హైదరాబాద్

నకిలీ సర్ట్ఫికెట్ల గుట్టు రట్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 14: హైదరాబాద్‌లో నకిలీ సర్ట్ఫికెట్లు తయారు చేస్తున్న ముఠా గుట్టును వెస్ట్‌జోన్ పోలీసులు రట్టు చేశారు. టెన్త్, ఇంటర్, డిగ్రీ సర్ట్ఫికెట్లు విక్రయిస్తూ అక్రమార్జనకు పాల్పడుతున్న ఓ మహిళను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆమె నుంచి వివిధ యూనివర్శిటీలకు చెందిన 33 నకిలీ సర్ట్ఫికెట్లు, రూ,10,200లు నగదుతోపాటు కంప్యూటర్, సెల్‌ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. తోటపూడి నాగమణి (42) 2005లో అమీర్‌పేటలోని మోడల్ అకాడమిలో పని చేసి 2010లో ఎస్‌ఆర్‌నగర్‌లో ఈడిపి టెక్నాలజీ పేరుతో వ్యాపారం ప్రారంభించింది. అక్కడే ఎస్‌ఎస్‌సి, ఇంటర్, డిగ్రీ, ఇంజనీరింగ్, పోస్ట్‌గ్రాడ్యుయేట్ నకిలీ సర్ట్ఫికెట్లను తయారు చేయడం ప్రారంభించింది. వినోబాభావె యూనివర్శిటీ, హజారిబాఘ్, సిఎంజె యూనివర్శిటీ మేఘాలయ, సిహెచ్ చరణ్‌సింగ్ యూనివర్శిటీ, మీరట్, సింగానియా యూనివర్శిటీ, రాజస్థాన్‌లకు చెందిన విద్యార్థుల డాటాను సేకరించి నకిలీ సర్ట్ఫికెట్లు తయారుచేసింది. బ్రోకర్లను ఏర్పాటు చేసుకొని ఎస్‌ఎంఎస్ ద్వారా నిరుద్యోగులకు వల వేసి సర్ట్ఫికెట్ల అమ్మకాలను చేపట్టింది. రూ. 75,000, రూ. 40,000, రూ. 50,000లు, రూ. 15,000లు, రూ. 12,000లు చొప్పున సర్ట్ఫికెట్లను విక్రయించింది. ఇప్పటి ఆమె 250 సర్ట్ఫికెట్లను అమ్మినట్టు వెస్ట్‌జోన్ టాస్క్ఫోర్స్ డిసిపి బి లింబారెడ్డి తెలిపారు.