హైదరాబాద్

మొక్కలు నాటితేనే నిర్మాణ అనుమతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 12: రోజురోజుకి కాంక్రీట్ జంగిల్‌గా మారిపోతున్న మహానగరంలో మానవ మనుగడ, పర్యావరణ పరిరక్షణ కోసం సర్కారు కాస్త కఠినమైన నిర్ణయాలు తీసుకునే అవకాశముంది. ఇప్పటికే హరితహారం కార్యక్రమంలో మున్సిపల్ వ్యవహారాల శాఖ మంత్రి కె. తారకరామారావు అవసరమైతే చట్టసవరణ చేసైనా ఈ నిబంధనను అమలు చేస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే! అయితే ఈ అంశంపై ఇప్పటికే సర్కారుకు ప్రతిపాదనలు పంపినట్లు జిహెచ్‌ఎంసి కమిషనర్ జనార్దన్ రెడ్డి మంళవారం వెల్లడించారు. ప్రతిపాదనకు సర్కారు ఆమోదం తెలిపితే వెంటనే అమలు చేసే అవకాశమున్నట్లు కూడా ఆయన వెల్లడించారు. అయితే వంద మీటర్ల స్థలాలకు ఈ నిబంధనను మినహాయించినట్లు, అంతకు మించి ఉన్న ఖాళీ స్థలాల యజమానులు మొక్కలను నాటితేనే భవన నిర్మాణ అనుమతలివ్వనున్నట్లు ఆయన వెల్లడించారు. ఇప్పటికే ఈ విషయం ‘వల్టా’ చట్టంలో ఉన్నట్లు ఆయన తెలిపారు. అయితే వంద మీటర్ల నుంచి ఆపై సైజుల్లో ఉంటే ప్లాట్లలో ఏ సైజు ప్లాటుకు ఎన్ని మొక్కలను పరిమితం చేయాలన్న అంశంపై సర్కారు స్పష్టత ఇవ్వాల్సి ఉందని కమిషనర్ తెలిపారు. ఖాళీ ప్లాటులో మొక్కలుంటేనే అనుమతులు, నిర్మాణం పూర్తయిన తర్వాత కూడా ఆ మొక్కలుంటేనే అక్యుపెన్సీ సర్ట్ఫికెట్‌ను విడుదల చేయాలని యోచిస్తున్నట్లు కమిషనర్ తెలిపారు. హోర్డింగ్‌లపై కూడా కోర్టు ఆదేశాల మేరకు ఇదివరకే కొన్ని తొలగించామని, అనధికార హోర్డింగ్‌ల తొలగింపును ముమ్మరం చేయనున్నట్లు ఆయన తెలిపారు.
మున్ముందు మీరు కోరిన మొక్కలు
ఒకే రోజు 25 లక్షల మొక్కలు నాటేందుకు చేపట్టిన మెగా ప్లాంటేషన్ హరితహారం కార్యక్రమంలో జిహెచ్‌ఎంసికి అందుబాటులో ఉన్న సుమారు 80 రకాల మొక్కలను ప్రజలకు పంపిణీ చేశామని, ఇకపై ప్రజలు కోరుకునే మొక్కలను అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు కమిషనర్ జనార్దన్ రెడ్డి తెలిపారు. మంగళవారం కూడా నగరంలోని వివిధ ప్రాంతాల్లో దాదాపు 5వేల మొక్కలను నాటినట్లు కమిషనర్ తెలిపారు.