హైదరాబాద్

తెలుగు రాష్ట్రాలలో పోలీసు పాలన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 8: దేశంలో ఏ మతగ్రంథం బోధించినా మానవ సేవయే మాధవ సేవ అనే సూక్తి పోయిందని ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో పోలీసు పాలన నడుస్తోందని మాజీ మంత్రి కాసు వెంకట కృష్ణారెడ్డి అన్నారు. దివంగత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి జన్మదినోత్సవం సందర్భంగా రవీంద్రభారతి సమావేశ మందిరంలో శుక్రవారం ఏర్పాటుచేసిన కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిధిగా పాల్గొన్నారు. గతంలో వైఎస్‌ఆర్ పాలనలో పేదల కోసం కట్టిన ఇళ్ళకు మున్సిపల్ లైసెన్స్ తదితర బిల్లులు ఇవ్వకుండా వారిపై కేసులు పెట్టి ఇళ్లు కూల్చేస్తే ఎలా అని ఆయన ప్రశ్నించారు.
ప్రజలు వైఎస్‌ఆర్ మార్గంలో నడవాలని, పాలకుల దగ్గరకు వెళ్ళి తమ సమస్యలు తెలపాలని, పాతనగరంలోని పేద ప్రజలకు చేయూతనివ్వండని తమ సహకారం ఎల్లవేళలా వుంటుందని ఆయన పేర్కొన్నారు. గతంలో కాంగ్రెస్ పాలనలో మంత్రిగా పదవిలో ఉన్న చంద్రబాబు నాయుడు ఆనాడు చేసిన మంచి పనుల గురించి ఎందుకు చెప్పడం లేదని ఆయన ప్రశ్నించారు. పాలకపక్షం, ప్రతిపక్షం జోడెద్దుల వంటి వారని, ప్రభుత్వం బండి వంటిదని కలసి నడుపుతేనే సవ్యంగా సాగుతుందని ఆయన అన్నారు. వైఎస్‌ఆర్ జన్మదిన కేక్ కట్‌చేసి కాసు వెంకటకృష్ణారెడ్డి పేదలకు, వికలాంగులకు దుస్తులు పంపిణీ చేశారు. మాజీ చీఫ్ విప్ వై.శివరామరెడ్డి మాట్లాడుతూ చనిపోయిన తర్వాత కూడా అందరూ గుర్తుంచుకున్న గొప్ప వ్యక్తి వైఎస్‌ఆర్ అని అన్నారు. ఓటర్లకు డబ్బులు పంచి ఓట్లు కొని మంత్రులైన వారు ఎన్ని కోట్లు సంపాదించి వుంటారో ఊహించుకోండి అని అన్నారు. వైఎస్‌ఆర్ చేపట్టిన ఉపాధి హామీ పథకం దారి మళ్లుతోందని ఆరోపించారు. దేశంలో ముఖ్యమంత్రి హోదాలో అత్యధిక ధనవంతుడు చంద్రబాబు అని అన్నారు. భవిష్యత్తు రాజకీయం యువకులదే నని, వైఎస్‌ఆర్ వంటి నాయకులను ఎన్నుకొని ప్రజాపాలనకు మార్గదర్శకులవ్వాలని శివమారెడ్డి అన్నారు. తొలుత వైఎస్‌ఆర్ యువసేన నాయకులు చింతల రాజశేఖర్ స్వాగతం పలికారు.