హైదరాబాద్

మూడు శాఖల ముడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 7: మహానగరంలో చినుకుపడిదంటే చాలు రహదార్లు గోదారిని తలపిస్తున్నాయి. నెలరోజుల క్రితం మున్సిపల్ మంత్రి కెటిఆర్ నగరంలోని శ్రీనగర్‌కాలనీ, యూసుఫ్‌గూడ తదితర ప్రాంతాల్లో పర్యటించి రోడ్ల పరిస్థితిపై తీవ్ర స్థాయిలో అసహనాన్ని వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే! శ్రీనగర్‌కాలనీలో రోడ్డును ఇష్టారాజ్యంగా తవ్వి పనులు చేపట్టిన కాంట్రాక్టర్‌ను అప్పటికపుడు అక్కడికే పిలిపించాలని ఆదేశించిన సంగతి తెలిసిందే! అంతేగాక, అత్యవసర పరిస్థితుల్లో అంబులెన్స్ దారివ్వలేని రోడ్లున్న నగరాన్ని గ్లోబల్ సిటీగా ఎలా తీర్చిదిద్దుతామంటూ ఆయన ఆగ్రహించిన సంగతి తెలిసిందే! దీంతో శ్రీనగర్‌కాలనీరోడ్డులో భూగర్భ విద్యుత్ కేబుల్ వేయాల్సి ఉందని, ఆ తర్వాత జలమండలి పని కూడా వారం రోజుల్లో పూర్తి చేసిన తర్వాత కొత్తగా రోడ్డు వేస్తామని జిహెచ్‌ఎంసి అధికారులు చెప్పినా, నేటికీ ఆ మాట నిజం కాలేదు. పైగా ఈ రోడ్డుపై ఏర్పడిన గుంతల్లో వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు మట్టిపోసి వదిలేశారు. ఆ తర్వాత కురిసిన వర్షానికి మట్టి కాస్త బురదగా తయారై వాహనదారుల పాలిట శాపంగా మారింది. ఇప్పటికే పలువురు వాహనదారులు జారీ పడిన సంఘటనలూ ఉన్నాయి. ఈ రోడ్డే గాక, నగరంలోని విఐపి జోన్‌లోనూ వివిధ ప్రాంతాల్లో రోడ్లు పూర్తిగా అస్తవ్యస్తంగా మారాయి. నగరంలో సికిందరాబాద్, బేగంపేట, ముషీరాబాద్, ఆర్టీసి క్రాస్‌రోడ్డు, చిక్కడపల్లి, బర్కత్‌పురా, నారాయణగూడ, నాంపల్లి, ఎంజె.మార్కెట్, పంజాగుట్ట, అమీర్‌పేట ప్రాంతాల్లో రోడ్లు పూర్తిగా గుంతలమయంగా మారాయి. మెట్రోరైలు పనులు జరుగుతున్న ముషీరాబాద్, పంజాగుట్ట, అమీర్‌పేట, లక్డీకాపూల్, నాంపల్లి, బేగంపేట తదితర ప్రాంతాల్లో రోడ్లపై ఒకటి, రెండు అడుగుల లోతు వరకు గుంతలు ఏర్పడ్డాయి. ఇందుకు వివిధ ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయం లేకపోవటమే ప్రధాన కారణంగా గుర్తించిన మంత్రి ఆ తర్వాత ప్రత్యేకంగా వర్క్‌షాప్ పెట్టి పాఠాలు చెప్పినా, శాఖల అధికారులకు పట్టలేదు. నేటికీ శ్రీనగర్‌కాలనీరోడ్డు పరిస్థితి అలాగే ఉంది. మున్సిపల్ మంత్రి ఆగ్రహం వ్యక్తం చేసినా, తీరిగ్గా కూర్చోని పాఠాలు చెప్పినా పనులు చేయని అధికారులు ఇంకెవరు చెబితే సక్రమంగా పనులు చేస్తారన్నది చర్చనీయాంశంగా మారింది. నేటికీ శ్రీనగర్‌కాలనీ పూర్తిగా గుంతలమయంగా తయారుకావటం పట్ల ప్రజలు పనులు చేస్తున్న సిబ్బందిపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. సంబంధిత మంత్రి నేరుగా పనులను తనిఖీ చేసి జారీ చేసిన ఆదేశాలే బేఖాతరవుతున్నాయంటే, ఇక దేవుడే దిగి వచ్చి చెప్పినా అధికారులు పనిచేసే పరిస్థితులు కన్పించటం లేదు.