రంగారెడ్డి

కార్తీక పౌర్ణమితో కిక్కిరిసిన ఆలయాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నేరేడ్‌మెట్, నవంబర్ 25: కార్తీక పౌర్ణమి సందర్భంగా మల్కాజిగిరి సర్కిల్ పరిధిలోని నేరేడ్‌మెట్, వౌలాలి, కాకతీయనగర్, ఓల్డ్‌సఫిల్‌గూడ, ప్రశాంత్‌నగర్, జవహర్‌నగర్, సాయినాధపురం, డిఫెన్స్‌కాలనీ, మధురానగర్ ప్రాంతాలలో ఆలయాలు మహిళలతో కిక్కిరిసిపోయాయి. మహిళలు తెల్లవారుఝాము నుండే శివాలయాల వద్ద బారులు తీరారు. శివునికి చెరుకు రసం, పాలు, పండ్ల రసాలతో అభిషేకం చేసి తమ మొక్కులను తీర్చుకున్నారు. గొలుసు దొంగతనాలు జరగకుండా మల్కాజిగిరి, నేరేడ్‌మెట్ పోలీసులు తమ సిబ్బందితో ఆలయాల వద్ద పికెటింగ్ ఏర్పాటు చేశారు.
శ్రీకాశీవిశ్వనాథ దేవాలయంలో
మల్కాజిగిరి: మల్కాజిగిరి పరిధిలోని శివాలయాల్లో కార్తీక పౌర్ణమి పూజలు ఘనంగా జరిగాయి. బుధవారం ఉదయం తెల్లవారుఝాజాము నుంచే భక్తులు పెద్ద ఎత్తున శివాలయాలకు తరలి వచ్చి కార్తీక దీపాలు వెలిగించారు. నేరేడ్‌మెట్‌లోని శ్రీఅన్నపూర్ణ, పంచాయతన శ్రీకాశీవిశ్వనాథ దేవాలయానికి భక్తులు భారీగా తరులి వచ్చారు. స్వామివారికి రుద్రాభిషేకాలు, ప్రత్యేక అర్చనలు, నిర్వహించారు. ఉదయం నుంచి సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకుడు చంద్రశేఖర శర్మ ఆధ్వర్యంలో పండితులు నాగరాజు చారి, సంజీవ్ శర్మ పూజలు నిర్వహించారు. సాయంత్రం ఆకాశ దీపం ఆవిష్కరించాక భక్తులు ఆలయం లోపల, బయట దీపాలు వెలిగించారు. భక్తులు వెలిగించిన దీపాల కాంతుల్లో ఆలయం దేదీప్యమానంగా వెలిగొందింది. ఆలయ కమిటీ చైర్మన్ వెంకటేశ్వర్, అధ్యక్షుడు ఎన్. అశోక్‌కుమార్, హరిచరణ్, నిర్వహకులు జిబి శివకుమార్, మల్లేష్, నంది భాస్కర్ పాల్గొన్నారు.
ఉప్పల్‌లో..
ఉప్పల్: కార్తీక పౌర్ణమి వేడుకలు బుధవారం అత్యంత భక్తిశ్రద్ధలతో వైభవంగా జరిగాయి. ఉదయమే నిద్రలేచి పుణ్యస్నానాలు ఆచరించి ఆలయాలకు వెళ్లి ఉసిరి చెట్టు వద్ద దీపాలను వెలిగించి పూజలు నిర్వహించారు. సుగంధ ద్రవ్యాలతో అభిషేకం, అర్చనలు, క్షీరాభిషేకం, పుష్భాషేకంతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయాలలో కార్తీక శోభ సంచురించుకుంది. భక్తులతో ఆలయాలన్నీ కిటకిటలాడాయి. ఆలయాలలో సామూహిక వ్రతాలు నిర్వహించారు. ఉప్పల్ వెలుగుట్టలోని శ్రీ భ్రమరాంబ మల్లిఖార్జున స్వామి ఆలయం, స్వరూప్‌నగర్‌లోని కనిగిరి శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయం, ఉప్పల్ పాతబస్తీలోని శివాలయం, రామచంద్రస్వామి ఆలయం, చిల్కానగర్‌లోని శ్రీవాలయం, ఆంజనేయస్వామి ఆలయం, రామంతాపూర్ వెంకట్‌రెడ్డినగర్‌లోని శ్రీకన్యకాపరమేశ్వరి ఆలయం, ఇందిరానగర్‌లోని శ్రీరమాసహిత సత్యనారాయణస్వామి ఆలయం, శ్రీనివాసపురంలోని శ్రీకోదండరామస్వామి ఆలయం, పాతబస్తీలోని శ్రీమల్లిఖార్జునస్వామి ఆలయం, హబ్సిగూడ రవీంద్రనగర్‌లోని శ్రీసంతోషిమాత, షిర్డీ సాయి నిలయంలో కార్తీక పౌర్ణమి మహోత్సవాలు అత్యంత భక్తిశ్రద్ధలతో జరిగాయి. శ్రీరమాసహిత సత్యనారాయణ స్వామి ఆలయంలో స్థానిక ఎమ్మెల్యే ఎన్‌విఎస్‌ఎస్ ప్రభాకర్ దంపతులు పాల్గొని పూజలు నిర్వహించారు. పర్వతాపూర్‌లోని యాదాద్రి లక్ష్మినరసింహ స్వామి ఆలయం, శ్రీరమణపురంలోని శ్రీదుర్గామల్లీశ్వరి ఆలయం, మేడిపల్లిలోని శ్రీఅభయాంజనేయస్వామి ఆలయం, సాయిబాబ ఆలయం, పీర్జాదిగూడ విష్ణుపురికాలనీలోని శ్రీఆంజనేయస్వామి ఆలయం, కెనరానగర్‌లోని శివాలయం, బుద్ధానగర్‌లోని శ్రీసాయినిలయం, మల్లిఖార్జున్‌నగర్‌లోని మల్లన్న ఆలయం, రాఘవేంద్రనగర్‌లోని శ్రీగోదాదేవి పద్మావతి వేంకటేశ్వర స్వామి ఆలయం, బోడుప్పల్‌లోని శ్రీమల్లిఖార్జున స్వామి ఆలయం, బాలచిత్తారినగర్‌లోని శివాలయం, మారుతీనగర్‌లోని శ్రీఅభయాంజనేయ స్వామి ఆలయం, మేక్‌డోవెల్‌కాలనీలోని సాయిబాబ ఆలయంలో కార్తీక మాసం భక్తులతో సందడి నెలకొంది.
కార్తీక పౌర్ణమి శోభ
జీడిమెట్ల: కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని దేవాలయాల్లో బుధవారం కార్తీక పౌర్ణమి శోభ సంతరించుకుంది. సర్కిల్ పరిధిలోని జగద్గిరిగుట్ట, గాజులరామారం, చింతల్, జీడిమెట్ల, సూరారం కాలనీ, కుత్బుల్లాపూర్ డివిజన్‌లతోపాటు మండల పరిధిలోని దుందిగల్, దొమ్మరపోచంపల్లి, గాగిల్లాపూర్, మల్లంపేట్, బౌరంపేట్, బాచుపల్లి, నిజాంపేట్, ప్రగతినగర్, బహద్దూర్‌పల్లి, దూలపల్లి, కొంపల్లి గ్రామాలలోని శివాలయాలతో పాటు అన్ని దేవాలయాలలో కార్తీక పౌర్ణమి ప్రత్యేక పూజలు కొనసాగాయి. ఆలయాలన్ని భక్తులతో కిటకిటలాడాయి. జగద్గిరిగుట్ట, శ్రీరామ్‌నగర్-ఎలోని శ్రీశివమార్కండేయ స్వామి దేవాలయంలో ఆలయ వ్యవస్థాపకుడు జి.రాజశేఖర్ ఆధ్వర్యంలో సామూహిక సత్యనారాయణ స్వామి పూజలు జరిగాయి. అనంతరం అన్నదాన కార్యక్రమం జరిగింది. సాయంత్రం దీపారాధన కార్యక్రమం కన్నుల పండువగా కొనసాగింది. మగ్దూమ్‌నగర్‌లోని శ్రీ శివసీతారామాంజనేయ స్వామి దేవాలయంలో కార్తీక పౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. మాజీ కార్పొరేటర్ జగన్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు జరిగాయి. అనంతరం శివమాలధారణ భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి నియోజకవర్గం టిఆర్‌ఎస్ ఇన్‌చార్జి కొలను హన్మంతరెడ్డి విచ్చేశారు.
