హైదరాబాద్

3న ఉపాధ్యాయుల సామూహిక నిరాహార దీక్ష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చార్మినార్, జూలై 14: ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని కోరుతున్న ప్రభుత్వం నుంచి స్పందన లేదని, ఆగస్టు 3న సామూహిక నిరాహార దీక్ష నిర్వహిస్తున్నామని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షడు తీకుళ్ల సాయిరెడ్డి కోరారు. గురువారం బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ తెలంగాణ వచ్చిన తరువాత ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరింబడుతాయని ఆశించామని అన్నారు. ఉపాధ్యాయులకు పాత పెన్షన్ విధానాన్ని వర్తింపజేయాలని, ఆరోగ్యకార్డులతో కార్పొరేట్, ప్రైవేట్ ఆసుపత్రుల్లోనూ అన్ని జబ్బులకు వైద్య పరీక్షలు, ఓపి సౌకర్యం ఏర్పాటు చేయాలని అన్నారు. 10వ పిఆర్‌సి బకాయిలను వెంటనే నగదు రూపంలో చెల్లించాలని పేర్కొన్నారు. పండిట్, పిఇటి పోస్టులను అప్‌గ్రేడ్ చేయాలని డిమాండ్ చేశారు. ఎయిడెడ్ పాఠశాలలోప్రభుత్వ ఉపాధ్యాయులతో సమానంగా అన్ని సౌకర్యాలు కల్పించాలని కోరారు. అనంతరం దీక్షకు సంబంధించిన గోడపత్రికను విడుదల చేశారు. ఆగస్ట్ 3న హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్ వద్ద సాముహిక నిరాహర దీక్షకు ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో హాజరు కావాలని కోరారు. కార్యక్రమంలో పాలేటి వెంకటరావు, మహేంద్రారెడ్డి, బందారపు లింగస్వామి, నవాత్ సురేష్, లక్ష్మికాంతరావు, నర్ర భూపతిరెడ్డి, భూమయ్య పాల్గొన్నారు.