హైదరాబాద్

గ్రేటర్‌కు త్వరలో అదనంగా గోదావరి జలాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 13: రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గోదావరి ప్రాజెక్ట్‌పనులు పూర్తి కావడంతో ప్రస్తుతం గ్రేటర్ ప్రజల నీటి అవసరాల నిమిత్తం 86 ఎంజిడిల నీటిని సరఫరా చేస్తున్నారు. రూ.3350 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన గోదావరి జలాల తరలింపు ఫథకంలో భాగంగా దాదాపు 172 ఎంజిడిల నీటిని సరఫరా చేయాల్సి ఉంటుంది. గ్రేటర్ హైదరాబాద్‌లో నీటిని నిలువ చేయడానికి సరపడా రిజర్వాయర్‌లు లేకపోవడంతో జలమండలి అధికారులు ప్రస్తుతం 86ఎంజిడిల నీటిని సరఫరా చేస్తున్నారు.గోదావరి జలాల తరలింపునకు సంబంధించి జలమండలి ప్రాజెక్ట్ విభాగం అధికారులు కరీంనగర్ రామగుండం సమీపంలోని ముర్మురు గ్రామం వద్ద ఇన్‌టెట్ స్ట్రక్చర్‌తో పాటు నీటి పంపింగ్ స్టేషన్‌ను ఏర్పాటు చేశారు. నీటి పంపింగ్‌కు సంబంధించి ఇక్కడ ఆరు పంపింగ్ మోటార్లను జలమండలి అధికారులు అందుబాటులో ఉంచారు. ఆరు పంపుల్లో ప్రస్తుతం మూడు పంప్‌లు పనిచేయడంతో గ్రేటర్ ప్రజల అవసరాల నిమిత్తం 86 ఎంజిడిల నీటిని సరఫరా చేస్తున్నారు. మొత్తం ఆరు పంప్‌లలో నాలుగో పంప్‌ను కూడా త్వరలో ప్రారంభిస్తామని తద్వారా అధనంగా మరో 29 ఎంజిడిల నీటిని సరఫరా అవుతుందని చెప్పారు. దీంతో మొత్తం 115 ఎంజిడిల నీటిని జలమండలి సరఫరా చేస్తోంది. గోదావరి జలాల తరలింపు పథకంలో భాగంగా మొత్తం 172 ఎంజిడిల నీటిని సరఫరా చేయాల్సి ఉంది. కాని గ్రేటర్ హైదరాబాద్‌లో అందుబాటులో ఉన్న రిజర్వాయర్లను దృష్టిలో పెట్టుకుని దశలవారీగా నీటిని డ్రా చేస్తోంది. ఇంటింటికీ నల్ల పథకంలో భాగంగా ప్రతి గ్రామానికి నీటిని అందించాలన్న ప్రభుత్య లక్ష్యంలో భాగంగా గ్రేటర్ హైదరాబాద్‌కు ఆనుకుని ఉన్న శివారు ప్రాంతాల్లో నీటి సరఫరాను మెరుగుపర్చేందుకు ప్రభుత్వం రూ.1900 కోట్లతో పనులు చేపడుతోంది. ఇందులో ప్రధానంగా నీటిని నిల్వ చేసుకోవడం కోసం వివిధ ప్రాంతాల్లో 56 రిజర్వాయర్లను నిర్మిస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో నీటి సరఫరాను మెరుగుపర్చేందుకు నీటి పైప్‌లైన్ల ఏర్పాటు, నీటి పంపిణీ వ్యవస్థను మెరుగుపర్చడంతో పాటు అనేక అభివృద్ధి పనులను చేపట్టనున్నారు. ఈ పనులు 2017 ఫిబ్రవరి నాటికి పూర్తయితే గోదావరి జలాల తరలింపు ఫథకం-1లో ఐదు, ఆరు పంపింగ్ వ్యవస్థను ప్రారంభించి అదనంగా మిగిలిన 57 ఎంజిడిల నీటిని సరఫరా చేస్తామని జలమండలి ప్రాజెక్టు విభాగం అధికారులు తెలిపారు. బుధవారం జలమండలి ఎండి ఎం.దానకిషోర్ కరీంనగర్ జిల్లా రామగుండం సమీపంలోని ముర్మురు వద్ద ఉన్న గోదావరి జలాల తరలింపునకు సంబంధించిన రిజర్వాయర్, పంపింగ్ స్టేషన్‌ను ఆకస్మిక తనిఖీ చేశారు. డైరెక్టర్ డి.శ్రీ్ధర్‌బాబు, జనరల్ మేనేజర్లు బి.అనిల్‌కుమార్, బి.శివరాజ్ పాల్గొని ప్రాజెక్టు వివరాలను ఎండికి వివరించారు.