బాచుపల్లిలో..
దేవాలయాలు ప్రశాంతతకు నిలయాలని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కెపి వివేక్ అన్నారు. బుధవారం బాచుపల్లిలోని షిర్డీ సాయిబాబా ఆలయ వార్షికోత్సవ వేడుకలు జరిగాయి. కార్తీక పౌర్ణమి సందర్భంగా ఆలయంలో సామూహిక సత్యనారాయణ స్వామి పూజలు నిర్వహించాయి. వేడుకలకు వివేక్, ఎంపిపి సన్న కవిత, గ్రామ సర్పంచ్ ఆగం పాండు, మండల ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు ఆగం రాజులు విచ్చేసి ప్రత్యేక పూజలు చేశారు. వివేక్ మాట్లాడుతూ కాలనీలలో, బస్తీల్లో దేవాలయాలను అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. దేవాలయాలు మానసిక ప్రశాంతతకు దోహదపడతాయని చెప్పారు. కార్యక్రమంలో మల్లంపేట్ ఎంపిటిసి మాదాసు వెంకటేశం పాల్గొన్నారు.
షాపూర్‌నగర్ డివిజన్ మెట్‌కానిగూడలోని నల్లగుట్ట లక్ష్మి నర్సింహస్వామి ఆలయంలో కార్తీక పౌర్ణమి పూజలు జరిగాయి. ఎమ్మెల్యే కెపి వివేక్, కెకెఎం ట్రస్ట్ చైర్మన్ కూన శ్రీనివాస్‌గౌడ్ వేర్వేరుగా పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ చైర్మన్ అముర ఇంద్రసేనాగుప్త, నాయకులు నాగిళ్ల శ్రీనివాస్, అంతయ్యగౌడ్, బాల్‌రాజ్ పాల్గొన్నారు.
ఇబ్రహీంపట్నంలో..
ఇబ్రహీంపట్నం: కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని మండల కేంద్రంతో పాటు గ్రామాల్లోని దేవాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. దేవాలయ ప్రాంగణాల్లో కార్తీక దీపాలను వెలిగించారు. మండల కేంద్రంలోని త్రీశక్తి, శివాలయం, ఈశ్వరాంజనేయస్వామి దేవాలయాల్లో కార్తీక దీపాలను వెలిగించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్తీక పౌర్ణమితో దేవాలయాలన్ని భక్తజన సందోహంగా మారాయి.
వైభవంగా గంగమ్మకు హారతి
ఇబ్రహీంపట్నం అఖండ ఆధ్వర్యంలో బుధవారం స్థానిక పెద్దచెరువు వద్ద గంగమ్మకు హారతీ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. హంపీ పీఠాధిపతి శ్రీశ్రీ విద్యారణ్య భారతీ స్వామీజీ ఆధ్వర్యంలో గంగమ్మకు జెఎసి నాయకులు హారతినిచ్చారు. కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని పెద్దచెరువు నిండి సస్యశ్యామలం కావాలని కోరుతూ జెఎసి ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని సదా వెంకట్‌రెడ్డి నిర్వహించారు. విద్యారణ్యభారతీ స్వామీజీ మాట్లాడుతూ ఈ ప్రాంతంలో కరవు పరిస్థితులు త్వరలోనే తొలగిపోవాలని ఆకాంక్షించారు. గంగమ్మ కరుణతో పెద్ద చెరువు నిండి పంటలు సమృద్ధిగా పండుతాయని అన్నారు.
రాజేంద్రనగర్ సర్కిల్‌లో.
రాజేంద్రనగర్: కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకొని రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలో బుధవారం శివాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. తెల్లవారుఝాము నుంచే భక్తులు దేవాలయాలకు క్యూ కట్టారు. కార్తీక పౌర్ణమి రోజు శివుడిని ప్రతీతి కావడంతో స్వామివారిని దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు. స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, ఉసిరి చెట్టు వద్ద కార్తీక దీపాలను వెలిగించారు. హైదర్‌గూడ రాంబాగ్ చిన్న అనంతగిరి దేవాలయంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా ప్రణవ భక్త సమాజం ఆధ్వర్యంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు. ప్రణవభక్త సమాజం ప్రతినిధులు మోండ్ర నర్సింహ్మా, కృష్ణ, పుస్తకాల అశోక్, ఎన్.మల్లారెడ్డి, కొమరయ్య, ఎస్‌బి హరినాధ్, హరినాథ్, మోండ్ర ఐలయ్య, చంద్రయ్య ఉన్నారు.
