హైదరాబాద్

ప్రాజెక్ట్ పనులను సకాలంలో పూర్తి చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 3: నగర శివారు ప్రాంతాల్లో నీటి వ్యవస్థను మేరుగు పర్చేందుకు రూ.1900 కోట్లతో చేపడుతున్న పనులతో పాటు వివిధ ప్రాంతాల్లో ప్రాజెక్టు విభాగం ఆధ్వర్యం చేపడుతున్న, చేపట్టనున్న పనులపై ఖైరతాబాద్‌లోని జలమండలి కార్యాలయంలో సమీక్ష సమావేశం జరిగింది. జలమండలి మేనేజింగ్ డైరెక్టర్ ఎం.దానకిషోర్ ప్రాజెక్టు విభాగం డైరెక్టర్లు, సిజిఎం, జిఎంలో సమావేశమై పనుల తీరుతెన్నులను అడిగి తెలుసుకున్నారు. ప్రాజెక్టు విభాగం ఆధ్వర్యంలో చేపడుతున్న పనుల వద్ద తప్పకుండా సిసి కెమెరాలను ఏర్పాటు చేయలని ఎండి అధికారులను అదేశించారు. పనులు జరుగుతున్న ప్రాంతాల్లో సంబంధిత మేనేజర్లు ఎప్పటికపుడు పరిశీలించి వారం రోజులకు ఒకసారి పూర్తి నివేధికలను ప్రధాన కార్యాలయానికి చేరవేయాలని అన్నారు. కాంట్రాక్టర్లకు సూచించన వ్యవధిలో పనులు పుర్తయ్యేల అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. సమీక్షలో ఇడి సత్యనారాయణ, డైరెక్టర్లు జి.రామేశ్వరరావు, ఏల్లస్వామి, డి.శ్రీ్ధర్‌బాబుతో పాటు సిజిఎం, జిఎంలు పాల్గొన్నారు.