హైదరాబాద్

సావిత్రి పూలే సేవలు మరువలేనివి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 3: సావిత్రి బాయి పూలె 185వ, జయంతి సందర్భంగా హైదరాబాద్ పార్లమెంట్ యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలు ఎస్ శైలజాక్రాంతికుమార్ ఆధ్వర్యంలో ఛత్రినాక శివాజినగర్ ప్రాంతంలోని బిసి ప్రభుత్వం సంక్షేమ బాలికల వసతి గృహంలో నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దేశంలోని ప్రముఖ సంఘ సంస్కర్తల్లో ఒకరైన సావిత్రి బాయి పూలె కుల వ్యవస్థ నిర్మూలనకు కృషి చేయడంతోపాటు మహిళలకు విద్యనందిచేందుకు పలు పాఠశాలలను ఏర్పాటు చేసిన ఘనత ఆమెదేనన్నారు. ఈ కార్యక్రమంలో జి మమత, భవాని, కవిత, నిరోష, ప్రియాంక, తబుస్సుమ్, రేణుక తదితరులు పాల్గొన్నారు.
నార్సింగిలో...
నార్సింగి: సావిత్రిబాయి పూలే జయంతి వేడుకులు కార్వాన్‌లో ఘనంగా నిర్వహించారు. జిపిహెచ్‌ఎస్ కుల్సుంపుర అడ్వజర్ జి.ప్రహల్లాద్ యాదవ్ ఆధ్వర్యంలో సావిత్రిబాయి జయంతిని జాఫర్‌గూడ అన్నపూర్ణనగర్‌లో ఆదివారం నిర్వహించారు. సావిత్రిబాయి పూలే బిసిల కోసం ఎంతో పోరాటం చేశారని పేర్కొన్నారు. కార్యక్రమంలో కుల్సుంపుర ప్రభుత్వ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు జయ్‌కుమార్, మధుమతి, రఘవేంద్ర, గిరి, కరణ్‌కుమార్, శ్రీకాంత్, రాకేష్, సంఘమేశ్వర్, హరి, మోహాన్, నిఖిలేశ్ పాల్గొన్నారు.
ఇబ్రహీంపట్నంలో...
ఇబ్రహీంపట్నం: సామాజిక రుగ్మతలను రూపుమాపడానికి సావిత్రిబాయిపూలే చేసిన కృషి శ్లాఘనీయమని తెలంగాణ బిసి ఫ్రంట్ చైర్మన్ గొరిగె మల్లేష్‌యాదవ్ పేర్కొన్నారు. సావిత్రిబాయి పూలే జయంతిని పురస్కరించుకొని స్థానిక జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో జయంత్యుత్సవాలు నిర్వహించారు. ముందుగా సావిత్రిబాయి చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. సమాజంలో అంటరానితనం, బాల్యవివాహాలు, సాంఘిక దురాచారాలను రూపుమాపడానికి, మహిళలను చైతన్యవంతులను చేయడంలో ఆమె చేసిన కృషి మరువలేనిదన్నారు.