కావాలి

ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, చార్మినార్, జూలై 2: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా జరుపుకునే బోనాల పండుగకు సంబంధించిన ఏర్పాటు పనులన్నీ ఈ నెల 25లోపు పూర్తి కావాలని రాష్ట్ర పశు సంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ అధికారులను ఆదేశించారు. ఏర్పాట్లుకు సంబంధించి చిన్న చిన్న సమస్యలుంటే వాటిని సంప్రదించపుల ద్వారా పరిష్కరించుకోవాలని ఆయన అధికారులకు సూచించారు. బోనాల ఏర్పాట్లపై మంత్రి శనివారం మేయర్ బొంతు రామ్మోహన్, ఇతర శాఖల అధికారులతో కలిసి పాతబస్తీలోని సాలార్‌జంగ్‌మ్యూజియంలో ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రధానంగా ఆర్ అండ్ బి, విద్యుత్, జిహెచ్‌ఎంసిల మధ్య మంచి సమన్వయం ఉండాలన్నారు. గతంలో చోటుచేసుకున్న లోటుపాట్లు పునరావృత్తం కాకుండా ఉండేందుకు గాను వివిధ ప్రభుత్వ శాఖలు ఎప్పటికపుడు సంప్రదింపులు జరుపుకుని, చక్కటి ఏర్పాట్లు చేయాలన్నారు. ఈ నెల 26, 27 తేదీల్లో తనతో పాటు నగర మంత్రలు ఏర్పాటు పనులను తనిఖీ చేయనున్నట్లు తెలిపారు. గం సంవత్సరం బోనాల ఉత్సవాలకు రూ. 5 కోట్లు కేటాయించగా, ఈ సారి పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేయిస్తామని ఆయన హామీ ఇచ్చారు. గత సంవత్సరం నగరంలోని 1300 చిన్న, మధ్య స్థాయి అమ్మవారి దేవాలయాలకు ఒక్కోదానికి రూ. 10వేలు చొప్పున ఉత్సవ నిధులను మంజూరు చేసిన విధంగానే ఈ సారి కూడా ఏ ఒక్క దేవాలయం తప్పకుండా అన్నింటికి సక్రమంగా నిధులు అందించాలన్నారు. ఈ విషయంలో ఉమ్మడి దేవాలయాల కమిటీ కాస్త చరుకైన పాత్ర పోషించి ఒక్క గుడి కూడా వదిలిపెట్టకుండా జాబితాను రూపొందించాలని ఆదేశించారు. నిధులకు కొరత లేదని, ప్రభుత్వం ఎన్ని నిధులైనా వెచ్చించేందుకు సిద్ధంగా ఉందని మంత్రి స్పష్టం చేశారు.