హైదరాబాద్

సరోజినీదేవి కంటి ఆసుపత్రి నుంచి నలుగురు బాధితుల డిశ్చార్జి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నార్సింగి, జూలై 12: కొన్ని రోజుల క్రితం సరోజినీ దేవి కంటి ఆసుపత్రిలో జరిగిన కంటి ఆపరేషన్లలో కంటి చూపుపోయిన రోగులు నలుగురు ఇంటికి తరలివెళ్లారు.
మెహిదీపట్నంలోని సరోజినీ దేవి కంటి ఆసుపత్రిలోని కంటిచూపు పోయిన ఐదుగురిలో నలుగురు మంగళవారం మధ్యాహ్నం ఇంటికి వెళ్లిపోయారు. ఇక తమకు చూపువస్తుందో లేదో తెలియడం లేదని, గత్యంతరం లేక ఇంటికి వెళుతున్నామని రోగులు తెలిపారు. కాస్త చూపు ఉన్న కంటిని డాక్టర్లు ఆపరేషన్లు చేసి కంటి చూపు పోగొట్టారని రోగులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సరోజినీ దేవి కంటి ఆసుపత్రిలో కంటి చూపుపోయిన ఐదుగురు చికిత్సలు పొందుతుండగా, తమను డాక్టర్లు రెండు నెలల తర్వాత రమ్మనారని, అందుకోసం ఇంటికి వెళుతున్నట్టు వారు పేర్కొన్నారు. నూకల తల్లి, ప్రభావతి, అర్పానీబాయి, అంజిరెడ్డి ఇంటికి వెళ్లారు. అయితే మాణిక్యం మాత్రం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.
అత్యవసర చికిత్సలు చేస్తున్నాం
ఆసుపత్రికి వచ్చిన రోగులకు అత్యవసర చికిత్స చేసి ఇంటికి పంపిస్తున్నామని సరోజినీ దేవి కంటి ఆసుపత్రి సూపరింటెండెంట్ రాజేందర్ గుప్తా అన్నారు. ఆసుపత్రిలో ఇటీవలే జరిగిన ఘటనతో గత కొన్ని రోజులుగా రోగులకు ఆపరేషన్లు చేయడం లేదని తెలిపారు. అయితే రోగులకు శుక్రవారం నుంచి ఆపరేషన్లు చేస్తామని పేర్కొన్నారు.