హైదరాబాద్

పేదలకు మెరుగైన వైద్య సేవలందించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కెపిహెచ్‌బి కాలనీ, జూలై 3: పేదలకు మెరుగైన వైద్య సేవలందించాలని ఆసుపత్రి వర్గాలకు తెలంగాణ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి సూచించారు. ఆదివారం బాలాజీనగర్ డివిజన్ పరిధిలోని కెపిహెచ్‌బికాలనీ రోడ్‌నెం.1లో నూతనంగా ఏర్పాటు చేసిన గ్లోబల్ కంటి ఆసుపత్రిని శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీతో కలిసి మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పేద ప్రజలకు మెరుగైన వైద్య సేవలందించాలని కోరారు. అత్యాధునిక టెక్నాలజీతో వైద్య సేవలందించడంలో గ్లోబల్ హాస్పిటల్ ముందుందన్నారు. కెపిహెచ్‌బికాలనీలో గ్లోబల్ కంటి ఆసుపత్రిని ప్రారంభించడం అభినందనీయమని నిర్వాహకులను అభినందించారు. ఆరోగ్యశ్రీ పథకం కింద రూ.10వేలు ఖర్చు అయితే ఆపరేషన్స్ చేయాల్సిందిగా సూచించారు. అలాగే ప్రజలు రోగాల బారిన పడకుండా అవగాహన కార్యక్రమాలను చేపట్టాల్సిందిగా కోరారు. కార్యక్రమంలో బాలాజీనగర్ కార్పొరేటర్ పన్నాల కావ్యాహరీష్‌రెడ్డి, స్థానిక నాయకులు తుల్జారాం, తులసిరెడ్డి, శ్రీను, రాజిరెడ్డి, చెన్నారెడ్డి, రామతులసి, శోభ, స్వరూప, భాగ్యలక్ష్మి పాల్గొన్నారు.