హైదరాబాద్

స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మాణంలో అవకతవకలు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 16: మహానగరంలో జిహెచ్‌ఎంసి చేపట్టే అభివృద్ధి పనుల్లో అధికారులు ఓ వైపు పారదర్శకత కోసం కసరత్తు చేస్తుంటే, మరో వైపు పనుల్లో అక్రమాలు, అవకతవకలు యదావిధిగా జరిగిపోతున్నాయి. కొన్ని సందర్భాల్లో కలిసి అవినీతికి పాల్పడిన ఇంజనీర్ల మధ్య పంపకాలు సరిగ్గా జరగక గుట్టు బయటపడిన సందర్భాలు కూడా లేకపోలేవు. ఈ క్రమంలో తాజాగా మరో అక్రమం వెలుగు చూసింది. గ్రేటర్ ఇంజనీరింగ్ డివిజన్ ఒకటి పరిధిలోని బండ్లగూడ కాల్సా ప్రాంతాల్లో రూ. 4.80 కోట్ల అంచనా వ్యయంతో మల్టీ లెవెల్ స్పోర్ట్స్ కాంప్లెక్సు నిర్మాణానికి ప్రతిపాదన సిద్దం చేశారు. ఇందుకు సంబంధిత మంజూరీ కూడా రావటంతో పనులు చేపట్టేందుకు అధికారులు సిద్ధమయ్యారు. అక్కడ ఎగ్జిక్యూటీవ్ ఇంజనీర్‌గా విధులు నిర్వర్తిస్తున్న అనుప్‌కుమార్ అనే ఇంజనీర్‌కు డిఇగా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు. ఈ క్రమంలో కాంప్లెక్సు నిర్మించతలపెట్టిన ప్రాంతాల్లో భారీగా రాళ్లు వచ్చాయి. అయితే వీటిని తొలగించే పనులు చేపట్టారు. ఈ విషయం ఇంజనీర్ అనుప్‌కుమార్ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లకుండా పనులు చేయించటమే గాక, సదరు కాంట్రాక్టర్‌కు రూ. కోటి బిల్లులు కూడా విడుదల చేశారు. ఈ క్రమంలో కొద్దిరోజుల క్రితం పదవీ విరమణ పొందిన చీఫ్ ఇంజనీర్ ఇంతియాజ్ అహ్మద్ ఈ విషయం తెలియటంతో ఉన్నతాధికారులకు తెలియకుండా పనులెలా చేపడుతారు? బిల్లులెలా మంజూరు చేస్తారన్న విషయంపై ఇంజనీర్‌ను ప్రశ్నించినట్లు తెలిసింది. అయితే ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అయిన తనకే డిఇగా కూడా అదనపు బాధ్యలు అప్పగించటం వల్ల పనులు చేపట్టినట్లు ఆయన సమాధానమిచ్చినట్లు సమాచారం. ఇందుకు సంతృప్తి చెందని ఉన్నతాధికారులు అంతేగాక, రాళ్లు తొలగించే పనులు ఏ మేరకు జరిగాయి? అందుకయ్యే వ్యయాన్ని అంచనా వేయాలని క్వాల్టీ కంట్రోల్ అధికారులను ఆదేశించగా, క్షేత్ర స్థాయిలో పరిశీలించిన అధికారులు ఈ పనుల్లో రూ. 30లక్షల నుంచి రూ 40లక్షల వరకు అవినీతి జరిగి ఉండవచ్చునని ప్రాథమికంగా నిర్థారించగా, ఈ వ్యవహారంలో అసలు విషయాలను వెలికి తీసేందుకు చీఫ్ ఇంజనీర్ త్రి సభ్య కమిటీని నియమించారు. కమిటీలో సభ్యులైన క్వాల్టీ సెల్ సూపరింటెండెంట్ ఇంజనీర్, సెంట్రల్ జోస్ సూపరింటెండెంట్ ఇంజనీర్, విజిలెన్స్ అదనపుఎస్పీలు త్వరలోనే ఈ వ్యవహారంపై ఇంజనీర్ అనుప్‌కుమార్‌ను విచారించనున్నట్లు తెలిసింది.