హైదరాబాద్

అసమాన మార్గదర్శకుడు రామారావు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముషీరాబాద్, జూలై 3: సామాన్య జీవన శైలితో అందరికీ దశ, దిశ నిర్దేశం చేసిన అసమాన మార్గదర్శకుడు దివంగత వి.రామారావు అని పలువురు వక్తలు పేర్కొన్నారు. గోపాల్‌రావు ఠాకూర్ స్మారక సమితి ఆధ్వర్యంలో ఆదివారం నారాయణగూడలోని కేశవ స్మారక పాఠశాలలో సిక్కిం మాజీ గవర్నర్ వి.రామారావు స్మారకార్ధం ‘ఆదర్శ ప్రజప్రతినిధి వి.రామారావు’ పుస్తకావిష్కరణ , స్మారక ప్రసంగం నిర్వహించారు. ముఖ్యఅతిథులుగా జస్టిస్ సివి రాములు, కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ హాజరయ్యారు. జస్టిస్ సివి రాములు పుస్తకాన్ని లాంఛనంగా ఆవిష్కరించి ప్రసంగిస్తూ జనసంఘ్ నుండి బిజెపి వరకు రామారావు పాత్ర అసమాన్యమైందని అన్నారు. ఏనాడు పదవి గూర్చి పాకులాడకుండా నిస్వార్ధంగా సేవలందించిన రామారావు నేటి రాజకీయరంగానికి స్ఫూర్తిదాయకమని కొనియాడారు. బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ తన రాజకీయ గురువు రామారావుఅని చెప్పారు. తనను రాజకీయాలలోకి ఆహ్వానించటమే కాకుండా ప్రోత్సహించి పార్లమెంట్ సభ్యుడిగా పోటీ చేయించారని తెలిపారు. ఇరు తెలుగు రాష్ట్రాలలో బిజెపి పటిష్టంగా ఉందంటే అది రామారావు కృషి అని అన్నారు. ఇతర రాజకీయ పార్టీలలోకూడా అందరికీ రామారావును ఆదర్శంగా తీసుకుంటారని చెప్పారు. పిన్న వయస్సులోనే ఎమ్మెల్సీగా రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించి చట్టసభల్లో వ్యవహరించినతీరు ఆదర్శదాయకమని అన్నారు. ‘తెలంగాణ రాష్ట్రంలో సంచార తెగలు- సంస్కృతి- విశిష్ట జీవనశైలి-ఎదుర్కుంటున్న సమస్యలు- పరిష్కారాలు’ అంశంపై స్మారక ప్రసంగం నిర్వహించారు. సంస్థ అధ్యక్షుడు కరుణాకర్ సభాధ్యక్షతన వహించగా మాజీ అధ్యక్షుడు భావనారాయణ, డాక్టర్ బాలరా జు, వై.వెంకటేశ్వరరావు, సుదర్శన్‌రెడ్డి పాల్గొన్నారు.