హైదరాబాద్

పాతబస్తీలో పోలీసుల నిర్బంధ తనిఖీలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 9: పాతబస్తీలోని వివిధ ప్రాంతాలలో ఐఎస్‌ఐఎస్ మూలాలు బయటపడటంతో నగర పోలీసులు శాంతిభద్రతలపై ప్రత్యేక దృష్టి సారించారు. అందులో భాగంగా శనివారం బహదూర్‌పురా పోలీస్టేషన్ పరిధిలోని హసన్‌నగర్‌లో దక్షిణ మండలం డిసిపి వి.సత్యనారాయణ ఆధ్వర్యంలో సుమారు 400 మంది పోలీసు సిబ్బందితో నిర్బంధ తనిఖీలు నిర్వహించారు. చార్మినార్, సంతోష్‌నగర్ ఎసిపిలు కె.అశోక్‌చక్రవర్తి, శ్రీనివాస్‌రావులతో పాటు ఇన్స్‌పెక్టర్లు, ఎస్‌ఐలతో పాటు మొత్తం 14 బృందాలతో ఏర్పడి తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏలాంటి సరైన పత్రాలు లేని లేని 56 బైక్‌లు, 4 ఆటోలను సీజ్ చేశారు. తనిఖీలో 280 మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకున్న పోలీసులు నిర్భంద తనిఖీల్లో పట్టుబడ్డ పలువురిని అదుపులోకి తీసుకుని విచారించారు. శనివారం ఉదయం ఆరు గంటల నుండి కోనసాగిన ఈ తనిఖీల్లో 9మంది రౌడిషీటర్లు, ఒక అనుమానితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారిస్తున్నారు.
పాతబస్తీలో శాంతిభద్రతల పర్యవేక్షణ, ప్రజల రక్షణలో భాగంగా పాతబస్తీలో తనిఖీలు ముమ్మరంగా నిర్వహిస్తామని డిసిపి సత్యనారాయణ తెలిపారు. పాతబస్తీలోని ఏ ప్రాంతంలోనైనా గర్తుతెలియని వ్యక్తులు సంచరించిన, ఏలాంటి అనుమానం కలిగిన స్థానిక పోలీసులకు వెంటనే ప్రజలు సమాచారం అందించాలన్నారు.
రంజాన్ పండుగా ప్రశాంతంగా నిర్వహించడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి డిసిపి కృతతలు తెలిపారు. పాతబస్తీలో బోనాలు, జాతర వేడుకలను కూడా ప్రశాంతంగా నిర్వహించాడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. పాతబస్తీలోని సున్నిత, సమాస్యత్మక ప్రాంతాలో నిఘాను పెంచి, ప్రార్థన మందీరాల వద్ద ప్రత్యేక పోలీసు పికెట్‌లను ఏర్పాటు చేసి శాంతి భద్రతలను పర్యవేక్షిస్తున్నామన్నారు.
గుజరాతీ గల్లీలో
నగరంలోని కోఠి బ్యాంక్ స్ట్రీట్, గుజరాతీగల్లీలలో పోలీసులు శనివారం రాత్రి నిర్భంద తనిఖీలు చేపట్టారు. డిసిపి రవీంద్ర ఆధ్వర్యంలో సుల్తాన్‌బజార్ పోలీసులు ఈ తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా 34 మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. సరైన పత్రాలు లేని ఆటో, 89 ద్విచక్ర వాహనాలను సీజ్ చేశారు.