మహేశ్వరంలో..
మహేశ్వరం: మహేశ్వరంలోని శ్రీశివగంగ రాజరాజేశ్వరి ఆలయంలో కార్తీక పౌర్ణమి వేడుకలను వైభవంగా నిర్వహించారు. రుద్రాభిషేకాలు, ప్రత్యేక పూజలు, కుంకుమార్చన, లక్షదీపార్చన చేశారు. భక్తులకు అన్నదానం నిర్వహించారు. ఐజి శ్రీనివాస్‌రెడ్డి దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ చైర్మన్ నిమ్మగూడెం సుధీర్‌గౌడ్ మాట్లాడుతూ భక్తులు, దాతలు, గ్రామస్థుల సహాయంతో రాజరాజేశ్వర ఆలయాన్ని మరింత అభివృద్ధి చేస్తానని చెప్పారు. కార్యక్రమంలో మండల పరిషత్ ఉపాధ్యక్షురాలు మునగపాటి స్వప్న, సర్పంచ్ స్వర్ణగంటి ఆనందం, ఆలయ కమిటీ మాజీ చైర్మన్ ఎం.నవీన్ పాల్గొన్నారు.
సికింద్రాబాద్‌లో..
బేగంపేట: నగరంలో కార్తీక పౌర్ణమి వేడుకలు వైభంగా కొనసాగాయి. భక్తులు ఉదయానే్న ఆలయాలను సందర్శించి మొక్కలను తీర్చుకున్నారు. సికింద్రాబాద్ గణపతి దేవాలయం, ఉజ్జయిని మహంకాళీ దేవాలయం, ఎస్‌పి రోడ్డులోని వీరహనుమాన్ దేవాలయం, బేగంపేట రామలింగేశ్వర ఆలయాల్లో భక్తులు పూజలు నిర్వహించారు. ఏర్పాట్లను గణపతి దేవాలయ ఇవో నర్సింలు, ఉజ్జయిని మహంకాళి ఆలయం సూపరింటెండెంట్ రవి పర్యవేక్షించారు. నార్త్‌జోన్ పోలీసులు నిఘా ఏర్పాటు చేశారు.
మర్పల్లిలో..
మర్పల్లి: కార్తీక పౌర్ణమి వేడుకలను మర్పల్లి మండలంలో వైభవంగా జరుపుకున్నారు. ఆలయాలకు వెల్లి దీపాలను వెలిగించారు. మర్పల్లిలోని సంగమేశ్వర దేవాలయం, సాయిబాబా మందిరంలో భక్తులు పూజలు చేశారు.
తాండూరులో..
తాండూరు: కార్తీక పౌర్ణమి వేడుకలను డివిజన్‌లో ఘనంగా జరుపుకున్నారు. ఇంటింటా కార్తీక దీపాన్ని వెలిగించారు. ఆలయాలకు తరలివెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వైష్ణవ, శైల ఆలయాలతోపాటు శ్రీలక్ష్మీ, అమ్మవారి దేవాలయాలు భక్తులులతో కిటకిటలాడాయి.

ఆలయాలలో భక్తుల సందడి
జవహర్‌నగర్, నవంబర్ 25: కార్తీక పౌర్ణమి సందర్భంగా జవహర్‌నగర్, యాప్రాల్, బాలాజీనగర్ తదితర ప్రాంతాలలో ఆలయాలు ఉదయం నుంచి భక్తులతో కిటకిట లాడాయి. జవహర్‌నగర్‌లోని సాయిబాబా ఆలయంలో స్థానిక భక్తులు ఉదయం నుండి బారులుదీరి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్తీక మాసం పవిత్ర దినం కావడంతో వత్రాలు, అర్చనలు, అభిషేకాలతో ఆలయాలు సందడిగా మారాయి.
మేడ్చల్‌లో..
మేడ్చల్: కార్తీక పౌర్ణమి పర్వదిన సందర్భంగా మేడ్చల్‌లోని శివాలయాలు బుధవారం తెల్లవారుజాము నుంచే భక్తుల తాకిడితో కిటకిటలాడాయి.