హైదరాబాద్

వినాయక విగ్రహాలు 15 అడుగులు మించొద్దు : హైకోర్టు సూచన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 11: గణేష్ ఉత్సవాల సందర్భంగా వినాయక విగ్రహాలు 15 అడుగులు మించకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని రాష్ట్ర హైకోర్టు సోమవారం నాడు సూచించింది. భాగ్యనగర ఉత్సవ సమితి సైతం ఈ మేరకు చర్యలు తీసుకోవాలని పేర్కొంది. నగరానికి చెందిన న్యాయవాది ఎం వేణుమాధవ్ దాఖలు చేసిన పిటీషన్‌ను విచారణకు స్వీకరించిన తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలిప్ బి బోసలే, జస్టిస్ పి నవీన్‌రావులతో కూడిన డివిజన్ బెంచ్ ఈ మేరకు ఆదేశాలు ఇచ్చింది. విగ్రహాలను నేరుగా చెరవుల్లో నిమజ్జనం చేయకుండా తొట్టెలు ఏర్పాటు చేయాలని , పూజాసామగ్రీ చెరవులో వేయకుండా వేరే రూపంలో సమీకరించాలని గతంలో న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలను పాటించేలా చర్యలు తీసుకోవాలని న్యాయవాది కోరారు. మహారాష్ట్ర ప్రభుత్వం నిమజ్జనం సమయంలో ప్రత్యేక తొట్టెలను ఏర్పాటు చేస్తోందని జస్టిస్ బోసలే పేర్కొన్నారు. నగరంలో మెట్రో రైలు పనులు నడుస్తున్నందున విగ్రహాల ఎత్తు 15 అడుగులు మించకుండా చూడాలని, వీటివల్ల అభివృద్ధి పనులు ఆగిపోకుండా చూడాలని న్యాయమూర్తులు అభిప్రాయపడ్డారు.
గణేష్ విగ్రహాలకు సహజ రంగులు మాత్రమే వినియోగించేలా చర్యలు చేపట్టాలని కూడా న్యాయమూర్తులు జిహెచ్‌ఎంసి అధికారులను ఆదేశించారు. హుస్సేన్‌సాగర్ శుద్ధికి, విగ్రహాల ఎత్తు నియంత్రణకు తీసుకున్న చర్యలను వివరిస్తూ ఒక అఫిడవిట్ దాఖలు చేయాలని కూడా హైకోర్టు తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది.
చెరువులను రక్షించండి
హైదరాబాద్‌లో చెరువులను పరిరక్షించేందుకు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర హైకోర్టు హెచ్‌ఎండిఎను ఆదేశించింది. రామాంతపురం చెరువు ఆక్రమణలపై ఉస్మానియా యూనివర్శిటీకి చెందిన కెఎల్ వ్యాస్ రాసిన లేఖను సూమోటో కింద 2012లో స్వీకరించిన హైకోర్టు తాత్కాలిక ప్రధానన్యాయమూర్తి జస్టిస్ దిలిప్ బి బోసలే, జస్టిస్ పి నవీన్‌రావులతో కూడిన డివిజన్ బెంచ్ ఈ ఆదేశాలు ఇచ్చింది. హెచ్‌ఎండిఎ పరిధిలో 501 చెరువులు, జిహెచ్‌ఎంసి పరిధిలో మరో 176 చెరువులు ఉన్నట్టు హైకోర్టు గుర్తించింది. ఇప్పటికే చెరువు సరిహద్దులు ‘్ఫల్ ట్యాంకు లెవెల్’(ఎఫ్‌టిఎల్) గుర్తించామని, ఆ మేరకు కంచె నిర్మించామని అధికారులు హైకోర్టు దృష్టికి తెచ్చారు. ప్రతి చెరువును రెవిన్యూ అధికారులతో సర్వే చేయించి హద్దులను నిర్ధారించాలని హైకోర్టు పేర్కొంది. చెరువు పరిధిలో నిర్మాణాలను తొలగించాలని కూడా హైకోర్టు ఆదేశించింది.